నాదెండ్ల గ్రామానికి ఉత్తరంగా 1 కి.మీ దూరంలో 2 కొండలు ఉన్నాయి. వీటికి చెలం కొండలు అని పేరు. గ్రామంలో ఉన్న 7 కొండలలో ఈ రెండు కొండలలో మాత్రమే చెలాలు(మంచి నీటి కుంటలు) ఉన్నాయి కాబట్టి వీటికి చెలం కొండలు అని పేరు. ఈ 2 కొండలలో 5 చెలమలు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధి పొందినవి రామ బుగ్గ, కాటోడి మడుగు, దొన, సొరంగం. నడి వేసవిలో కూడా రామబుగ్గలో నీరుంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఎక్కడైతే తాగునీటి వసతి ఉంటుందో అక్కడ ప్రజలు నివసించేవారు. దాదాపు 800 సం. క్రితం ప్రస్తుత నాదెండ్ల గ్రామం మచ్చు గట్టు నుండి సంక్రాంతి పాడు వరకు పెద్ద చెరువు ఉండేదని ఇక్కడ నుండి దిగువ ప్రాంతాలకు సాగునీటి సరఫరా ఉండేదని గ్రామస్తులు చెబుతారు. చెరువుకు నీటి అలుగులు మొత్తం 7 ఉన్నాయి. వాటిలో ఒకటి చెలం కొండలకు ఉత్తరం వైపు ఇప్పటికీ ఉంది. దీనిని గుడి వాగు తూము అంటారు. కాలక్రమంలో చెరువు తెగి శిధిలావస్థకు చేరుకుంది.
to be continued...
No comments:
Post a Comment