Friday, March 18, 2011

హోలీ శుభాకాంక్షలు!

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు హోలీ శుభాకాంక్షలు !

నాదెండ్ల స్థాయిలో జరిగిన టాలెంట్ టెస్ట్(4, 5 తరగతులు) -18-03-2011

ఈ రోజు నాదెండ్ల శివాలయం వీధిలోని పెద్ద బడి నందు, ప్రభుత్వ పాఠశాల లలో చదువుతున్న 4, 5 తరగతుల విద్యార్ధులకు నాదెండ్ల స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించ బడినది. 5 వ తరగతిలో C.D. స్కూల్, అంబేద్కర్ నగర్ కి చెందిన పాలపర్తి సంధ్య 86 మార్కులతో మొదటి స్థానం లో నిలవగా, పెద్దబడి కి చెందిన M. ఆంజనేయులు, T. మహేష్ లు 85,84 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానం పొందారు. 4 వ తరగతిలో పెద్ద బడి విద్యార్ధులు T. పవన్, M. ఆలోకు, D. సురేష్ లు 64,61,59 మార్కులతో మొదటి మూడు స్థానాలు పొందగా, C.D. స్కూల్ విద్యార్ధులు 57, 54 మార్కులతో 4,5 స్థానాలలో నిలిచారు.
-సేకరణ S. శ్రీనివాసరావు, C.D. స్కూల్, నాదెండ్ల ఆన్ లైన్

Thursday, March 17, 2011

సినిమా హాల్ సెంటర్ వినాయకుని గుడిలో పార్వతి దేవి విగ్రహ పునః ప్రతిష్ట 16-3-2011


సినిమా హాల్ సెంటర్ నందు ఉన్న శ్రీ వినాయకుని గుడిలో పార్వతి దేవి విగ్రహాన్ని 16-03-2011 ఉదయం 8.30 గంటలకు పునః ప్రతిష్టించారు.


ఫొటోస్ సహకారం: దగ్గుబాటి చంద్ర శేఖర్ (సెల్: 73966 12333)

రైతుల సమావేశం మరియు రుణాల రీషెడ్యూల్ -15-03-2011



ఫొటోస్ సహకారం: దగ్గుబాటి చంద్ర శేఖర్ (సెల్: 73966 12333)

శ్రీ కముఖల అమర గురు స్వాముల వారి ఆరాధన - 15-03-2011

శ్రీ అమరయ్య స్వామి వారు సజీవ సమాధిలోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకొని ఆరాధనోత్సవం జరుపుతారు. దీనిని మన గ్రామంలో అమరయ్య స్వామి వారి కుమారుడు పాదరేణువుల వారు కొనసాగించారు. ఈ ఆరాధన అమరయ్య స్వామి వారి గురువులు శ్రీ నాసర్ స్వామి వారి మఠం (త్రిపురాంతకం) లో సూఫీ మత సంప్రదాయంలో జరిగే ఆరాధనను పోలి ఉంటుంది.


శ్రీ అమరయ్య స్వాముల వారి సమాధి, పాదుకలు



గుర్రం మీద గంధం గిన్నె, స్వామి వారి పాదుకలు, ఆంజనేయస్వామి వారి జెండా ఊరేగిస్తారు.( శ్రీ నాసర్ స్వామి వారు ఆంజనేయ స్వామి ఉపాసకులు)

శ్రీ శ్రీ అమరయ్య స్వాముల వారి కాంస్య చిత్ర పటము.

ఫొటోస్ సహకారం: దగ్గుబాటి చంద్ర శేఖర్ (సెల్: 73966 12333)