Thursday, March 31, 2011

పాక్ పై భారత్ అద్భుత విజయం 30-03-2011


జయహో భారత్! వరల్డ్ కప్ లో పాక్ మీద మనకున్న విజయాల పరంపరను కొనసాగించాం. పాకిస్తాన్ పై గెలిచి ఏప్రిల్ 2 ముంబై లో శ్రీలంక మీద ఆడబోతున్నాము. ఇది ఒక్కరో ఆడటం వల్ల దక్కిన విజయం కాదు.( యువరాజ్ డక్ అవుట్ అయాడు). మన వాళ్ళు అందరు కలిసి ది బెస్ట్ ఇచ్చారు. మన 5 గురు బౌలర్స్ తలా రెండు వికెట్స్ పడగొట్టారు. భారత్ పాక్ ముందుంచిన 260 పరుగుల లక్ష్యం గొప్పదేమీ కాదు(వహాబ్ రియాజ్ 5 వికెట్లు). అయిన రెగ్యులర్ గా వికెట్స్ పడటం తో మ్యాచ్ మన అదుపులోకొచ్చింది. పాక్ వికెట్స్ పడుతున్నా చివరి ఓవర్ వరకు టెన్షన్ రిలీజ్ కాలేదు. మంచి మ్యాచ్ పోటా పోటీగా జరిగింది. విజయం ఇద్దరి మధ్య దొబూచు లాడింది. పాక్ 231 మాత్రమే చేయ గలిగింది. మాన్ అఫ్ ది మ్యాచ్ సచిన్ 85 పరుగులు ( 2,3 సార్లు లైఫ్ వచ్చింది.). భారత్ కప్ గెలవాలని ప్రతి భారతీయుడి ఆశ, ఆకాంక్ష. బాణ సంచా కాల్చి, వీధులలో తిరుగుతూ భారతీయులు విజయాన్ని ఎంజాయ్ చేసారు. ముంబై లో ధోని సేన విన్యాసాలను మరో సారి చూసి అస్వాదిద్దాము. మన గ్రామంలో పిల్లలు, పెద్దలు అందరికి కూడా క్రికెట్ ఫీవర్. ఫీవర్ తగ్గాలంటే భారత్ ఫైనల్స్ లో శ్రీలంక పై నెగ్గి కప్ గెలవాల్సిందే!!
మ్యాచ్ సందర్భంగా ICC మహిళా న్యాయవాది మీడియా చూస్తుండగా భారత్ జెండా నమూనా ను కాలితో తొక్కటం అందరికి ఆగ్రహం తెప్పించింది.

No comments:

Post a Comment