Friday, May 25, 2012

SSC 2012 ఫలితాలు - Z.P హై స్కూల్ నాదెండ్ల

నిన్న (24-5-12) పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. మార్కులకు బదులుగా గ్రేడులు ఇవ్వటం విద్యార్ధులకు, తలిదండ్రులకు కొంత అసంతృప్తిని మిగిల్చింది. ప్రతి సబ్జెక్టునకు పది పాయింట్ల చొప్పున కేటాయించారు. 6 సబ్జెక్టు లలో వచ్చిన పాయింట్ సరాసరి తీసుకోని GPA గా నిర్ణయించారు. సబ్జెక్టు లో వచ్చిన పాయింట్ లను బట్టి విద్యార్ధికి వచ్చిన మార్కులను సుమారుగా తెలుసుకోవచ్చు. అనగా సబ్జెక్టు కు గరిష్టంగా 8 మార్కుల వరకు వ్యత్యాసం తో మొత్తం మీద గరిష్టంగా 48 మార్కుల వ్యత్యాసం తెలుసుకోగలము. GPA 10 వచ్చిన విద్యార్ధి మార్కులు 552 నుండి 600 మధ్య ఉండవచ్చు. కనుక ఎవరికి ఎన్ని మార్కులు?ఎవరు ముందు? ఎవరు వెనుక? తెలియదు. నో టెన్షన్. కూల్...!! విద్యార్ధుల మీద ఉండే విపరీతమైన టెన్షన్ తగ్గించి, కార్పోరేట్ విద్య సంస్థలకు ముకుతాడు వేయడం గ్రేడింగ్ విధానం లక్ష్యం.

నాదెండ్ల హై స్కూల్ లో 69 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా అందు 61 మంది విద్యార్ధులు పాస్ అయ్యారు. పాశం రాజ్య లక్ష్మి 9.7 GPA సాధించి మొదటి స్థానం లో నిలువగా, బొట్టు శిరీష, అలుగునీడి లక్ష్మి ప్రసన్న, 9.3 GPA సాధించి రెండవ స్థానం లో నిలిచారు.

Monday, May 21, 2012

పిడుగు పడిన చెట్టు

నాదెండ్ల గ్రామంలోని రమణయ్య గారి గోపాల రావు గారి పొలం లోని జమ్మి చెట్టు మీద పిడుగు పడి చెట్టు పాక్షికం గా దెబ్బతిన్నది.



కళా నిలయం పోటీలలో గద్దర్ ప్రసంగం 19-05-12

29 జాతీయ స్థాయి కళా నిలయం పోటీలు మే 16 నుండి 19 వరకు చిలకలూరిపేట లో జరిగాయి. పోటీలలో ఎంతో మంది కళా కారులు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. ముగింపు సమావేశానికి ప్రజా గాయకుడూ గద్దర్ విచ్చేసి ప్ర"సింగ్"గించారు. పోటీలను శ్రీ ప్రగడ మోహన్ రావు గారు గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. పగలు పట్టణం లోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు, రాత్రి RVSCVS హై స్కూల్ నందు జరిగాయి.


కుడి వైపు బాలిక పక్కనే ఉన్నది పోటిల నిర్వాహకులు శ్రీ ప్రగడ మోహన్ రావు గారు. ఫోటో లో గద్దర్ కూడా ఉన్నారు.

రేలా..రేలా..


బండెనక బండి కట్టి ...

కర్టెసీ: (videos)శ్రీ modern మహేష్ గారు, డైరెక్టర్, modern విద్యా సంస్థలు
ఫొటోస్: శ్రీ అజిత్ కుమార్ గారు www.chilakaluripet1.blogspot.in

Friday, May 18, 2012

నల్లమోతువారి తాంబూలం -మూడవ ( చివరి) భాగం

గోవర్దన స్వామి ఆలయం వద్దకు చేరిన వీరలక్ష్మి నవాబు పంపిన అధికారులతో " ఒక మేడి తెప్పించండి. దానిని మీ సమక్షంలో నాటుతాను. మూడు రోజులలో దానికి ఆకులు వస్తాయి" అని చెప్పింది. అప్పుడు అధికారులు ఊరంతా వెదికించి అరవై, డెబ్బై సంవత్సరాల నుండి వాడుతున్న తుమ్మమేడి ని తెప్పించి ఇచ్చారు. మేడిని తీసుకున్న వీరలక్ష్మి పాది తీయించి, మేడికి పసుపు కుంకుమలు సమర్పించి పూజ చేసి పాదిలో నాటింది. రెండు రోజుల పాటు మార్పు చూపించని మేడి మూడో రోజు తెల్లవారే సరికి ఆకులతో కళకళలాడుతూ కనిపించింది. ( మూడు రోజులు మేడి చుట్టూ కొందరు కావలిగాళ్ళని కాపలా ఉంచారు. తుమ్మ కట్టె ఎండిపోయినది అయితే ఇగురు పెట్టదని అరవై సంవత్సరాల నుండి వాడుతున్న తుమ్మ మేడిని తెప్పించారు.)

విషయం తెలుసుకున్న నవాబు తన తప్పు తెలుసుకొని క్షమించమని కోరి, "మీ కోరిక ఏమిటో చెప్పండి తీరుస్తాను" అనగా, పైట పన్ను రద్దు చేయమని కోరగా... "అది ఎలాగు చేస్తాను, మీకు ఏమి కావాలి?.. మాన్యాలు, బంగారు ఆభరణాలు, ఆవులు.. వీటిలో ఏది కావాలన్నా ఇస్తాను" అనగా, " అయ్యా! మాకు విధమైన కానుకలు వద్దు. శుభకార్యం జరిగేటప్పుడు నల్లమోతు వారి పేరిట ఒక తాంబూలం తీయాలి" అని అడిగారు.

ఎంతో సంతోషించిన నవాబు వారు కోరుకున్న విధంగా తన రాజ్యమంతా శుభకార్యాలలో నల్లమోతు వారి తాంబూలం తీయాలని ఒక ఫర్మానా విధించాడు. నాటి నుండి ఆంధ్ర దేశమున అని కులాల వారు శుభకార్యాలు జరుగునపుడు దేవుని తాంబూలంతో పాటు, నల్లమోతు వారి తాంబూలం తీయుట ఆచారంగా వచ్చుచున్నది. ఇలాంటి అరుదైన విషయం కేవలం నాదెండ్ల గ్రామమునకు మాత్రమే స్వంతము.

నల్లమోతువారి తాంబూలం -2 వ భాగం

పైట పన్నుకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె ప్రకారంగా దివిటీలు పట్టే వ్యక్తి ఎడమ చేతితో దివిటి పట్టి నవాబు గారికి ఎదురు నిల్చున్నాడు. మంగళ వాయిద్యం వాయించే వ్యక్తి ఎడమ చేతితో వాయిస్తున్నాడు. సభలో ఉన్న వివిధ ఉద్యోగులు ఎడమ చేతితో సలాం చేసారు. విధంగా ఆస్థానంలోని వ్యక్తులందరూ కుడిచేతిని ఉపయోగించక పోవటం అమర్యాదగా భావించిన నవాబు " ఏమిరా! ఆస్థానంలో అందరికి ఒకేసారి కుడి చేయికి పక్షవాతం వచ్చిందా? ఎడమ చేతితో పని చేస్తూనన్ను అవమానపరుస్తున్నారు, మీ అందరికి కఠిన శిక్ష విధించగలను" అని గద్దించాడు. అందరు " అయ్యా! మా కుడి చేయి నాదెండ్ల గ్రామం లోని నల్లమోతు వారి సమ్మెలో ఉంది. అందుకే ఎడమ చేతితో పని చేస్తున్నాము" అని వినయంగా సమాధానం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న నవాబు నాదెండ్ల గ్రామానికి చెందిన తమ్మినీడు సోదరులను పిలిపించాడు. సమ్మె ప్రకటించి రాజాజ్ఞ ధిక్కారమునకు పాల్పడుతున్నారు అని గద్దించి అడుగగా, " అయ్యా! మీ రాజాస్థానం లో ఉన్న ఆడ వారికి కూడా పైట కొలతలు తీసి అప్పుడు మా వద్దకు రండి " అని జవాబిచ్చారు. ఆగ్రహంతో ఉగిపోయిన నవాబు " ఓరీ! రాజాస్థానంలో ఉన్న మహిళలు సచ్చీలురు, వారికి మీలాంటి అధములతో పోటీనా?" అని గద్దించాడు. అప్పుడు తమ్మినీడు సోదరులు " ప్రభూ మీరు మా గ్రామానికి వస్తే మా స్త్రీల సచ్చీలత , ప్రాతివత్యమును నిరుపిస్తాముఅన్నారు ". నవాబు వారి వెంట తన అధికారులను గ్రామమునకు పంపించాడు. తమ్మినీడు సోదరులు ఇంటికి వచ్చి తమ సోదరి వీర లక్ష్మికి విషయం తెలిపినారు. అప్పుడు వీరలక్ష్మి అధికారులను గోవర్ధన స్వామి గుడి వద్దకు రమ్మని కబురు పంపినది. పరీక్షకు సిద్ధమని తెలిపినది. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ గుడి వద్దకు చేరుకున్నారు.( to be continued...)