Sunday, July 7, 2013

నాదెండ్ల పూర్వ విద్యార్ధుల వితరణ వల్ల పాఠశాలలకు సమకూరిన సౌకర్యాలు

      నాదెండ్ల గ్రామమునకు చెందిన నల్లమోతు జయరాం గారు, డా. నల్లమోతు నాసరయ్య గారు, డా. నెల్లూరి సత్యనారాయణ గారు, మురళి గారు, పాఠశాలల అభివృద్ధికై ఏదైనా కార్యక్రమము చేయాలని సంకల్పించుకొని, ఏ విధంగా చేస్తే బాగుంటుందని మమ్మల్ని సంప్రదించారు. మేము పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి, వారి అవసరములను తెలుసుకొని, జయరాం గారికి తెలియజేయుట జరిగినది. దీనికై జయరాం గారు ముందుగా 15000 రు. లను నవంబరు నెల(2012)లో ఇచ్చినారు.( అప్పుడు గ్రామంలోనే ఉన్నారు).ఈ పైకమును  zp హైస్కూల్ కు అందించాము. తాను మరలా యు.యస్ వెళ్ళిన తరువాత జనవరి 3 వ తేదీన ఒక లక్ష రు. లను పాఠశాల అభివృద్ధికి ఉపయోగించమని పంపగా అందులో 50,000 రు. లను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(శివాలయం వీధి, పెద్దబడి) వారికీ, 50,000 రు. లు zp హైస్కూల్ వారికి ఇవ్వటం జరిగింది. పెద్దబడి వారు పాఠశాలకు విద్యుత్తు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసారు.
     అంతకుముందు శ్రీ గంగవరపు శ్రీనివాస రావు గారు నాదెండ్ల ఆన్ లైన్ నిర్వహణకు గాను మాకు రు. 15,000 అందజేసియున్నారు. ఈ పైకమును కూడా zp హైస్కూల్ అందించాలని నిర్ణయించుకొన్నాము. ఈ విధంగా zp హైస్కూల్ వారికి మొత్తం రు. 80,000 ఇవ్వటం జరిగింది.
       దాతలు అందించిన సొమ్మును, ఇరు పాఠశాలల వారు సద్వినియోగంచేశారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ఇందుకు సంబంధించిన వివరాలు:

 అందిన మొత్తం:
  15,000-00  18-11-12 జయరాం గారు అందించిన మొత్తం
1,00,000-00 3-1-13  జయరాం గారు మరియు మిత్రులు అందించిన మొత్తం
  15,000-00         గంగవరపు శ్రీనివాస రావు గారు అందించిన మొత్తం
---------------
1,30,000-00
--------------
పెద్దబడి వారి ఖర్చు:
  37,290  కరెంటు సామగ్రి మరియు వాటర్ పైపులు
    2,500   పైపులు వేసినందుకు కూలీ
    1,500  బాత్ రూం వద్ద గోడ కట్టి ట్యాప్ లు వేయించినందుకు
    1,200  కంప్యూటర్ వైరింగ్
       150  స్విచ్ బోర్డ్ కటింగ్
       440  పాత మోటర్ రిపేర్
    6,920  సీలింగ్ ఫ్యాన్లు(4)
----------
  50,000
----------

     పాఠశాలకు రెండు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి ఒక దానికి ఉప్పు నీరు, ఒకదానికి మంచి నీరు వచ్చే ఏర్పాటు చేసి వాటిని ఉపయోగించటం జరుగుతుందని తెలియజేస్తూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేసారు.


హైస్కూల్ కి అందిన మొత్తము: 80,000-00
ఖర్చుల వివరములు:
  8,500  సామ్ సంగ్ ప్రింట్, కాపీ, స్కాన్ 
21,000  ఇన్వర్టర్
  4,500  స్టాండ్ బ్లాక్ బోర్డ్స్-2
  7,000  స్పోర్ట్స్ డ్రసెస్
     900  తెలుగు కీబోర్డ్
24,000  క్లాస్ రూం టేబుల్స్-13
  5,000  కార్డ్ లెస్ మైక్
  6,100  పోడియం
  3,000  ఇన్ స్టలేషన్ చార్జీలు
---------
80,000
---------

     ఈ సంవత్సరం విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ, ఇన్వర్టర్ ఉండటం వల్ల విద్యార్ధులు  రాత్రి పూట అంతరాయం లేకుండా చదువుకోవడానికీ, మంచి మార్కులు తెచ్చుకోవడానికి సాధ్యపడింది. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి లో 10 కి 10 జిపిఏ సాధించిన రెండు పాఠశాలలలో మన పాఠశాల ఒకటి కావటం గమనించదగిన విషయం.

సాయం చేసిన దాతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు కృతజ్ఞతలు తెలియజేసారు.

     వ్యక్తిగత కారణాల వలన బ్లాగ్ నిర్వహణ బాధ్యతలను సంగిశెట్టి శ్రీనివాస రావుకి అప్పగించి తాత్కాలికముగా సెలవు తీసుకుంటున్నాను. నా పనులు పూర్తి అయిన పిదప రెట్టించిన ఉత్సాహముతో తిరిగి బ్లాగ్ నిర్వహణలో పాల్గొంటానని మనవి చేస్తూ, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

         ఇట్లు:
మన్నె కుమార స్వామి
      నాదెండ్ల ఆన్ లైన్

     
    

No comments:

Post a Comment