- కొద్ది రోజుల క్రితం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో జాలాది సీతారామయ్య గారి వెంకట నారాయణ గారి కుమార్తె నల్లమోతు సాహితి (సుమేధ పబ్లిక్ స్కూల్, చిలకలూరిపేట)565 మార్కులతో గ్రామంలో మొదటి స్థానంలో నిలిచింది.భవిష్యత్తులో సివిల్స్ సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. గత ఫిబ్రవరి లో నాదెండ్ల హై స్కూల్ లో నాదెండ్ల ఆన్ లైన్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ఈ విద్యార్ధిని ప్రధమ స్థానం లో నిలిచి రు. 1116/- గెలుపొందినది. z.p. హై స్కూల్ నందు కుంచాల నాగ అశోక్ ( s/o రామారావు ) 534/600, నిమ్మల మధు (s/o నారాయణ స్వామి) 528/600 మార్కులు సాధించారు. z.p హై స్కూల్ నందు 91 మంది కి 81 మంది ఉత్తీర్ణులైనారు( 87%)
- కచేరి వేపచెట్టు దగ్గర ఉన్న అవ్వగారి శేషగిరి గారి స్థలాన్ని సాయి బాబా గుడి నిర్మాణమునకు విరాళంగా ఇచ్చారు. ఆ స్థలాన్ని గుడి నిర్మాణానికి సిద్ధం చేస్తున్నారు. స్థలం లో ఒక గుడారం వేసి సాయి బాబు చిత్ర పటం ఉంచి పూజలు చేస్తున్నారు.
- శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
- ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మొదలైనది.
- ఇక వ్యవసాయ విషయాలకొస్తే ప్రత్తి పీకించి, పొలాలు దున్నిస్తున్నారు. మిరపకాయల చివరి కోత కల్లాలలో ఉంది. చెదురు మదురు జల్లులు ఇలాంటి సమయం లో ఇబ్బంది కలిగిస్తున్నాయి.
- నాదెండ్ల నుండి వినాయకుని గుడి మీదుగా గణపవరం వెళ్ళే రోడ్డు పై గుంటలు పూడ్చి మరమ్మత్తులు చేస్తున్నారు. తిమ్మాపురం వెళ్ళే రోడ్డు పరిస్థితి అధ్వాన్నం గానే ఉంది.
- వేసవి లో ఎండలు విపరీతం గా ఉన్నా, కరెంట్ కోత తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
- చిలకలూరిపేట లో R.V.S.C.V.S హై స్కూల్ నందు 26 వ తేది నుండి 28 వ తేది వరకు కళానిలయం ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యాలలో పోటీలు నిర్వహించబడుతున్నాయి.
- పేటలో 29,౩౦ తేదీలలో 'చిలకలూరిపేట కళాపరిషత్తు' అధ్వర్యంలో C.R. క్లబ్ ఆవరణలో నాటక పోటీలు నిర్వహించబడతాయి. ఆ రెండు రోజులలో మొత్తం ఏడు నాటకాలను ప్రదర్శిస్తున్నారు.
Friday, May 27, 2011
ఈ వారం విశేషాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment