నాదెండ్ల గ్రామంలో వేంచేసియున్న నారాయణ స్వామి వారి ఆరాధనోత్సవాలు ది.02-08-2010 సోమవారం ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా స్వామి వారిని ఆదివారం సాయంత్రం ఊరేగించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి కొబ్బరి కాయలు, కానుకలు చెల్లించారు. సోమవారం ఉదయం నారాయణ స్వామి మఠం లో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారికి భక్తులు పది మానికల పొంగలి, పది మానికల పులిహోర సమర్పించి అనంతరం ప్రసాదములు పంచినారు. సాయంత్రం ఎనిమిది గంటలనుండి స్వామి వారి భజనలు జరిగాయి. శ్రీ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం స్వామి వారు సజీవ సమాధి పొందిన రోజు అనగా ఆషాడ బహుళ సప్తమి నాడు జరుగును. ఈ రోజు మిట్టపల్లి లోని పెద్ద మఠం లో కూడా ఘనంగా ఉత్సవాలు జరుగును.
Note: This post is publised from 'CITY INTERNET AND CELLWORLD', KALAMANDIR CENTER, CHILAKALURIPET.