Thursday, March 31, 2011
పాక్ పై భారత్ అద్భుత విజయం 30-03-2011
జయహో భారత్! వరల్డ్ కప్ లో పాక్ మీద మనకున్న విజయాల పరంపరను కొనసాగించాం. పాకిస్తాన్ పై గెలిచి ఏప్రిల్ 2 న ముంబై లో శ్రీలంక మీద ఆడబోతున్నాము. ఇది ఏ ఒక్కరో ఆడటం వల్ల దక్కిన విజయం కాదు.( యువరాజ్ డక్ అవుట్ అయాడు). మన వాళ్ళు అందరు కలిసి ది బెస్ట్ ఇచ్చారు. మన 5 గురు బౌలర్స్ తలా రెండు వికెట్స్ పడగొట్టారు. భారత్ పాక్ ముందుంచిన 260 పరుగుల లక్ష్యం గొప్పదేమీ కాదు(వహాబ్ రియాజ్ 5 వికెట్లు). అయిన రెగ్యులర్ గా వికెట్స్ పడటం తో మ్యాచ్ మన అదుపులోకొచ్చింది. పాక్ వికెట్స్ పడుతున్నా చివరి ఓవర్ వరకు టెన్షన్ రిలీజ్ కాలేదు. మంచి మ్యాచ్ పోటా పోటీగా జరిగింది. విజయం ఇద్దరి మధ్య దొబూచు లాడింది. పాక్ 231 మాత్రమే చేయ గలిగింది. మాన్ అఫ్ ది మ్యాచ్ సచిన్ 85 పరుగులు ( 2,3 సార్లు లైఫ్ వచ్చింది.). భారత్ కప్ గెలవాలని ప్రతి భారతీయుడి ఆశ, ఆకాంక్ష. బాణ సంచా కాల్చి, వీధులలో తిరుగుతూ భారతీయులు ఈ విజయాన్ని ఎంజాయ్ చేసారు. ముంబై లో ధోని సేన విన్యాసాలను మరో సారి చూసి అస్వాదిద్దాము. మన గ్రామంలో పిల్లలు, పెద్దలు అందరికి కూడా క్రికెట్ ఫీవర్. ఈ ఫీవర్ తగ్గాలంటే భారత్ ఫైనల్స్ లో శ్రీలంక పై నెగ్గి కప్ గెలవాల్సిందే!!
ఈ మ్యాచ్ సందర్భంగా ICC మహిళా న్యాయవాది మీడియా చూస్తుండగా భారత్ జెండా నమూనా ను కాలితో తొక్కటం అందరికి ఆగ్రహం తెప్పించింది.
Sunday, March 27, 2011
జీవ వైవిధ్య పరిరక్షణ - ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి 25-03-2011
నాదెండ్ల మండల M.D.O. శ్రీమతి అనురాధ గారు
ఇర్లపాడు ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి వారు, జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమంలో భాగంగా స్థానిక శివాలయం వీధి లోని M.P.P స్కూల్ లో (పెద్ద బడి) అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా మండల M.D.O. శ్రీమతి అనురాధ గారు విచ్చేసారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని ఆమె విద్యార్ధులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దావులూరి నరసమ్మ, నాదెండ్ల S.I. K. చేన్నకేశ్వర్లు, పంచాయతి సెక్రటరీ J. లూథర్ పాల్, వ్యవసాయ అధికారి K.కిరణ్మయి, ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి అధ్యక్షురాలు D. శాంతమ్మ, ఇర్లపాడు ఉప సర్పంచ్ M. ఏడుకొండలు, ఉపాధ్యాయులు I. వెంకటేశ్వర రావు, S. రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దావులూరి నరసమ్మ, నాదెండ్ల S.I. K. చేన్నకేశ్వర్లు, పంచాయతి సెక్రటరీ J. లూథర్ పాల్, వ్యవసాయ అధికారి K.కిరణ్మయి, ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి అధ్యక్షురాలు D. శాంతమ్మ, ఇర్లపాడు ఉప సర్పంచ్ M. ఏడుకొండలు, ఉపాధ్యాయులు I. వెంకటేశ్వర రావు, S. రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Friday, March 25, 2011
ఆలయ చరిత్ర - మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం
అతి పురాతనమైన మూల స్థానేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర గురించి పురావస్తు శాఖ అధికారులలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీ బంగారయ్య గారు శివాలయాన్ని పరిశీలించి అతి పురాతన ఆలయాలలో ఇది ఒకటని, క్రీ. శ. 5 వ శతాబ్దం నాటిదని, ఇది మొదట జైనాలయమని, కాల క్రమేణా శివాలయంగా మార్పు చెందినదని అభిప్రాయపడ్డారు. గతంలో శివాలయాన్ని పరిశీలించిన పురావస్తు శాఖాధికారులు కాకతీయుల కాలం నాటికే ప్రసిద్ధి చెందిన దేవాలయం అని అభిప్రాయం వ్యక్తం చేసారు.
గుంటూరుకు చెందిన శ్రీ విష్ణుబొట్ల సూర్యనారాయణ గారు 1962 లో ప్రచురించిన" నరసరావు పేట తాలూకా గ్రామ చరిత్ర" పుస్తకంలో 94 వ పేజీ నందు శివాలయం గురించి ఈ విధంగా ప్రస్తావన ఉన్నది. క్రీ.శ.1046 సంవత్సరపు శాసనమున ముక్కోల గోమన శెట్టి యనునతడు విశ్వేశ్వర దేవుని నిలిపి మందిరమెత్తినట్లు కనపడుతున్నది. గ్రామంలో లభించిన 12 వ శతాబ్ది నాటి శాసనములలో ఒక దానియందు మూల స్థానేశ్వరుని దేవాలయము ఒకటి ఉన్నట్లును, ఆ స్వామికి పెట్టబడు నైవేద్యములో ఎవరెవరికి ఎంతెంత చెందవలసియున్నదను విషయం వ్రాయబడి యున్నది. మరియొక శాసనమున" శ్రీ మన్మహామండలేశ్వర బుద్దరాజు కులసతియైన గుండమహదేవి తను కట్టించిన గుండసముద్రమను గ్రామమును మూల స్థానేశ్వరునకు నైవేద్యము కొరకు ఇచ్చినట్లు గలదు.
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు(1199 - 1262) నాటికి నాదెండ్ల మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఆనాటి కాకతీయుల పరిపాలనలో శివాలయాలు అధ్వర్యంలో గోళకీ మఠాలు అనే సేవా సంస్థలు నడపబడుచుండేవి. గొళకీ మఠం అనగా సమాజానికి కేంద్ర బిందువు. విద్యాలయం, విద్యాలయం, ప్రసూతి కేంద్రం, సాంస్కృతిక కేంద్రం.శైవమతాచార్యుల ఆధ్వర్యంలో గోళకీ మఠాలు నిర్వహించ బడుతుండేవి.మొదట వీటిని స్థాపించినది గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శివ దేవుడు. మన శివాలయం లోని గోళకీ మఠాన్ని విశ్వేశ్వర శివ దేవుడు స్థాపించి, నిర్వహించారు. ఆయన దర్శనార్ధం వచ్చిన గణపతి దేవుడు మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గణపతి దేవుడు బస చేసిన ప్రాంతాలలో కొన్ని గ్రామాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి గణపవరం అనే పేరుతో అభివృద్ధి చెందాయి. ఇలాంటి గణపవరాలు ఆంధ్ర దేశంలో అనేకం ఉన్నాయని ప్రముఖ చరిత్రకారులు ABK ప్రసాద్ గారి అభిప్రాయం. మన గ్రామ సమీపంలో ఉన్న గణపవరం గ్రామం కూడా ఈ విధంగానే అభివృద్ధి చెంది ఉంటుంది. దీనిని బట్టి గణపతి దేవుడు మన గ్రామాన్ని, మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించారని రూఢి చేసుకోవచ్చు.
తర్వాత ముస్లిం రాజుల పరిపాలనలో హిందూ సంస్కృతిని, దేవాలయాలను నాశనం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయానికి వచ్చినపుడు స్థానిక అర్చకులు ఎంతో యుక్తితో శివలింగము పై ఒక జల్ల (వెదురు గంప) ను బోర్లించారు. ముష్కరులు అలయమంతా వెదికినా విగ్రహం కనపడలేదు. ఇక్కడ దేవుని విగ్రహం ఏదనగా, ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవని సమాధానమిచ్చారు. ఆ జల్ల కింద ఏముంది అని ప్రశ్నించారు. పాల పిడతలు దాచమని, పిల్లి వచ్చి పాడు చేయకుండా జల్ల కింద ఉంచామని బదులిచ్చారు. వారు దేవాలయ ప్రాంతమంతా వెతికినా విగ్రహాలు ఏమి కనపడక పోవటంతో, అక్కడే శాసనము పై నిలబెట్టి ఉన్న నంది తలను నరికి వెళ్ళిపోయారు. ఆ శాసనమును ఇప్పటికి శివాలయములో చూడవచ్చు.
( ఈ కాలములోనే తాతకొండపై గోవర్ధన స్వామి ఆలయాన్ని, గాంధేయ గట్టుపై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయాన్ని,చలం కొండలపై ఉన్న వీరభద్ర స్వామి వారి ఆలయాలను ధ్వంసం చేసారు.)
పరీక్షా సమయంలో రణరంగం!!! (25-03-2011)
24-03-2011 అనగా నిన్నటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వరుని అశీస్సులందుకొని విద్యార్ధులు చిలకలూరిపేట(గణపవరం) వైపు పరీక్షా కేంద్రాలకు పయన మయ్యారు. నిన్న, ఈ రోజు తెలుగు పేపర్ కావడం తో హ్యాపీ గా పరీక్ష రాసారు. ఈ రోజు సాయంత్రం నుండి వారి ప్రిపరేషన్ ఊపందుకుంది . రేపు హిందీ ఎక్జాం.
నిన్నే భారత్, ఆస్ట్రేలియా ల మధ్య వరల్డ్ కప్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్ జరిగింది. భారత్ గెలుపు విశేషం. సమిష్టి కృషికి తోడు యువరాజ్, రైనా లు నిలకడగా ఆడటం తో సెమీస్ లో బెర్తు ఖాయమైంది. ఈ కోలాహలానికి తోడు నిన్ననే చిలకలూరిపేట మాజీ M.L.A. శ్రీ మర్రి రాజశేఖర్ గారు జగన్ వర్గం లో చేరుతున్న సందర్భంగా సభ ఏర్పాటు చేయటంతో N.R.T సెంటర్ రష్ గా మారింది. నాదెండ్ల లోని ఆయన వర్గీయులు కూడా సభకు హాజరయ్యారు.నాదెండ్ల మండల అధ్యక్షుడు శ్రీ కంజుల వీరా రెడ్డి గారు కూడా జగన్ వర్గంలో చేరారు. ఎప్పటి లాగే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఈసారి కూడా ఓటమి పాలయ్యింది. న్యూజిలాండ్ మీద 222 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక పోయింది. భారత్ పాక్ మీద గెలిస్తే, కప్ దక్కే అవకాశం కనిపిస్తుంది ( ఏమంటారు!?)
నిన్నే భారత్, ఆస్ట్రేలియా ల మధ్య వరల్డ్ కప్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్ జరిగింది. భారత్ గెలుపు విశేషం. సమిష్టి కృషికి తోడు యువరాజ్, రైనా లు నిలకడగా ఆడటం తో సెమీస్ లో బెర్తు ఖాయమైంది. ఈ కోలాహలానికి తోడు నిన్ననే చిలకలూరిపేట మాజీ M.L.A. శ్రీ మర్రి రాజశేఖర్ గారు జగన్ వర్గం లో చేరుతున్న సందర్భంగా సభ ఏర్పాటు చేయటంతో N.R.T సెంటర్ రష్ గా మారింది. నాదెండ్ల లోని ఆయన వర్గీయులు కూడా సభకు హాజరయ్యారు.నాదెండ్ల మండల అధ్యక్షుడు శ్రీ కంజుల వీరా రెడ్డి గారు కూడా జగన్ వర్గంలో చేరారు. ఎప్పటి లాగే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఈసారి కూడా ఓటమి పాలయ్యింది. న్యూజిలాండ్ మీద 222 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక పోయింది. భారత్ పాక్ మీద గెలిస్తే, కప్ దక్కే అవకాశం కనిపిస్తుంది ( ఏమంటారు!?)
Note : SSC టైం టేబుల్: Morning 9.30 to 12.00
March 24 First Language Paper 1
March 25 First Language Paper 2
March 26 Second Language
March 28 English Paper 1
March 29 English Paper 2
March 30 Mathematics Paper 1
March 31 Mathematics Paper 2
April 1 General Science Paper 1
April 2 General Science Paper 2
April 6 Social studies Paper 1
April 7 Social Studies Paper 2
March 24 First Language Paper 1
March 25 First Language Paper 2
March 26 Second Language
March 28 English Paper 1
March 29 English Paper 2
March 30 Mathematics Paper 1
March 31 Mathematics Paper 2
April 1 General Science Paper 1
April 2 General Science Paper 2
April 6 Social studies Paper 1
April 7 Social Studies Paper 2
Tuesday, March 22, 2011
5 వ తరగతి విద్యార్ధులకు మండల స్థాయి టాలెంట్ టెస్ట్ 22-03-11
నాదెండ్ల మండలం లోని ప్రభుత్వ పాఠశాల ల లో 5 వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు, నాదెండ్ల గ్రామం లోని Z.P. ఉన్నత పాఠశాల నందు టాలెంట్ టెస్ట్ జరిగినది. 160 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. సాతులూరు H.E. స్కూల్ కు చెందిన విద్యార్ధి, చందవరం U.P. స్కూల్ నకు చెందిన విద్యార్ధులు 95 మార్కులతో మొదటి స్థానం పొందారు. 91 మార్కులు సాధించి చందవరం U.P. స్కూల్ విద్యార్ధి, గణపవరం B.C. స్కూల్ విద్యార్ధి, ఇర్లపాడు L.E. స్కూల్ విద్యార్ధులు ద్వితీయ స్థానం పొందారు.90 మార్కులతో గణపవరం B.C. స్కూల్ విద్యార్ధి మూడవ స్థానం పొందారు. కాగా నాదెండ్ల C.D. స్కూల్ విద్యార్ధిని పాలపర్తి సంధ్య 84 మార్కులు సాధించి 8 వ స్థానం పొందింది. talent టెస్ట్ ను Z.P H.M. శ్రీ ఐ. ఆంజనేయులు గారు పర్యవేక్షించారు. కార్యక్రమ నిర్వాహకులు మండల విద్యాశాఖాధికారి శ్రీ M. V. సుబ్బారావు గారు విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.
Friday, March 18, 2011
గంగా పార్వతీ సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం -స్థల పురాణం
నాదెండ్ల గ్రామంలో వేంచేసి యున్న శివాలయము అతి పురాతనమైనది. స్వామి వారి పేరు శ్రీ మూలస్థానేశ్వర స్వామి. శ్రీ స్వామి వారు గంగా పార్వతీ సమేతులై యున్నారు. స్వామి వారికి పూర్వ కాలము నుండే పూజలు, ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నా ఆధారాలున్నాయి. ఆలయ నిర్వహణ కొరకు మాన్యములు, గొర్రెలు, మేకలు, ఆవులు, దానం గా ఇచ్చిన ఆధారాలున్నాయి. ఆలయ ప్రాంగణమంతా అనేక శాసనాలున్నాయి.
పూర్వ కాలంలో నాదెండ్ల ప్రాంతమంతా అరణ్యము. అరణ్యములో పెద్ద చెరువు ఉండెడిది. ఈ ప్రాంతములో అనేక మంది మునులు తపస్సు చేసుకొనేవారు. వారిలో మార్కండేయ మహర్షి ప్రసిద్ధులు .ఆయన శిష్య సపరివార సమేతంగా ఈ ప్రాంతంలో కొంత కలం గడిపినారు. ఒక నాడు చెరువు నందు స్నాన మాచరించి, సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించి ధ్యానంలో నిమగ్నులై ఉన్నపుడు ఆయనకు పరమ శివుడు సాక్షాత్కరించాడు. మార్కండేయుల వారు కనులు తెరిచి చూడగా అక్కడ రాళ్ళూ, రప్పలు కనిపించాయి. మరలా ధ్యానంలోకి వెళ్ళగా అక్కడ స్థాపితమై ఉన్న రాయిలో పరమ శివుడు సాక్షాత్కరించాడు. దానినే శివ లింగముగా గుర్తించి, తన శిష్యులను పిలిచి, "ఆ కనిపించేది మాములు రాయి కాదు. అది సాక్షాత్తు పరమ శివుని రూపమైన శివలింగము.స్వామి వారి పేరు మూలా స్థానేశ్వర స్వామి " అని వారికి తెలిపి పూజలు జరిపించారు. కొంత కాలం పాటు ఈ కాలంలో ఉన్న ఈ మహర్షి , ఆయన శిష్యులు ఆ దారిన వెళ్ళే బాటసారులకు స్వామి వారిని చూపించి వారికి స్వామి వారి మహిమలు వివరించారు. కాల క్రమేణ ఈ ప్రాంతము అభివృద్ధి చెంది ఆలయము ప్రసిద్ధి చెందినది. ఈ విధముగా స్వామి వారిని మార్కండేయ మహర్షుల వారు గుర్తించి లోకానికి తెలియ చేసారు కనుక మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేసిన శివలింగముగా భావిస్తారు.
వివరణ: స్వయంభు శివ లింగమునకు, ప్రతిష్టించిన శివ లింగమునకు బేధము కలదు. స్వయంభు శివ లింగము మాములు రాయి మాదిరిగా, గతుకులు కలిగి ఉండును. కానీ ప్రతిష్టించిన శివ లింగము నున్నగా ఉండును.మన శివాలయములో శివలింగమును పరిశీలిస్తే తేడ స్పష్టముగా కనపడును.స్వామి వారిని అభిషేక సమయములో పరిశీలిస్తే శివలింగములో కళ్ళు, ముక్కు, స్పష్టంగా కనిపిస్తాయని కొందరి భక్తుల అభిప్రాయం.
Subscribe to:
Posts (Atom)