Saturday, December 31, 2011

బ్యాంక్ ఆఫ్ బరోడా- నాదెండ్ల శాఖ- నూతన సంవత్సర శుభాకాంక్షలు


నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, నాదెండ్ల శాఖ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శ్రీ శ్రీనివాసులు గారు , మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాదెండ్ల శాఖ.


శుభాకాంక్షలతో బ్యాంక్ సిబ్బంది. ...
HAPPY NEW YEAR
2012

నాదెండ్ల ఆన్ లైన్- నూతన సంవత్సర శుభాకాంక్షలు 2012

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు, నాదెండ్ల గ్రామస్తులకు, శ్రేయోభిలాషులకు నాదెండ్ల ఆన్ లైన్ నిర్వాహకుల హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

HAPPY NEW YEAR -2012
శ్రీనివాసరావు, కుమారస్వామి
నాదెండ్ల ఆన్ లైన్

CD పాఠశాల - నూతన సంవత్సర శుభాకాంక్షలు

వీక్షకులకు, నాదెండ్ల గ్రామస్థులకు ఉపాధ్యాయ బృందం, CD పాఠశాల, అంబేద్కర్ నగర్, నాదెండ్ల వారి హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు- 2012

Thursday, December 29, 2011

ZP స్కూలుకు విరాళం

శ్రీ జయశంకర్ గారు

HM శ్రీ . ఆంజనేయులు గారు



ZP హై స్కూల్ నందు స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీ జయశంకర్ గారి శిష్యుడు B. రఘునాధ రెడ్డి పాఠశాలకు సుమారు 40000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దానితో పిల్లల కోసం బెంచీలు తాయారు చేయిస్తున్నామని, జనవరి లో దాత తండ్రి శ్రీ B. నరసిరెడ్డి గారు, (బ్యాంకు మేనేజర్, syndicate బ్యాంకు, సంతమాగులూరు) పాఠశాల ను సందర్శిస్తారని HM శ్రీ . ఆంజనేయులు గారు చెప్పారు. తన స్వస్థలం నాదెండ్ల కానప్పటికీ ఒకప్పుడు తను చదువుకున్న మాస్టారు పనిచేస్తున్న పాఠశాలకు విరాళమివ్వాలని అనుకున్న దాత శ్రీ B. రఘునాధ రెడ్డి (NRI) గారి సంకల్పం హర్షనీయం. అటువంటి శిష్యులు కలిగియున్న జయశంకర్ మాస్టారు అభినందనీయులు.

cake for display at ratna bakery


for many more happy days still to come..... welcome 2012 !!!
merry christmas happy new year!

Thursday, December 15, 2011

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదలచిన వారికి సూచనలు, సలహాలు ఇచ్చుటకు ఆహ్వానం

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు శుభాభివందనాలు. మన గ్రామంలో యువతరం ఎక్కువగా ఇంజనీరింగ్ చదువుతున్నవారే. ఇంజనీరింగ్ లో బ్రాంచ్ తీసుకున్న ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి కారణం 1. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు 2. కాంపస్ ఇంటర్వ్యూ లు . ఆకర్షనీయమైన శాలరీ 4. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు 5. సమాజంలో గౌరవం మొదలైనవి. కనుక ఇంజనీరింగ్ చదువుతున్న వారికి, పూర్తయ్యి హైదరాబాద్ వంటి చోట్ల సాఫ్ట్ వేర్ కోర్సెస్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి, కాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వటానికి ఎదురు చూస్తున్న వారికి, జాబ్ లో కొత్తగా జాయిన్ అయిన వారికి సీనియర్స్ యొక్క సూచనలు, సలహాలు ఎంతైనా అవసరం అని భావిస్తున్నాము. ఏయే కోర్సెస్ లో మంచి అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి అర్హతలు కావాలి? ఎలాంటి బుక్స్ చదవాలి ?ఏయే institutes లో శిక్షణ బాగుంటుంది ? Resume ఎలా తాయారు చేసుకోవాలి? ప్రాజెక్ట్ మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ అవసరమవుతాయి? HR తో ఎలా మేనేజ్ చెయ్యాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? వీటికి ఉపయోగపడే websites ఏమిటి? మొదలైన విషయాలలో సీనియర్లు గా మీ అనుభవాలు, సలహాలు, సూచనలు వారికి ఎంతగానో లాభిస్తాయి. మీరు ఇవ్వదలచుకున్న సలహాలు మెయిల్ రూపంలో గానీ (mannekumaraswamy@gmail.com), ఈ పోస్టింగ్ కి కామెంట్ రూపంలో గానీ ఇచ్చి వారికి సహాయ పడగలరని ఆశిస్తున్నాము.
ఇట్లు
మన్నెకుమరస్వామి, నాదెండ్ల ఆన్ లైన్.

చిలకలూరిపేట లో TTD ఆన్ లైన్ సేవ కేంద్రం

E-దర్శన్ కౌంటర్ ఆర్య వైశ్య కళ్యాణమండపం లో దాదాపు సంవత్సరం క్రిందట ఏర్పాటు చేయబడినది. శ్రీ వారి సేవ లకు 60 రోజుల ముందుగ రిజర్వేషన్ చేయించుకోవాలి. సుదర్శనం టోకెన్ కూడా తీసుకోవచు.


Sunday, December 4, 2011

A Look Around The Mandal

చిరుమామిళ్ళ
శ్రీ నడికట్టు రామిరెడ్డి గారి దాత్రృత్వం

కార్పొరేట్ స్థాయిలో ఉన్న నిర్మాణం ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే నమ్మలేం కదా! గోల్కొండ హోటల్స్ అధినేత శ్రీ నడికట్టు రామిరెడ్డి గారి స్వ స్థలం చిరుమామిళ్ళ. ఆయన గ్రామాన్ని అభి వృద్ధి చేయదలచి, ఉన్నత పాఠశాల నిర్మాణం గావించారు. అంతే కాక చిరుమామిళ్ళ గ్రామానికి ఉపయోగపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.



*********************
తూబాడు RCM స్కూలు


తూబాడులోని RCM స్కూలు చాల neat గా ఉంది. గ్రౌండ్ చాల శుభ్రంగా ఉంది. రెండు, మూడు వేప చెట్లు ప్రాంతం మొత్తాన్ని కవర్ చేసాయి. మంచి నీడ. మేము( టీచర్స్ యూనియన్ సభ్యత్వానికి) వెళ్లేసరికి అక్కడ inspection జరుగుతుంది. స్కూలు వాతావరణం తెగ నచ్చేసింది.

****************

సంక్రాంతిపాడు

సంక్రాంతిపాడు మొదటిసారి వెళ్ళాను. అక్కడి ఉన్నత పాఠశాల లో 144 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. కొన్ని తరగతి గదుల నిర్మాణం పూర్తి కావలసి ఉంది.
*********************

సాతులూరు-చందవరం
నాదెండ్ల మండలంలో రైల్వే స్టేషన్ సాతులూరు లోఉంది. మీరెప్పుడైన అక్కడికి వెళ్లారా !!
(బలహీనత: రైలు కనపడిందంటే పెట్టెలు లెక్కపెట్టకుండా ఉండలేను)

*********************వరి పైరు - సస్యశ్యామలాం మాతరం !!

పంట చేలకు నీటి ఎద్దడి

సాగర్ కలువ నుండి నిరు అందాకా పోవటంతో పంట చేలకు చాలినంత నీరు లేదు. బట్టుకుంట లో అడుగంటిన నీటిని దగ్గర పొలాలకు ఇంజెన్ల ద్వారా అందిస్తున్నారు.