Saturday, July 30, 2011

చెలం కొండలు- 1వ భాగం


నాదెండ్ల గ్రామానికి ఉత్తరంగా 1 కి.మీ దూరంలో 2 కొండలు ఉన్నాయి. వీటికి చెలం కొండలు అని పేరు. గ్రామంలో ఉన్న 7 కొండలలో ఈ రెండు కొండలలో మాత్రమే చెలాలు(మంచి నీటి కుంటలు) ఉన్నాయి కాబట్టి వీటికి చెలం కొండలు అని పేరు. ఈ 2 కొండలలో 5 చెలమలు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధి పొందినవి రామ బుగ్గ, కాటోడి మడుగు, దొన, సొరంగం. నడి వేసవిలో కూడా రామబుగ్గలో నీరుంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఎక్కడైతే తాగునీటి వసతి ఉంటుందో అక్కడ ప్రజలు నివసించేవారు. దాదాపు 800 సం. క్రితం ప్రస్తుత నాదెండ్ల గ్రామం మచ్చు గట్టు నుండి సంక్రాంతి పాడు వరకు పెద్ద చెరువు ఉండేదని ఇక్కడ నుండి దిగువ ప్రాంతాలకు సాగునీటి సరఫరా ఉండేదని గ్రామస్తులు చెబుతారు. చెరువుకు నీటి అలుగులు మొత్తం 7 ఉన్నాయి. వాటిలో ఒకటి చెలం కొండలకు ఉత్తరం వైపు ఇప్పటికీ ఉంది. దీనిని గుడి వాగు తూము అంటారు. కాలక్రమంలో చెరువు తెగి శిధిలావస్థకు చేరుకుంది.

కాటోడి మడుగు


దొన
to be continued...

Monday, July 25, 2011

RRHEDS స్వచ్చంధ సంస్థ నోటు పుస్తకాల పంపిణీ 22-07-11



మండల incharge పర్సన్ పద్మావతి గారు, MDO అనురాధ గారు.

స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కెన్నెడీ గారు
CD స్కూల్, HW స్కూల్ పాఠశాలల విద్యార్ధులు (CD స్కూల్ ఆవరణ)

నోటుపుస్తకాలతో విద్యార్ధులు

నారాయణ స్వామి మఠం వార్షికోత్సవం -22-07-2011







Sunday, July 17, 2011

గురు పౌర్ణమి _శ్రీ కముఖల అమరయ్య స్వామి వారి మఠం (14-07-2011)




గంగవరపు చింపయ్య గారి చిత్ర పటము ( అమరయ్య స్వామి వారి ప్రథమ శిష్యులు)







Saturday, July 16, 2011

నాదెండ్ల ఆన్ లైన్ ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు

నాదెండ్ల ఆన్ లైన్ సేవలను ఆదరిస్తున్న నాదెండ్ల గ్రామ వాసులకు, వృత్తి రీత్యా, విద్య రీత్యా గ్రామానికి దూరంగా ఉంటున్న నాదెండ్ల గ్రామానికి చెందిన అందరికీ నాదెండ్ల ఆన్ లైన్ ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మాకు ఆలంబన గా నిలిచి వెన్ను తట్టి ప్రోత్సహించిన మహానుభావులకు, దాతలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఆదరాభిమానాలతో బ్లాగ్ ను నిరంతరం కొనసాగించాలనే సంకల్పం నెరవేర గలదని గట్టిగా విశ్వసిస్తున్నాము.
ధన్యవాదములతో మీ .....
TEAM MEMBERS,
NADENDLAONLINE,
NADENDLA

Sunday, July 3, 2011

కళానిలయం నృత్య ప్రదర్శనలలో దేదీప్యకు మొదటి బహుమతి (26-05-11 నుండి 28-05-11)




కళానిలయం, చిలకలూరిపేట వారిచే నిర్వహించబడిన 28 జాతీయ స్థాయి డాన్సు పోటీలలో (26-05-11 నుండి 28-05-11 వరకు ) కుమారి నల్లమోతు దేదీప్య సీనియర్ విభాగం లో పాల్గొంది. సూర్య కేటగిరి లో మొదటి బహుమతిని (నవరస భారతీయ నాట్య మయూరి ), చంద్ర కేటగిరి లో రెండవ బహుమతిని (భారతీయ నాట్య మయూరి) గెలుచుకుంది.

ఘనంగా మండల M.E.O శ్రీ M.V. సుబ్బారావు గారి పదవి విరమణ మహోత్సవం


గురుతుల్యులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, చందవరం L.E. పాఠశాల రిటైర్డ్ H.M. శ్రీ M.V. బసవయ్య గారికి శ్రీ సుబ్బారావు గారి చేతుల మీదుగా చిరు సన్మానం
మెడిసిన్ ఎంట్రన్సు స్టేట్ ఫస్ట్ రాంకర్ కుమారి హిమజ ను అభినందిస్తున్న M.L.C. శ్రీ లక్ష్మణరావు గారు, Z.P. వైస్ చైర్మన్ శ్రీ నల్లమోతు నట రాజేశ్వర రావు గారు . ( హిమజ శ్రీ బసవయ్య గారి పెద్దన్నయ్య గారి మనుమరాలు)

సన్మాన గ్రహీతలు శ్రీ M.V. సుబ్బారావు గారు, సతీమణి శ్రీమతి సీతామహాలక్ష్మి గారు.

ఇంచార్జ్ మండల విద్యా శాఖాధికారి గా అమీన్ సాహెబ్ పాలెం హై స్కూల్ H.M. శ్రీ పూర్ణచంద్ర రావు గారు బాధ్యతలు స్వీకరించారు.

అమానుషం- మౌనిక మరణం 29-06-2011