Sunday, January 30, 2011

నాదెండ్ల సిగలో మందారం








సంస్కృతీ, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన నాదెండ్ల గ్రామం లో తాము ఎంచుకున్న రంగాలలో అగ్రస్తానంలో వున్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ తను ఎంచుకున్న కళారంగం భారతనాట్యంలో జాతీయస్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంశలు అందుకుంటున్న చిన్నారి నల్లమోతు. దేదీప్య.
నల్లమోతు. అమరయ్య (మున్సిపల్ కమిషనర్), హేమ గార్ల గారాల పట్టి దేదీప్య కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ లో వున్నప్పుడు నాట్య ప్రదర్శన చూసి తానూ కూడా నాట్యం నేర్చుకుంటానని పట్టు పట్టి ఆరేళ్ళ వయసు లో స్థానికం వున్న శోభానాయుడు అకాడమీ లో చేరి, ప్రముఖ నర్తకి పద్మిని శ్రీనివాస్ గారి వద్ద కూచిపూడి నాట్యం అభ్యసించినది అక్కడ వున్న 2 సం: పాటు ఎంతో శ్రధతో నేర్చుకొని గురువుల మెప్పు పొందినది. దాదాపు 70 ప్రదర్శనలు ఇచ్చినది.
అమరయ్య గారు హైదరాబాద్ బదిలీ కావటం తో నాట్య అభ్యాసానికి తాత్కాలికంగా ఆటంకం కలిగింది. దగ్గర లోకూచిపూడి నేర్పేవారు లేకపోవడమే దానికి కారణం.
ప్రస్తుతం భారత నాట్యం లో అంతర్జాతీయ కీర్తి పొందిన v.s రామమూర్తి (90 సం;) ఆయన కుమార్తె మంజులా రామస్వామి గార్ల దగ్గర శిష్యరికం చేస్తుంది భరతనాట్యం అభ్యాసం మొదలు పెట్టిన కొద్ది రోజులలోనే నాట్య మెళుకువలను గ్రహించి, అనేక ప్రదర్శనలు ఇస్తూ అందరి మెప్పూ పొందుతుంది అందరిని ఆశ్చర్యంలో పరిచే
దేదీప్య ఇచ్చిన ప్రదర్శనల వివరాలు :-
1. హైదరాబాద్ రవీంద్రభారతి లో 5 సోలో ప్రోగ్రామ్స్ (pot dance)
2.
ఇన్కా రవీంద్రభారతి లో 10 గ్రూప్ డాన్సులు
3.
మద్రాస్ లో ప్రదర్శన
4.
కొత్తగూడెం బాలోత్సావ్ ఇంటర్ స్కూల్ కంపిటిషన్ లో అనేక వేల మంది తో పోటీపడి భారత నాట్య ప్రదర్శనలో ద్వితీయ భాహుమతి పొందినది
5.
GHMC పాలక వర్గం ఏర్పాటయిన మొదటి వార్షికోత్సవ సభలో pot dance

1 comment:

  1. Awesome and Congratulations to dedeepya and all the best for her future endeaours

    ReplyDelete