Sunday, December 4, 2011

A Look Around The Mandal

చిరుమామిళ్ళ
శ్రీ నడికట్టు రామిరెడ్డి గారి దాత్రృత్వం

కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఈ నిర్మాణం ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే నమ్మలేం కదా! గోల్కొండ హోటల్స్ అధినేత శ్రీ నడికట్టు రామిరెడ్డి గారి స్వ స్థలం చిరుమామిళ్ళ. ఆయన ఆ గ్రామాన్ని అభి వృద్ధి చేయదలచి, ఉన్నత పాఠశాల నిర్మాణం గావించారు. అంతే కాక చిరుమామిళ్ళ గ్రామానికి ఉపయోగపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.



*********************
తూబాడు RCM స్కూలు


తూబాడులోని RCM స్కూలు చాల neat గా ఉంది. గ్రౌండ్ చాల శుభ్రంగా ఉంది. రెండు, మూడు వేప చెట్లు ఈ ప్రాంతం మొత్తాన్ని కవర్ చేసాయి. మంచి నీడ. మేము( టీచర్స్ యూనియన్ సభ్యత్వానికి) వెళ్లేసరికి అక్కడ inspection జరుగుతుంది. స్కూలు వాతావరణం తెగ నచ్చేసింది.

****************

సంక్రాంతిపాడు

సంక్రాంతిపాడు మొదటిసారి వెళ్ళాను. అక్కడి ఉన్నత పాఠశాల లో 144 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. కొన్ని తరగతి గదుల నిర్మాణం పూర్తి కావలసి ఉంది.
*********************

సాతులూరు-చందవరం
నాదెండ్ల మండలంలో రైల్వే స్టేషన్ సాతులూరు లోఉంది. మీరెప్పుడైన అక్కడికి వెళ్లారా !!
(బలహీనత: రైలు కనపడిందంటే పెట్టెలు లెక్కపెట్టకుండా ఉండలేను)

*********************వరి పైరు - సస్యశ్యామలాం మాతరం !!

పంట చేలకు నీటి ఎద్దడి

సాగర్ కలువ నుండి నిరు అందాకా పోవటంతో పంట చేలకు చాలినంత నీరు లేదు. బట్టుకుంట లో అడుగంటిన నీటిని దగ్గర పొలాలకు ఇంజెన్ల ద్వారా అందిస్తున్నారు.

Saturday, December 3, 2011

సెల్ విత్ స్మెల్

మన దగ్గర వైబ్రేషన్ (స్పర్శ) తో పలకరించే సెల్ ఫోన్స్ ఉన్నాయి, రింగ్ టోన్ (వినికిడి) తో పలకరించే సెల్ ఫోన్స్ఉన్నాయి. ఇంకా సైలెంట్ మోడ్ లో కాల్ వస్తున్నప్పుడు కేవలం లైట్ లేదా వీడియో ( దృష్టి) చూపించే సెల్ ఫోన్స్ఉన్నాయి. కాల్ వచ్చినప్పుడు సువాసన వచ్చే సెల్ ఫోన్స్ వస్తే బాగుంటుంది కదా!.

ఇల్లాలు ఫోన్ చేస్తే మల్లె పూల పరిమళం ! ప్రియురాలు ఫోన్ చేస్తే గులాబీల గుబాళింపు !! బాసు ఫోన్ చేస్తే కుళ్ళిన కోడి గుడ్డువాసన, బార్ నుండి ఫోన్ వస్తే ఆల్కహాలు వాసన . సొంతింటి నుండి ఫోన్ వస్తే సాంబారు ఘుమాయింపు , అత్తగారింటి నుండి ఫోన్ వస్తే మసాల దాబా'యింపు' . భర్త ఫోన్ చేస్తే అగరొత్తుల ఆఘ్రాణింపు (పతి దేవుడు కదా)! బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే సెంట్ పలకరింపు ........!! ఇలా పెట్టుకోవచ్చన్నమాట.

జాగ్రత్త సుమండీ వైరు కాలిన వాసన వస్తే మీ సెల్ ఫోన్ వేడెక్కి కాలిపోతున్నట్లు .
మరి మన జ్ఞానేంద్రియాలలో మిగిలినది 'రుచి' దానిని Caller Id గా ఎలా వాడొచ్చో సరదాగా మీ ఊహ కాస్త చెప్దురు.

Sunday, November 27, 2011

జగదానందదాయక...!!

అఖిలాండ కోటికి బాపు రమణల విశ్వ(రామ)రూపం మరోసారి ఆవిష్కృతమైంది. తెలుగు సినిమాలలో ముందు వరుసలో మరో రామబాణం. గతంలో తీసిన సంపూర్ణ రామాయణం విదేశాలలో ( ఇంగ్లాండ్ ) theatre arts సిలబస్ లో ఒక పాఠం గా తీసుకున్నారు. శ్రీ రామరాజ్యం మరొకటి అవుతుందని నమ్మకం. కొద్ది మాటలు కొండంత లోతులు రమణ గారి చాతుర్యం. నిర్మాత యలమంచిలి సాయి ధన్యుడు . బాలకృష్ణ సినిమాలలో ఈ సినిమా మరో కలికితురాయి. సీతగా నయన తార అభినయం రూపం , చక్కగా ఉన్నాయి. వాల్మీకి రూపంలో పెద్దాయన పెద్ద దిక్కు. లక్ష్మణుడు గా శ్రీకాంత్ సరి . అయోధ్య excellent. ఈ లవ కుశ ఇతివృత్తం ఎన్నిసార్లుచూసినా తనివి తీరదన్నట్లుగా సృష్టించబడింది. ఇళయరాజా సంగీతం వీనుల విందు. టెక్నాలజీ కూడా చక్కగా తోడైంది. ( వాల్మీకి కుటీరంలో తిరుగాడే జింకలను గమనించండి). జగదానంద దాయక.. అంటూ జొన్నవిత్తుల సాహిత్యం. Don't miss this masterpiece on the silver screen as someone on the net has rightly coined it as a " visual treat".

కళామందిర్ లో పండుగ

రావణుని సంహరించి శ్రీ రాముడు సీతా సమేతంగా పుష్పక విమానం లో అయోధ్య కి అడుగిడటం తో కథ ప్రారంభ మవుతుంది.
రఘు వంశ స్థాపకుడు సూర్య భగవానుని మందిరం అద్భుతం.



లవ కుశులు


సినిమాలో ప్రతి ఫ్రేము చూడ తగ్గది, మదిలో దాచ తగ్గది.


కొంత కాలం క్రితం స్వాతిలో ధారావాహికగా ప్రచురితమైన కీ.శే. రమణ గారి కోతికొమ్మచ్చి(స్వీయ చరిత్ర)చదివాక అయన అభిమానినయ్యాను. అందులో ప్రతి సందర్భానికి బాపు గారి బొమ్మలు తోడు. గిలిగింతలు పెడతాయి. అన్నట్లు మన కోటప్పకొండ పురాణ గాథ ను బాపు గారు చిత్ర పటాలుగా వేసారు. చూడ ముచ్చట గొలిపే ఆ చిత్ర పటాలను కోటప్పకొండ ఆలయంలోని మండపంలో చూడవచ్చును.
పేట వీధులన్నీ ఉత్తర రామాయణ ఘట్టాలతో అలరారుతున్నాయి.(ఆ మాటకొస్తే రాష్ట్రమంతట!!)

Thursday, November 17, 2011

invitation నచ్చింది




నా మిత్రునికి తన చిన్న నాటి మిత్రుడు గృహ ప్రవేశానికి ఇలా ఆహ్వానం పంపాడు.