నాదెండ్ల గ్రామంలో గాధేయ గట్టు మీద వేంచేసియున్న శ్రీ సీతా రామ స్వామి ఆలయ పునర్నిర్మాణం జరిగి సుమారు 100 సంవత్సరాలు కావచ్చినది. ఇక్కడ వెేెం చేసియున్న శ్రీ సీతారామ స్వామి వారిని గాధేయ మహర్షి( బ్రహ్మర్షి విశ్వామిత్రులు) వారు స్వయంగా ప్రతిష్టించారని స్థల పురాణం. క్రీ.శ. 17 వ శతాబ్దిలో ముస్లింల దండ యాత్రలో గ్రామంలో జరిగిన దేవాలయాల ధ్వంసంలో భాగంగా శ్రీ సీతారామ స్వామి వార్ల విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగినది. ఆ విగ్రహాలు ఇప్పటికీ కొండమీద ఉన్నాయి.
క్రీ.శ. 1910 వ దశకంలో శ్రీ మునమా వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయమును పునరుద్ధరించి పునర్నిర్మాణం గావించారు. ఆ తర్వాత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టించారు.
ఆలయ పైకప్పు నిర్మాణం, పురాతనమైనది కావడంతో వర్షం పడినప్పుడు పైకప్పు నుండి వర్షం నీరు కారడం జరుగుచున్నది. యాగశాల, దేవుని కళ్యాణ మండపం మొదలైనవి కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని దృష్ఠి లో ఉంచుకొని స్థానిక భక్తులు పై కప్పు , మంటపం, యాగశాల మొదలైన వానికి మరమ్మత్తులు చేయాలని సంకల్పించారు . కాట్రగడ్డ నాగేశ్వర రావు, అనుమోలు నారాయణ స్వామి, మునమా లక్ష్మీ నారాయణ గార్ల ఆధ్వర్యం లో 15 మంది సభ్యులచే ఒక కమిటీ ని ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించారు. దీనికై దేవాదాయ శాఖ నుండి 2 లక్షల రూపాయలు మంజూరు అయినవి. మిగిలిన సొమ్ము అంతా భక్తుల నుండి విరాళములు సేకరించడం జరుగుతున్నది .
ప్రస్తుతం పైకప్పు నిర్మాణం, యాగశాల, మంటపం నిర్మాణం, సిమెంట్ పనులు పూర్తి అయినవి. ఇంకా ఎలివేషన్, ఆలయం చుట్టూ ఉన్న గోడ ప్లాస్టింగ్, రంగులు వేయడం, కరెంట్ పని, నేల మీద గ్రానైట్ పరచడం (ఫ్లోరింగ్), గోడలకు అవసరమైన చోట టైల్స్ అంటించడం లాంటి పనులు మిగిలి ఉన్నాయి. వీటికై భక్తుల సహకారం కోరటం జరుగుతున్నది. భక్తులు విరాళాలు గానీ ,పని చేయించడం కొరకు వస్తు రూపేణా గానీ సహకరించగలరు. ఆసక్తి ఉన్నవారు పైన తెల్పిన పనులు విడిగా చేయించవచ్చు .
వివరములు కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
1. కాట్రగడ్డ నాగేశ్వర రావు -8096055387
2, అనుమోలు నారాయణ స్వామి- 9700331234
3. మునమా లక్ష్మీ నారాయణ- 9666536228
పై సమాచారమును అందించినది కాట్రగడ్డ నాగేశ్వర రావు గారు, మునమా శ్రీనివాస రావు గారు.