Monday, April 30, 2012
జిల్లాలో అకాల వర్షం- పిడుగులు, మెరుపులతో భీతావాహం
గుంటూరు జిల్లాలో నిన్న మధ్యాన్నం 12 నుండి 4 గంటల మధ్యలో పిడుగులతో కూడిన వర్షం వర్షం పడింది. పది మంది వరకు పిడుగుపాటుకు బలయ్యారు, అనేక మంది గాయపడ్డారు. నాదెండ్ల మండలం గణపవరం లో బీహార్ కి చెందినా ఒక యువకుడు, చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఒక స్త్రీ , యడ్లపాడు మండలం ఉప్పరపాలెం లో ఒక మహిళా మృతిచెందారు. చిలకలూరిపేట లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడ్డాయి.
Sunday, April 22, 2012
C.D. పాఠశాల 2 వ వార్షికోత్సవం 21-4-12
స్థానిక అంబేద్కర్ నగర్ లోని C.D. పాఠశాల నందు ది. 21-4-12 శనివారం 2 వ వార్షికోత్సవం జరిగింది. నాదెండ్ల లోని అన్ని పాఠశాల ల ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. బ్రహ్మాజీ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం జరిగిన కార్యక్రమాల గురించి అయన వివరించారు. పిల్లలను గుర్తింపులేని ప్రైవేటు కాన్వెంట్ లకు పంపవద్దని అయన తల్లితండ్రులను కోరారు.
పాఠశాల లో గతం లో పని చేసిన శ్రీ మన్నే కుమారస్వామి గారు పాఠశాల తో , ఉపాధ్యాయ వృత్తి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాఠశాల బోధనోపకరణ సామాగ్రి ఉపయోగార్ధం కుమారస్వామి గారు ప్రధానోపాధ్యాయుల వారికి రూ. 5000/- నగదును ఈ సందర్భం గా అందజేసారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసారు.
స్థానిక బ్యాంకు అఫ్ బరోడా లో పని చేయుచున్న శ్రీ శ్రీనివాసరావు గారు 5 వ తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన ఒక బాలునికి, బాలికకు రూ.1000/- విలువ గలిగిన బ్యాగ్ , డిక్షనరీ, ప్యాడ్ మొదలైన వస్తు సామాగ్రి బహుమతిగా అందజేసారు.

Modern విద్యా సంస్థల వితరణ:
పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా చిలకలూరిపేట Modern విద్యా సంస్థల అధినేత శ్రీ చేబ్రోలు మహేష్ గారు, పాఠశాల కు రూ. 5000/- విలువ కలిగిన టేబుల్ అందజేయనున్నట్లు HM గారు ఈ సందర్భంగా సభకు తెలియజేస్తూ ఆయనకు ధన్య వాదాలు తెలిపారు.

ఐద్వా ప్రాంతీయ శాఖ అధ్యక్షురాలు అమరమ్మ గారు మాట్లాడుతూ ఆడపిల్లలను చదువు మాన్పించి, పనులకు తీసుకు వెళ్ళవద్దని తల్లితండ్రులను కోరారు.
విద్యా వాలంటీర్ శ్రీమతి N. సదా లక్ష్మి గారు ప్రతిభ కలిగిన విద్యార్ధులు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు.
అనంతరం ఆహుతులు పరీక్షలలోను, అట పాటల్లోనూ విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేసి వారిని ఆశీర్వ దించారు.
Sunday, April 15, 2012
Sunday, April 8, 2012
Subscribe to:
Posts (Atom)