Sunday, April 28, 2013
Saturday, April 27, 2013
శ్రీ చెన్న కేశవ స్వామి వారి రధోత్సవం 25-4-13
సొమ్ము గోవర్ధన స్వామిది ....! సోకు చెన్నకేశవ స్వామిది .... !! గోవర్ధన స్వామి ఆలయ మాన్యాలు గోవర్ధన స్వామి పేరు మీద ఉన్నాయి . ముస్లిముల దండ యాత్ర అనంతర ఆలయ పునర్నిర్మాణం చేపట్టినప్పుడు చెన్న కేశవ స్వామి వారి విగ్రహాలు మాత్రమే లభించాయి . చెన్న కేశవ స్వామి వారు ప్రధాన దేవర గా ఆలయ నిర్మాణం జరిగింది . ఉత్సవాలన్నీచెన కేశవ స్వామి వారికే జరిపేవారు . అనంతర కాలం లో పాలకులు సమస్యను తెచ్చారు . మాన్యాలు గోవర్ధన స్వామి పేరు మీద ఉంటే , ప్రధాన దైవంగా చెన్న కేశవ స్వామి ఉన్నారు.. గోవర్ధన స్వామి లేనప్పుడు ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి అనేది సమస్య . ఈ సమస్య పరిష్కారం కొరకు కనిపించ కుండా ఉన్న గోవర్ధన స్వామి వారి కొరకు వెతుకుతున్నప్పుడు , స్వామి వారు సాతులూరు సమీపం లో కనిపించారు . అప్పుడు ఆ గోవర్ధన స్వామి వారిని ఆలయం లో ప్రతిష్టించుట జరిగినది . అప్పటినుండి గోవర్ధన స్వామి వారికి రధోత్సవం తప్ప మిగిలిన అన్ని సేవలు జరుపుతున్నారు .
చెన్న కేశవ స్వామి వారు ఒక్క రధోత్సవం నాడే ప్రధాన దైవంగా గ్రామోత్సవం లో దర్శనమిస్తారు . అత్యంత ఘనమైన రధోత్సవంను చెన్న కేశవ స్వామి వారు జరుపుకుంటారు కాబట్టి గ్రామస్తులు సొమ్ము గోవర్ధన స్వామిది ... సోకు చెన్న కేశవ స్వామి ది అని హాస్యమాడుకుంటారు
గోవర్ధన స్వామి, చెన్న కేశవ స్వామి వార్ల గ్రామోత్సవం 25-4-13
గోవర్ధన స్వామి ఆలయం
శ్రీ ఆంజనేయ స్వామి వారు
నాగేంద్ర స్వామి
చెన్న కేశవ స్వామి వారు
గోవర్ధన స్వామి వారు
హనుమంత వాహనం పై వేంచేసి ఉన్న గోవర్ధన స్వామి వారు
గరుడ వాహనం పై కొలువు దీరిన చెన్నకేశవుడు
శ్రీ గోవర్ధన స్వామి దేవస్థాన రక్షక భటునితో బాలుడు
***********
ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు
Subscribe to:
Posts (Atom)