సొమ్ము గోవర్ధన స్వామిది ....! సోకు చెన్నకేశవ స్వామిది .... !! గోవర్ధన స్వామి ఆలయ మాన్యాలు గోవర్ధన స్వామి పేరు మీద ఉన్నాయి . ముస్లిముల దండ యాత్ర అనంతర ఆలయ పునర్నిర్మాణం చేపట్టినప్పుడు చెన్న కేశవ స్వామి వారి విగ్రహాలు మాత్రమే లభించాయి . చెన్న కేశవ స్వామి వారు ప్రధాన దేవర గా ఆలయ నిర్మాణం జరిగింది . ఉత్సవాలన్నీచెన కేశవ స్వామి వారికే జరిపేవారు . అనంతర కాలం లో పాలకులు సమస్యను తెచ్చారు . మాన్యాలు గోవర్ధన స్వామి పేరు మీద ఉంటే , ప్రధాన దైవంగా చెన్న కేశవ స్వామి ఉన్నారు.. గోవర్ధన స్వామి లేనప్పుడు ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి అనేది సమస్య . ఈ సమస్య పరిష్కారం కొరకు కనిపించ కుండా ఉన్న గోవర్ధన స్వామి వారి కొరకు వెతుకుతున్నప్పుడు , స్వామి వారు సాతులూరు సమీపం లో కనిపించారు . అప్పుడు ఆ గోవర్ధన స్వామి వారిని ఆలయం లో ప్రతిష్టించుట జరిగినది . అప్పటినుండి గోవర్ధన స్వామి వారికి రధోత్సవం తప్ప మిగిలిన అన్ని సేవలు జరుపుతున్నారు .
చెన్న కేశవ స్వామి వారు ఒక్క రధోత్సవం నాడే ప్రధాన దైవంగా గ్రామోత్సవం లో దర్శనమిస్తారు . అత్యంత ఘనమైన రధోత్సవంను చెన్న కేశవ స్వామి వారు జరుపుకుంటారు కాబట్టి గ్రామస్తులు సొమ్ము గోవర్ధన స్వామిది ... సోకు చెన్న కేశవ స్వామి ది అని హాస్యమాడుకుంటారు
No comments:
Post a Comment