ది. 21-2-13 న దిల్ షుక్ నగర్ మరియు పరిసర ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్లు రాష్ట్రాన్ని నివ్వెర పరిచాయి. హైదరాబాద్ నగరం మరోసారి విలవిల లాడింది. ముష్కరుల అమానుష చర్యలు రాష్ట్రంలో భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనను నాదెండ్ల ఆన్ లైన్ ఖండిస్తుంది . బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తుంది. సంఘ విద్రోహ శక్తుల ఆటలు కట్టించటానికి పటిష్టమైన భద్రత అవసరం ఎంతైనా ఉంది .
- భద్రత కు అత్యాధునాతునమైన టెక్నాలజీ ఉపయోగించు కోవాలి .
- ప్రేలుడు పదార్ధాలను పసిగట్టే భద్రతా వలయం నగరమంతా ఏర్పాటు చేసుకోవాలి.
- నిఘా కెమెరా లతో, gps పరికరాలు మొ॥ వాటితో నిఘా వ్యవస్థ బలోపేతం కావాలి.
- రవాణా వ్యవస్థలలో నిఘా పెంచాలి. ప్రతి పబ్లిక్ రవాణా వాహనం లో ప్రేలుడు పదార్ధాలను పసిగట్టే చిప్స్ లాంటి పరికరాలు ఉంటే ఫలితం బాగుంటుంది. ఆ చిప్ నుండి నేరుగా సంకేతాలు నిఘా వర్గాలకు అందాలి (వాహన వివరాలు , ప్రేలుడు పదార్దం వివరాలు మొ॥)
- ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ చేయాలంటే వాహన తయారిదారు తప్పక అలాంటి చిప్ అమర్చవలసి ఉండేలా చేయాలి .
No comments:
Post a Comment