నేడు
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంక్షోభం నుండి బయట పడేందుకు వారానికి 5 పని దినాలు అమలు చేయాలని ఆలోచిస్తున్నది. తద్వారా ఆదా అయ్యే
విద్యుత్తు తో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ పథకం
అమలులో సాధ్యాసాధ్యాలు గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ కొందరు
విద్యుత్ పొదుపు గురించి ప్రయత్నం చేసి విజయం సాధిస్తున్నారు. వారిలో
ముఖ్యులు గుంటూరు జిల్లా ఖజానా కార్యాలయం ఉప సంచాలకులు శ్రీ కె . సురేంద్ర
బాబు గారు.
నా
వ్యక్తి గత పని మీద జిల్లా ఖజానా కార్యాలయమునకు వెళ్ళటం జరిగింది . అక్కడ
గోడల మీద ఉన్న స్లొగన్స్ చూసి రోజూ పని మీద అక్కడికి వచ్చే వారిని ఆరా
తీయగా వారు చెప్పిన వివరాలు, మరియు ఉపసంచాలకులు శ్రీ సురేంద్ర బాబు గారితో
మాట్లాడి, వివరాలు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది .
శ్రీ కె.సురేంద్ర బాబు గారు సెప్టెంబర్ 2012లో గుంటూరు ఖజానా ఉప
సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రావటంతోనే చేసిన మొదటి పని ఆఫీసు
లో పని చేసే వాతావరణం మెరుగు పరచటం. విద్యుత్ తక్కువగా వినియోగం అయ్యేలా
చూడటం. అందుకోసం అయన కార్యాలయం మొత్తం గాలి,వెలుతురు వచ్చే విధంగా చేసారు.
అంటే ముందు కిటికీలు, తలుపులకు బీరువాలు అడ్డంగా ఉండి గాలి వెలుతురు ఉండేది
కాదు. ఇప్పుడు కిటికీలు, తలుపులు అన్నీ తెరుచుకున్నాయి. ప్రకృతి సిద్ధంగా
లభించే గాలి, వెలుతురూ ధారాళంగా వస్తున్నాయి . ఆఫీసు గోడల నిండా పట్టిన
దుమ్ము దులిపించారు. ఈ విధంగా చేయుట వలన గోడలు తెల్లగా ఉండి, గదులన్నీ మంచి
వెలుతురుతో నిండాయి.
ఇక
గోడలపైన మంచి సూక్తులు రాయించారు. ఇపుడు మనం కార్యాలయం లోకి వెళితే ఏదైనా
పాఠశాల కి వచ్చామా అనే భావన కలుగుతుంది.వాటిలో ముఖ్యమైనవి- 'ఉపయోగంలో లేని
ఫ్యాన్లు, లైట్ లు ఆపివేయండి..విద్యుత్ ఆదా చేయండి', ' పొదుపు చేసిన
విద్యుత్ ఉత్పత్తి చేసిన విద్యుత్ తో సమానం '
సురేంద్ర బాబు గారు చేసే మరో ముఖ్య మైన పని, ప్రతి ఒక్కరికీ
ఆదర్శం.సాయంత్రం ఆఫీసు సమయం అయిపోయిన తరువాత, ఆఫీసు అంతా తిరుగుతూ అవసరం
లేకుండా వాడబడుతున్న ఫ్యాన్లు, లైట్ లు స్వయంగా ఆపివేయడం. అయన కింది స్థాయి
ఉద్యోగులు దగ్గరలో ఉన్నప్పటికీ వారికీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా తనే
అపివేస్తారు. తనపై అధికారి చే ఆ విధంగా చేయించవలసి వచ్చినందుకు ఆ ఉద్యోగి
బాధ పడతాడు. మరునాటి నుండి ఎవరికి వారు జాగ్రత్తగా సీటు లో నుండి బయటకు
వెళ్ళేటప్పుడు ఫ్యాన్లు, లైట్ లు ఆపి వెళుతున్నారు. జిల్లా ఖజానా
కార్యాలయంతో ప్రతి డిపార్టుమెంటు వారికీ పని ఉండటం వలన, ఈ ఆఫీసు కి
వచ్చేవారు కూడా ఈ విషయం గురించి ముచ్చటించుకుంటున్నారు.
కార్యాలయం లో పని చేసే వాతావరణం మెరుగు పరచుట కొరకు 20 ట్యూబ్ లైట్ లు,20
ఫ్యాన్ లు అదనంగా బిగించారు. వాటిని రోజు ఉపయోగించుట వలన అదనంగా నెలకు
సుమారు 600 యూనిట్ లు కరెంట్ బిల్ రావలసి ఉన్నప్పటికీ, ప్రస్తుతం గతంలో
కంటే 250 నుండి 400 యూనిట్ ల వరకు తక్కువ వస్తుంది. అంటే నెలకు సుమారు 1000
యూనిట్ ల వరకు విద్యుత్ ఆదా చేస్తున్నారు . ఇదే విధంగా అందరూ పాటిస్తే
ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది కదా!
ముందు | తర్వాత | |||||||
నెల | యూనిట్ | ఖర్చు | నెల | యూనిట్ | ఖర్చు | |||
march2012 | 3102 | 20,294 | sept 2012 | 2199 | 19,697 | |||
april | 2126 | 14,908 | october | 2086 | 18,604 | |||
may | 2949 | 20,679 | november | 2090 | 26,080 | |||
june | 2273 | 17,148 | december | 1802 | 19,921 | |||
july | 2295 | 20,025 | January2013 | 1954 | 17,360 | |||
august | 2456 | 21,444 |
సురేంద్ర బాబు గారు బాధ్యత తీసుకున్న తర్వాత, ఉద్యోగులు సౌకర్యార్ధం ఉన్న
ఫ్యాన్లు, లైట్ లు ఇంతకు ముందు కంటే ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నప్పటికీ
విద్యుత్ వాడకం ఏమాత్రం పెరగకపోవటం గమనార్హం .
కేవలం ఒక ఆఫీసు లోనే ఇంత విద్యుత్ ఆదా అయితే జిల్లా, రాష్ట్ర స్థాయిలో
అధికారులు బాధ్యతతో ప్రవర్తిస్తే ఏంతో విద్యుత్ ఆదా అవుతుంది కదా! అందుకే
ఎంతో బాధ్యతతో విధులు నిర్వహిస్తున్న సురేంద్ర బాబు గారికి 'నాదెండ్ల ఆన్
లైన్' హృదయ పూర్వక అభినందనలు తెలుపుతుంది.
No comments:
Post a Comment