అఖిలాండ కోటికి బాపు రమణల విశ్వ(రామ)రూపం మరోసారి ఆవిష్కృతమైంది. తెలుగు సినిమాలలో ముందు వరుసలో మరో రామబాణం. గతంలో తీసిన సంపూర్ణ రామాయణం విదేశాలలో ( ఇంగ్లాండ్ ) theatre arts సిలబస్ లో ఒక పాఠం గా తీసుకున్నారు. శ్రీ రామరాజ్యం మరొకటి అవుతుందని నమ్మకం. కొద్ది మాటలు కొండంత లోతులు రమణ గారి చాతుర్యం. నిర్మాత యలమంచిలి సాయి ధన్యుడు . బాలకృష్ణ సినిమాలలో ఈ సినిమా మరో కలికితురాయి. సీతగా నయన తార అభినయం రూపం , చక్కగా ఉన్నాయి. వాల్మీకి రూపంలో పెద్దాయన పెద్ద దిక్కు. లక్ష్మణుడు గా శ్రీకాంత్ సరి . అయోధ్య excellent. ఈ లవ కుశ ఇతివృత్తం ఎన్నిసార్లుచూసినా తనివి తీరదన్నట్లుగా సృష్టించబడింది. ఇళయరాజా సంగీతం వీనుల విందు. టెక్నాలజీ కూడా చక్కగా తోడైంది. ( వాల్మీకి కుటీరంలో తిరుగాడే జింకలను గమనించండి). జగదానంద దాయక.. అంటూ జొన్నవిత్తుల సాహిత్యం. Don't miss this masterpiece on the silver screen as someone on the net has rightly coined it as a " visual treat".
కళామందిర్ లో పండుగ
రావణుని సంహరించి శ్రీ రాముడు సీతా సమేతంగా పుష్పక విమానం లో అయోధ్య కి అడుగిడటం తో కథ ప్రారంభ మవుతుంది.
రఘు వంశ స్థాపకుడు సూర్య భగవానుని మందిరం అద్భుతం.
సినిమాలో ప్రతి ఫ్రేము చూడ తగ్గది, మదిలో దాచ తగ్గది.
కొంత కాలం క్రితం స్వాతిలో ధారావాహికగా ప్రచురితమైన కీ.శే. రమణ గారి కోతికొమ్మచ్చి(స్వీయ చరిత్ర)చదివాక అయన అభిమానినయ్యాను. అందులో ప్రతి సందర్భానికి బాపు గారి బొమ్మలు తోడు. గిలిగింతలు పెడతాయి. అన్నట్లు మన కోటప్పకొండ పురాణ గాథ ను బాపు గారు చిత్ర పటాలుగా వేసారు. చూడ ముచ్చట గొలిపే ఆ చిత్ర పటాలను కోటప్పకొండ ఆలయంలోని మండపంలో చూడవచ్చును.
పేట వీధులన్నీ ఉత్తర రామాయణ ఘట్టాలతో అలరారుతున్నాయి.(ఆ మాటకొస్తే రాష్ట్రమంతట!!)