Friday, August 10, 2012

సాయి బాబా మందిర మొదటి అంతస్తు పై కప్పు ( స్లాబ్) నిర్మాణం 06-08-2012

















ది. 06-08-2012 నాదెండ్ల గ్రామంలోని కచేరి వేప చెట్టు సమీపంలో గల సాయి బాబా మందిరమునకు మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణం జరిగినది. విశాలమైన మందిర పైకప్పు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఉత్తరం, దక్షిణం రెండు వైపుల నుండి స్లాబ్ వేయడం మొదలు పెట్టి విజయవంతం గా పూర్తి చేసారు కమిటి సుభ్యులు.

Saturday, August 4, 2012

కంగ్రాట్స్ సైనా

సైనా నెహ్వాల్ లండన్ olympics షటిల్ బాడ్మింటన్ లో కాంస్య(బ్రాంజ్) పతకం సాధించింది. సిడ్నీ olympics 2000 లో భారతీయ మహిళలలో వ్యక్తిగతం గా పతకం సాధించిన కరణం మల్లేశ్వరి (వెయిట్ లిఫ్టింగ్) తరువాత 12 సంవత్సరాలకు ఆమె ఈ ఘనత సాదించింది. దీనితో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. కంగ్రాట్స్ సెహ్వాల్. కృషి, పట్టుదల ఎప్పటికీ గుర్తింపబడతాయి. తన ప్రత్యర్ధి ఆధిక్యంలో ఉన్నప్పటికీ మోకాలి గాయం కారణంగా మధ్యలో వైదొలిగింది. వత్తిడిని అధిగమించటం సాధన చేస్తే సెహ్వాల్ మరింత మెరుగ్గా రాణించగలదు .

సాయి బాబా మందిరమునకు స్లాబ్ వేయుటకు ఏర్పాట్లు



నాదెండ్ల కచేరి వేప చెట్టు సెంటర్ దగ్గర నిర్మించబడుతున్న సాయి బాబా మందిరమునకు 6-8-12 సోమవారం నాడు స్లాబ్ వేయనున్నారు.

మా బడిలో కవల పిల్లలు

నాదెండ్ల అంబేద్కర్ నగర్ లోగల C.D పాఠశాల నందు 3 వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి కవల జంట పేర్లు మరియ(ఎడమ) , మార్త. వీరిలో మరియ ముందు పుట్టింది.

మొలకెత్తిన పంట మొక్కలు

ప్రత్తి పసుపు

రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతం లో ఏర్పడ్డ అల్ప పీడనం వాళ్ళ జల్లులు పడనున్నాయి. అవి మొక్కలకు బాగా ఉపయోగ పడతాయి.