Saturday, January 22, 2011

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,నాదెండ్ల

కీ ;శే . శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు

శ్రీ నల్లమోతు .రామమూర్తి గారు (మాజీ సర్పంచ్ )

మనగ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీనిని 1974 సం;లో నిర్మించినారు . పాఠశాలను సువిశాల ప్రాంగణనము లో నిర్మించుటకు, మన ఊరి ప్రజల అభివృధికి గాను పాఠశాల నిర్మాణమునకు ఎకరం స్థలమును కీ ;శే . శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు s/o వెంకట్రామయ్య (మాజీ మునుసుబు)గారు మరియు శ్రీ నల్లమోతు. రామమూర్తి గారు (మాజీ సర్పంచ్ ) గార్లు స్తలమును కు దాతలు.
1978
సం ; నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్ధులు విద్యావంతులుగా ఇతర జిల్లాలలో, రాష్ట్రాలలో ,దేశ విదేశాలకు ఉన్నత చదువులకు,ఉద్యోగాలకు వెళ్ళిన ఎంతో మంది ఆణిముత్యాలను(విజ్ఞానవేత్తలను) తయారు చేసింది.
వీరి లో కొందరు ప్రైవేట్
ఉద్యోగులుగాను, ప్రభుత్వఉద్యోగులుగాను, ఉపాద్యాయులుగాను, సాఫ్టవేర్ ఇంజనీర్ల గాను,డాక్టర్స్ గాను, రాజకీయ నాయకులగా వున్నారు.
మన
పాఠశాలలో చదివిన విద్యార్ధులకు తమ అప్పటి తీపి గుర్తులను,తమస్నేహితులను గుర్తుకు చేసుకొనే విధంగా 1978 నుండి 2010 సం:వరకు పదవతరగతి చదివిన విద్యార్ధుల వివరాలు ,వారి గ్రూప్ పొటోలు ,క్లాసుఫస్ట్ సాధించిన వారి వివరాలు, ఆటలలో ప్రధమ బహుమతి పొందిన వారి వివరాలు,వారి షీల్డ్స్ మో ......లైన
వివరాలను త్వరలో మీ ముందుకు .................

Tuesday, January 18, 2011

N.TR.15.వ వర్ధంతి కి "నాదెండ్ల ఆన్ లైన్ టీం" ఘన నివాళులు

నందమూరి తారక రామారావు 15 వర్ధంతి తెలుగు వాడిని, ప్రపంచానికి పరిచయం చేసి, తెలుగు వాడి సత్తానుచాటిచెప్పిన స్వర్గీయ శ్రీనందమూరి. తారక రామారావు గారి 15 . వర్ధంతి సందర్భం గా రోజు మనగ్రామం లో ఆయనకు "నాదెండ్ల ఆన్ లైన్ టీం" ఘననివాళులు అర్పించారు.

Monday, January 17, 2011

నాదెండ్ల గ్రామం లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

నాదెండ్ల గ్రామం లో సంక్రాంతి పండుగను అందరు ఘనంగా జరుపుకున్నారు .రైతుల పరిస్తితి అంత ఆశాజనకంగా లేకపోయనప్పటికి సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను చూసిన ఆనందంతో పండుగను ఉత్సాహంతో జరుపుకున్నారు.సెలవులకు ఇంటికివచ్చిన విద్యార్ధులు, ఉద్యోగులు తమ పని వత్తిడిని మరచిపోయి హాయిగా తమమిత్రులను కలసుకొని పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకొని సెలవులలో సేదతీరారు. గ్రామంలో పండుగ సందర్భంగా వివిధ ఆటలపోటిలను నిర్వహించారు. నల్లమోతు. రాజేంద్ర ప్రసాద్ (రాజా గారు ), గొంది. వీర కోటేశ్వరరావు గార్ల మెమోరియల్ వాలీ బాల్ పోటిలలో యడ్లపాడు R C M టీం మొదటి బహుమతి గెలుచుకోగా, రోండవ బహుమతి నాదెండ్ల చౌదరి యూత్ కైవసం చేసుకుంది. మూడోవ బహుమతి సాతులూరుకి చెందిన చౌదరి యూత్ పొందినది. సత్రం బజార్ గణేష్ యూత్ ఆద్వర్యం లో జరిగిన క్రికెట్ పోటిలలో ఫైనల్ లో మొదటి బహుమతి పవర్ స్టార్ (మాదిగ పల్లె ), రోండవ బహుమతి గణేష్ యూత్ (సత్రం బజార్ ) కైవసం చేసుకొన్నారు.
స్తానిక హరేరామ గుడివద్ద గ్రామానికిచెందిన గణేష్ యూత్ ఆధ్యర్యం లో వివిధ ఆటల పోటీలను నిర్వహించారు.
ముందుగా ముగ్గుల పోటీలను నిర్వహించి న్యాయ నిర్ణేతలుగా నల్లమోతు. ఉమామహేశ్వరి, మండవ. వాణి, నల్లమోతు .సదా లక్ష్మి వ్యవహరించారు. అనతరం మ్యూజిక్ చైర్, టగ్ అఫ్ వార్, (కళ్ళకు గంతలు కట్టి కుండను కొట్టుట)
బైక్ రైస్ స్లో పోటీలను కూడా నిర్వహిచారు దీనిలో ప్రదమ బహుమతి అత్తోటి. లక్ష్మినారాయణ, ద్వితీయ బహుమతి కొడాలి . ఫణికుమార్ పొందారు.
పోటిలలో మహిళలు పిల్లలు యువకులు విరివిగా పాల్గొన్నారు, కార్యక్రమాలను గణేష్ యూత్ తరఫున వేములపల్లి. శ్రీనివాసరరావు, నల్లమోతు. నటరాజ్, గంగవరపు. అశోక్, కక్కెర.అనిల్ నిర్వహించారు.
కార్యక్రమాలను నాదెండ్ల ఆన్ లైన్ నిర్వాహకులు మన్నె. కుమారస్వామి పర్యవేక్షించారు.

Sunday, January 16, 2011

ఈ రోజు తో మన గ్రామం లో ముగిసిన సంక్రాంతి వేడుకలు





శ్రీ గోవర్ధన స్వామి వారి పోన్నమాను ఉత్సవం

శ్రీ గంగా పార్వతి సమేత ములస్తానేశ్వ స్వామి వారి పోన్నమాను ఉత్సవం


రోజు తో మనగ్రామం లో సంక్రాంతి నెల రోజుల ఉత్సవాలు , చివరి రోజు సందర్భంగా రోజు సాయంత్రం పోన్నమాను గ్రామోత్సవం తో సంక్రాంతి వేడుకలు ముగిసినవి .