
Monday, January 31, 2011
Sunday, January 30, 2011
నాదెండ్ల సిగలో మందారం






నల్లమోతు. అమరయ్య (మున్సిపల్ కమిషనర్), హేమ గార్ల గారాల పట్టి దేదీప్య కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ లో వున్నప్పుడు నాట్య ప్రదర్శన చూసి తానూ కూడా నాట్యం నేర్చుకుంటానని పట్టు పట్టి ఆరేళ్ళ వయసు లో స్థానికం వున్న శోభానాయుడు అకాడమీ లో చేరి, ప్రముఖ నర్తకి పద్మిని శ్రీనివాస్ గారి వద్ద కూచిపూడి నాట్యం అభ్యసించినది అక్కడ వున్న 2 సం:ల పాటు ఎంతో శ్రధతో నేర్చుకొని గురువుల మెప్పు పొందినది. దాదాపు 70 ప్రదర్శనలు ఇచ్చినది.
అమరయ్య గారు హైదరాబాద్ బదిలీ కావటం తో నాట్య అభ్యాసానికి తాత్కాలికంగా ఆటంకం కలిగింది. దగ్గర లోకూచిపూడి నేర్పేవారు లేకపోవడమే దానికి కారణం.
ప్రస్తుతం భారత నాట్యం లో అంతర్జాతీయ కీర్తి పొందిన v.s రామమూర్తి (90 సం;) ఆయన కుమార్తె మంజులా రామస్వామి గార్ల దగ్గర శిష్యరికం చేస్తుంది భరతనాట్యం అభ్యాసం మొదలు పెట్టిన కొద్ది రోజులలోనే నాట్య మెళుకువలను గ్రహించి, అనేక ప్రదర్శనలు ఇస్తూ అందరి మెప్పూ పొందుతుంది అందరిని ఆశ్చర్యంలో పరిచే
దేదీప్య ఇచ్చిన ప్రదర్శనల వివరాలు :-
1. హైదరాబాద్ రవీంద్రభారతి లో 5 సోలో ప్రోగ్రామ్స్ (pot dance)2. ఇన్కా రవీంద్రభారతి లో 10 గ్రూప్ డాన్సులు
3.మద్రాస్ లో ప్రదర్శన
4. కొత్తగూడెం బాలోత్సావ్ ఇంటర్ స్కూల్ కంపిటిషన్ లో అనేక వేల మంది తో పోటీపడి భారత నాట్య ప్రదర్శనలో ద్వితీయ భాహుమతి పొందినది
5. GHMC పాలక వర్గం ఏర్పాటయిన మొదటి వార్షికోత్సవ సభలో pot dance
Friday, January 28, 2011
జన్మదిన శుభాకాంక్షలు
Wednesday, January 26, 2011
Monday, January 24, 2011
నాదెండ్ల ఆన్ లైన్ ద్వారా చేపట్టే కార్యక్రమాల వివరాలు
"నాదెండ్ల ఆన్ లైన్" ద్వారా రాబోవు 4 నెలల కాలములో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలు.
- ఫిబ్రవరి నెలలో మనగ్రామ ZP హై స్కూల్ లో విద్యార్ధులు మరియు నాదెండ్ల గ్రామస్తులై ఉండి వేరేపాఠశాల యందు చదువుతున్న 10th క్లాసు విద్యార్ధులకు టాలెంట్ టెస్ట్ (merit scholarship test) తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లలో నిర్వహించబడును.
- వేసవి శెలవులలో గ్రామం లో ఆసక్తి గల వారికి కంప్యూటర్ శిక్షణ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులుఅనుభవం కలిగిన అధ్యాపకులచే నిర్వహించబడును.
- 5 నుండి 10 సం.లలోపు విద్యార్ధులకు వేసవిలో శిక్షణ శిభిరము. ఈ శిభిరములో విద్యార్ధులకుతెలుగు పాటలు,బొమ్మలు చేయుట,మరియు చిత్ర లేఖనం నందు శిక్షణ ఇచ్చుట. ఆసక్తి కల వారికి సంగీతము పరిచయం చేసి, అన్నమయ్య, రామదాసు కీర్తనలు నేర్పించుట జరుగును.
- నాదెండ్ల కు సంభందించిన చరిత్రను సేకరించి గ్రంథస్థం చేయుట. దీనికొరకు అన్ని వర్గాల ప్రజలనుండిసమాచారము సేకరిస్తున్నాము. మనగ్రామ చరిత్రకు సంబంధించిన ఏ చిన్న అంశము మీకు తెలిసిన లేక గ్రామ చరిత్ర తెలిసిన వారు మీకు పరిచయం ఉంటే వారివివరాలు మాకు తెలియజేయగలరు.
ధన్యవాదాలు,
నాదెండ్ల ఆన్ లైన్ టీం,
"give us feedback@ 9490554384
nadendlaonline@gmail.com,
follow 'nadendlaonline' on twitter.
నాదెండ్ల ఆన్ లైన్ టీం,
"give us feedback@ 9490554384
nadendlaonline@gmail.com,
follow 'nadendlaonline' on twitter.
Saturday, January 22, 2011
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,నాదెండ్ల
మనగ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీనిని 1974 వ సం;లో నిర్మించినారు .ఈ పాఠశాలను సువిశాల ప్రాంగణనము లో నిర్మించుటకు, మన ఊరి ప్రజల అభివృధికి గాను పాఠశాల నిర్మాణమునకు ఎకరం స్థలమును కీ ;శే . శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు s/o వెంకట్రామయ్య (మాజీ మునుసుబు)గారు మరియు శ్రీ నల్లమోతు. రామమూర్తి గారు (మాజీ సర్పంచ్ ) గార్లు ఈ స్తలమును కు దాతలు.
1978 సం ; నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్ధులు విద్యావంతులుగా ఇతర జిల్లాలలో, రాష్ట్రాలలో ,దేశ విదేశాలకు ఉన్నత చదువులకు,ఉద్యోగాలకు వెళ్ళిన ఎంతో మంది ఆణిముత్యాలను(విజ్ఞానవేత్తలను) తయారు చేసింది.
వీరి లో కొందరు ప్రైవేట్ ఉద్యోగులుగాను, ప్రభుత్వఉద్యోగులుగాను, ఉపాద్యాయులుగాను, సాఫ్టవేర్ ఇంజనీర్ల గాను,డాక్టర్స్ గాను, రాజకీయ నాయకులగా వున్నారు.
మన పాఠశాలలో చదివిన విద్యార్ధులకు తమ అప్పటి తీపి గుర్తులను,తమస్నేహితులను గుర్తుకు చేసుకొనే విధంగా 1978 నుండి 2010 సం:వరకు పదవతరగతి చదివిన విద్యార్ధుల వివరాలు ,వారి గ్రూప్ పొటోలు ,క్లాసుఫస్ట్ సాధించిన వారి వివరాలు, ఆటలలో ప్రధమ బహుమతి పొందిన వారి వివరాలు,వారి షీల్డ్స్ మో ......లైన
ఈ వివరాలను త్వరలో మీ ముందుకు .................
Friday, January 21, 2011
Tuesday, January 18, 2011
N.TR.15.వ వర్ధంతి కి "నాదెండ్ల ఆన్ లైన్ టీం" ఘన నివాళులు
Monday, January 17, 2011
నాదెండ్ల గ్రామం లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు
నాదెండ్ల గ్రామం లో సంక్రాంతి పండుగను అందరు ఘనంగా జరుపుకున్నారు .రైతుల పరిస్తితి అంత ఆశాజనకంగా లేకపోయనప్పటికి సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను చూసిన ఆనందంతో పండుగను ఉత్సాహంతో జరుపుకున్నారు.సెలవులకు ఇంటికివచ్చిన విద్యార్ధులు, ఉద్యోగులు తమ పని వత్తిడిని మరచిపోయి హాయిగా తమమిత్రులను కలసుకొని పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకొని సెలవులలో సేదతీరారు. గ్రామంలో పండుగ సందర్భంగా వివిధ ఆటలపోటిలను నిర్వహించారు. నల్లమోతు. రాజేంద్ర ప్రసాద్ (రాజా గారు ), గొంది. వీర కోటేశ్వరరావు గార్ల మెమోరియల్ వాలీ బాల్ పోటిలలో యడ్లపాడు R C M టీం మొదటి బహుమతి గెలుచుకోగా, రోండవ బహుమతి నాదెండ్ల చౌదరి యూత్ కైవసం చేసుకుంది. మూడోవ బహుమతి సాతులూరుకి చెందిన చౌదరి యూత్ పొందినది. సత్రం బజార్ గణేష్ యూత్ ఆద్వర్యం లో జరిగిన క్రికెట్ పోటిలలో ఫైనల్ లో మొదటి బహుమతి పవర్ స్టార్ (మాదిగ పల్లె ), రోండవ బహుమతి గణేష్ యూత్ (సత్రం బజార్ ) కైవసం చేసుకొన్నారు.
స్తానిక హరేరామ గుడివద్ద గ్రామానికిచెందిన గణేష్ యూత్ ఆధ్యర్యం లో వివిధ ఆటల పోటీలను నిర్వహించారు.
ముందుగా ముగ్గుల పోటీలను నిర్వహించి న్యాయ నిర్ణేతలుగా నల్లమోతు. ఉమామహేశ్వరి, మండవ. వాణి, నల్లమోతు .సదా లక్ష్మి వ్యవహరించారు. అనతరం మ్యూజిక్ చైర్, టగ్ అఫ్ వార్, (కళ్ళకు గంతలు కట్టి కుండను కొట్టుట)
బైక్ రైస్ స్లో పోటీలను కూడా నిర్వహిచారు దీనిలో ప్రదమ బహుమతి అత్తోటి. లక్ష్మినారాయణ, ద్వితీయ బహుమతి కొడాలి . ఫణికుమార్ పొందారు.
ఈ పోటిలలో మహిళలు పిల్లలు యువకులు విరివిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమాలను గణేష్ యూత్ తరఫున వేములపల్లి. శ్రీనివాసరరావు, నల్లమోతు. నటరాజ్, గంగవరపు. అశోక్, కక్కెర.అనిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను నాదెండ్ల ఆన్ లైన్ నిర్వాహకులు మన్నె. కుమారస్వామి పర్యవేక్షించారు.
స్తానిక హరేరామ గుడివద్ద గ్రామానికిచెందిన గణేష్ యూత్ ఆధ్యర్యం లో వివిధ ఆటల పోటీలను నిర్వహించారు.
ముందుగా ముగ్గుల పోటీలను నిర్వహించి న్యాయ నిర్ణేతలుగా నల్లమోతు. ఉమామహేశ్వరి, మండవ. వాణి, నల్లమోతు .సదా లక్ష్మి వ్యవహరించారు. అనతరం మ్యూజిక్ చైర్, టగ్ అఫ్ వార్, (కళ్ళకు గంతలు కట్టి కుండను కొట్టుట)
బైక్ రైస్ స్లో పోటీలను కూడా నిర్వహిచారు దీనిలో ప్రదమ బహుమతి అత్తోటి. లక్ష్మినారాయణ, ద్వితీయ బహుమతి కొడాలి . ఫణికుమార్ పొందారు.
ఈ పోటిలలో మహిళలు పిల్లలు యువకులు విరివిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమాలను గణేష్ యూత్ తరఫున వేములపల్లి. శ్రీనివాసరరావు, నల్లమోతు. నటరాజ్, గంగవరపు. అశోక్, కక్కెర.అనిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను నాదెండ్ల ఆన్ లైన్ నిర్వాహకులు మన్నె. కుమారస్వామి పర్యవేక్షించారు.
Sunday, January 16, 2011
ఈ రోజు తో మన గ్రామం లో ముగిసిన సంక్రాంతి వేడుకలు
Subscribe to:
Posts (Atom)