భారత రాజ్యాంగ సృష్టికర్త ఆధునిక మనువు శ్రీ అంబేద్కర్ గారు చెప్పినట్లు భారతదేశంలో చిన్న రాష్ర్టాలు ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఈ మధ్య O.U లో జరిగిన సభలో కొందరు పెద్దలు మాట్లాడుతూ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. వారి ప్రకారం అవసరమైతే భవిష్యత్ లో జరిగే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ఉద్యమాలకు వారు మద్దతు తెలియజేస్తామని చెబుతున్నారు.
భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి పక్కన పెడితే అంబేద్కర్ గారి మాట ప్రకారం తెలంగాణా ప్రాంతాన్ని హైదరాబాద్, ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా అనే మూడు రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తే మూడు ముఖ్యమంత్రి పదవులు, మూడు రాజధానులు వస్తాయి.హైదరాబాదు నగర సంస్కృతి మిగిలిన రెండు ప్రాంతాల సంస్కృతు లకు భిన్నంగా ఉంటుంది. దోపిడీ అరికట్టాలంటే ఈ విభజన తప్పదు. ఇటీవల జరిగిన గ్రూప్-II పరీక్ష నుండి సచివాలయంలో A.S.O లు గా ఎంపికైన తెలంగాణా వారిలో సుమారు 40% మంది ఒక నల్గొండ జిల్లాకు చెందిన వారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు తెలంగాణా అభివృద్ధి ఫలాలు అన్నీ ఒకటి, రెండు జిల్లాల వారే అనుభవిస్తున్నారని తెలపడానికి.భవిష్యత్తులో మరో వేర్పాటు ఉద్యమం రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడి 3 రాష్ట్రాలు చేస్తే పోలా!
నోటిఫికేషన్ సంవత్సరం
|
మొత్తం ASO పోస్టులు
|
తెలంగాణా ప్రాంతం వారు
పొందినవి
|
సీమాంధ్ర ప్రాంతం వారు
పొందినవి
|
2008
|
240
|
110(46%)
|
130 (54%)
|
2011
|
140
|
80(57%)
|
60(43%)
|
దురదృష్టకరమైన విషయం ఏమంటే అంబేద్కర్ గారి మాటలు, ఆశయాలు లాకర్ లో పెట్టి అవసరమైనప్పుడు బయటకు తీస్తా ఉంటారు. ఆయన సాంఘిక సమానత్వం కోసం చేసిన పోరాట స్ఫూర్తిని అందరు మరిచిపోయారు. బడుగు వర్గాలలో కొందరే రిజర్వేషన్లు అనుభవించడం, గ్రామీణ మారుమూల, కొండ ప్రాంతాలలో కడు పేదరికంలో పెరిగిన SC, ST, BC విద్యార్ధులు పట్టణ ప్రాంతంలో అదే సామాజిక వర్గాలకు చెందిన ధనవంతులైన, అధికార వర్గాలకు చందిన వారితో పోటీ పడుతుండటం ఈరోజూ చూస్తూ ఉన్నాం.ఈ కుహనా అంబేద్కర్ వాదులందరూ వీటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు.
ఎదుటివారి మీద దాడి చేయడానికి, తమ వాదనలు సమర్ధించుకోవడం కొరకు అంబేద్కర్ వంటి మహనీయులను, వారి మాటలను సందర్భోచితంగా ఉపయోగంచడం ఎంత దురదృష్టకరమైన విషయం. కొందరు మేధావులు చెబుతూఉన్నారు రాష్ట్రం విడిపోతే దళితులకు రాజ్యాధికారం దక్కుతుందని. రాష్ట్రం విడిపోతే స్మశాన సమానమైన ఈ రాష్ట్రం పాలించితే ఏమి? పాలించకపోతే ఏమి?
మరికొందరు అంటున్నారు.. రెండు కులాల వారు ఉద్యమాన్ని నడుపుతున్నారని. నిజంగా రాష్ట్రం విడిపోతే లబ్ది పొందేది ఆ రెండు కులాలవారే. మెజారిటీ భూమి,వనరులు, వారి గుప్పెట్లో ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే భూమి రేట్లు విపరీతంగా పెరుగుతాయన్నది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు వారు ఎందుకు నడుపుతారు. చెప్పొచ్చేదేమంటే చర్చిల్ చెప్పినట్లు భారతదేశం వంద ముక్కలు కాకూడదనే మా కోరిక.
No comments:
Post a Comment