Tuesday, January 3, 2012

HMs అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా శ్రీ ఐ. ఆంజనేయులు గారు :2-1-12

ZP ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారు HMs అసోసియేషన్ రాష్ట్ర స్థాయి అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భం గా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువ, పూలమాలతో గౌరవించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని శ్రీ శేషగిరిరావు గారు ప్రారంభించారు.


ఉపాధ్యాయ బృందం తో HM శ్రీ ఐ. ఆంజనేయులు గారు


హ్యాపీ న్యూ ఇయర్

పాఠశాల కు బెంచీలు అందజేసిన NRI శ్రీ B. రఘునాధ రెడ్డి

విద్యార్ధులకు నూతన సంవత్సర కానుకగా చిలకలూరిపేట నివాసి NRI శ్రీ B. రఘునాధరెడ్డి గారు ZP ఉన్నత పాఠశాల కు తన తండ్రి గారైన శ్రీ నరిసి రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు రూ. 40,000/- విలువైన బెంచీలు అందజేసారు. తను విద్యాబుద్ధులు నేర్చుకున్న తన గురువు గారైన శ్రీ జయ శంకర్ మాస్టారు పని చేస్తున్న స్కూలుకి విరాళమివ్వాలనే రఘునాధరెడ్డి గారు సంకల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కు విచ్చేసిన శ్రీ నరిసిరెడ్డి గారు, తమ బంధువైన శ్రీ వెంకట రెడ్డి (NRI) గారి చేతుల మీదుగా బెంచీలను పాఠశాల కు అంద చేసే కార్యక్రమాన్ని ప్రారంభింప చేసారు .


పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులు శ్రీ నరిసి రెడ్డి గారిని పూల మాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీ శేషగిరి రావు గారు.
శ్రీ చంద్ర మౌళి గారు

పాఠశాల తరుపున దాతకు ధన్యవాదాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారు.
విద్యార్ధులనుద్దేశించి ప్రసంగిస్తున్న శ్రీ B. నరిసిరెడ్డి గారు.



thank you sir!!

ఆప్యాయంగా, అభిమానంగా శ్రీ నరిసిరెడ్డి గారికి వీడ్కోలు చెబుతున్న ఉపాధ్యాయులు, విద్యార్ధులు.