Thursday, September 29, 2011

మొక్కల పెంపక కేంద్రం

నాదెండ్ల హై స్కూల్ దాటిన తరువాత రెండు మొక్కల పెంపక కేంద్రాలు కనిపిస్తాయి. హై స్కూల్ పక్కనే ఉన్న నర్సరీ లోకి వెళ్లి చూద్దామా!!


ఇక్కడ మొక్కలను నాటటానికి నేల కాకుండా గుంటలు కలిగిన రబ్బరు పాడ్ లను వాడుతున్నారు. విత్తనాలను నాటటానికి మట్టికి బదులు కొబ్బరి పీచు కి అంటుకుని ఉండే మెత్తని పదార్ధాన్ని వాడుతున్నారు..
రబ్బరు పాడ్ లోని గుంటలలో కొబ్బరి పీచు లోని మెత్తని పదార్ధాన్ని నింపి అందులో విత్తనాలు నాటుతారు. మొక్క పెరిగిన తరువాత వేర్లు పాడవ కుండ సులువుగా తీయవచ్చు
పాడ్ లను తడపటానికి పైప్స్ ద్వార వాటరింగ్ చేస్తున్నారు. వర్షం పడినప్పుడు కప్పటానికి కవర్స్ రెడీ గా ఉన్నాయి ( పాడ్ లలో ఎక్కువ నీరు చేరి కొబ్బరి పీచు పొడి నుండి మొక్క పడి పోకుండా ఉండటానికి ) .

ప్రస్తుతం ఆర్డర్ పై మిరప నారు పెంచుతున్నారు.
ఖాళీ రబ్బర్ పాడ్ లు.

Wednesday, September 21, 2011

అక్కినేని నాగేశ్వర రావు గారి కాంతారావు గారు (20-9-2011)

కాంతారావు గారి ఇంటికి (షాపుకి) వెళితే, గోడలకు తగిలించిన ఫోటోల వంక చూస్తూనే ఉంటాము. బాల్యంలోకి జారి పోతాము. తెలియని ఆనందం ఆవహిస్తుంది. చిన్నప్పటి hero worship గుర్తువస్తుంది. అయన అభిమానానికి ఆశ్చర్యం కలుగుతుంది. నాగేశ్వర రావు గారితో ఆయన అనుబంధం అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది. అక్కినేనికి జన్మ దిన శుభాకాంక్షలు తెలుపటానికి అయన హైదరాబాద్ వెళ్లారు.







Sunday, September 18, 2011

వార్షిక సమీక్ష - శేష భాగం


     నాదెండ్ల ఆన్ లైన్ వారధిగా సఫలమైన కొన్ని కార్యక్రమాలు

 స్వంత లాభం కొంతమానుక పొరుగు వారికి తోడు పడవోయ్ అన్న గురజాడ వారి మాటను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో అనేక మంది పాఠశాలల అభివృద్ధికి, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఎంతో చేయూతనిచ్చారు.కొందరు మెడికల్ క్యాంపులు నిర్వహించారు.ఆసక్తి ఉన్నవారికి వేదిక చూపించాలనే ఉద్దేశ్యంతో దాతల సహకారంతో ఈ సంవత్సరకాలంలో చేసిన పనుల వివరాలు.
1. స్థానిక మండల పరిషత్ సి.డి. పాఠశాలలో ప్రముఖ దంత వైద్యుడు శ్రీ పేర్ని కృష్ణ మోహన్ గారిచే దంత వైద్య శిబిరం నిర్వహించి, విద్యార్ధులకు పేస్టులు, బ్రష్ లు ఉచితంగా అందిచటం జరిగింది.

2. శివాలయం వీధి లోని మండల పరిషత్ హెచ్.ఇ పాఠశాలకు నల్లమోతు జయరాం గారిచే రు.10,000 విలువైన విరాళం అందజేయుట జరిగింది.ఈ సొమ్ముతో పాఠశాలలో తరగతి గదులలో చెక్క షెల్ప్ లు తయారుచేయించటం జరిగింది.
3. అదే పాఠశాలకు అక్కయ్య చౌదరి గారిచే రు.3116 లు అందజేయుట జరిగింది. ఈ సొమ్ముకు అదనంగా మరికొంత చేర్చి, తరగతి గదుల గోడల మీద పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు పెయింట్ చేయుట జరిగింది.

4.స్థానిక సి.డి. స్కూలుకు అసిస్ట్ వారిచే రు. 11,000 విలువైన బాత్ రూం నిర్మాణం జరిగినది.
5.సంక్రాంతి సెలవలకు స్వగ్రామము వచ్చి స్థానిక సి.డి స్కూల్ ను దర్శించిన నల్లమోతు జయరాం గారు పాఠశాల పనితీరు మెచ్చి  పాఠశాల అవసరాన్ని గ్రహించి ఒక లాప్ టాప్ బహుకరించారు.
6. గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి అత్యవసరంగా రక్తం అవసరమైతే రక్తదానం చేయటం జరిగినది.
7. నాదెండ్ల హైస్కూల్ నందు గ్రామ స్థాయిలో 10వ తరగతి చదివే విద్యార్ధులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియం లలో టాలెంట్ టెస్ట్ నిర్వహించటం జరిగింది. మొదటి బహుమతి 1116-00 రు. గోరంట్ల పూర్ణయ్య, రెండవ బహుమతి 516-00రు. దగ్గుబాటి చంద్ర శేఖర్, 3వ బహుమతి వేములపల్లి శ్రీకాంత్ ఇవ్వటం జరిగింది.
గ్రామంలో ఇలా టాలెంట్ టెస్ట్ నిర్వహించుట ఇదే మొదటిసారి.
8. ఈ క్రార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల పూర్వవిద్యార్ధులు మురళి, సాంబశివరావు, శివరావు, హరిబాబు పాఠశాలకు లేజర్ ప్రింటర్, కార్డ్ లెస్ మైక్ సమకూరిస్తామని హామీ యిచ్చారు.మా మాట మన్నించి పై కార్యక్రమాలకు చేయూతనిచ్చిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.
     వేసవి సెలవులలో విద్యార్ధుల కొరకు ఉన్న కొన్ని కార్యక్రమాలు రూపొందించినప్పటికీ మాకు ఉన్న విపరీతమైన పని వత్తిడి కారణంగా వాటిని వాయిదా వేయటం జరిగింది.

పైన పేర్కొన్న  విరాళాలు  ఎవరికైతే ఉద్దేశించబడినవో స్వయంగా వారే వాటిని అందుకున్నారు. ఇచ్చిన సొమ్ముకు మరికొంత జోడించి పాఠశాలను అభివృద్ధి చేసుకున్నారు. ఎవరైతే దాతలు ఉన్నారో వారి విరాళంతో చేయించిన పనిని చూసి తమ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో మా పాత్ర అవసరానికి, దాతకు మధ్య వారధిగా ఉండటమే.
బ్లాగ్ నిర్వహణ కొరకు Canon 10MP కెమెరా, 4GB పెన్ డ్రైవ్ వేములపల్లి శివబాబు గారికి, 15000రు. విలువ కలిగిన DVR(Digital Video Recorder) ను అందజేసిన గంగవరపు శ్రీనివాస రావు గారికి  మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
మీ అందరి అభిమానంతో, ఆశిస్సులతో ఈ బ్లాగ్ కలకాలం నిలబడాలని ఆశిస్తూ ..

       కుమార  స్వామి  & శ్రీనివాస రావు

Saturday, September 10, 2011

చిలకలూరిపేట లో వినాయక చవితి



ఆర్య వైశ్య కళ్యాణ మండపం దగ్గర
చిన్న రధం దగ్గర (బంగారపు కొట్ల బజారు కరెన్సీ తో అలంకరణ )

చలివేంద్రం బజారు
క్రేజీ గైస్ వారి పందిరి (కరెన్సీ తో అలంకరణ)
రైస్ మిల్ బజారు.

నిమజ్జనం కోలాహలం

Sunday, September 4, 2011

నాదెండ్ల లో వినాయక చవితి 1-9-2011

తెల్లవారు జాము సుమారు ఐదున్నర   గంటల సమయం 


 


 ఉదయం పదిన్నర సమయం


 
  మద్యాన్నం
 


 


 సాయంత్రం