నాదెండ్ల గ్రామస్తులందరికీ శుభవార్త. నాదెండ్ల గ్రామం నుండి వెళ్లి వేరు, వేరు ప్రాంతాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారు చాల మంది ఉన్నారు. వారి నందరిని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి, అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి చేయుట నిచ్చే ఒక బృహత్తర కార్యక్రమం జరగబోతుంది.దీని కొరకై ఒక అసోసియేషన్ లేదా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది.దీనిలో నాదెండ్ల గ్రామానికి చెందిన అందరు భాగస్వాములు కావాలని మా ఆకాంక్ష.మనలో చాల మంది విడి విడిగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా కాకుండా అందరు కలిసి చేస్తే సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. గడ్డి పోచలు విడిగా ఉంటే తేలికగా తెగి పోతాయి. ఆ గడ్డి పోచలు అనేకం కలసి ఒక తాడులాగా తయారైతే ఒక మద గజాన్ని సైతం బంధించ గలుగుతాయి కదా!
ఏ మొత్తం కార్యక్రమాన్ని శ్రీ నల్లమోతు జయరాం గారు (USA ) అయన మిత్రుల సహకారంతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చాల ఆలస్యం జరిగిపోయింది. ఆలోచించి సమయం వృధా చేయకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలని అయన చెప్పారు. దీని కొరకై అందరు కూడా మీ వద్ద ఉన్న మన మిత్రుల email -id లు , ఫోన్ నెంబర్ లను జయరాం గారికి పంపించవలెను. మీ అభిప్రాయాలూ, సలహాలు, సూచనలు నిరభ్యంతరంగా తెలియజేయవలెను. ఏ కార్య క్రమంలో నాదెండ్ల గ్రామానికి చెందిన అందరూ పాలు పంచుకోవాలనీ, గ్రామాభివృద్ధికి తోడ్పడాలనీ జయరాం గారు విజ్ఞప్తి చేస్తున్నారు.
జయరాం గారిని సంప్రదించుటకు: Telephone: 7193103358 (Mobile)
EmailId: JayaramNallamothu@yahoo.com