నిన్న (24-5-12) పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. మార్కులకు బదులుగా గ్రేడులు ఇవ్వటం విద్యార్ధులకు, తలిదండ్రులకు కొంత అసంతృప్తిని మిగిల్చింది. ప్రతి సబ్జెక్టునకు పది పాయింట్ల చొప్పున కేటాయించారు. 6 సబ్జెక్టు లలో వచ్చిన పాయింట్ ల సరాసరి తీసుకోని GPA గా నిర్ణయించారు. సబ్జెక్టు లో వచ్చిన పాయింట్ లను బట్టి విద్యార్ధికి వచ్చిన మార్కులను సుమారుగా తెలుసుకోవచ్చు. అనగా సబ్జెక్టు కు గరిష్టంగా 8 మార్కుల వరకు వ్యత్యాసం తో మొత్తం మీద గరిష్టంగా 48 మార్కుల వ్యత్యాసం తెలుసుకోగలము. GPA 10 వచ్చిన విద్యార్ధి మార్కులు 552 నుండి 600 మధ్య ఉండవచ్చు. కనుక ఎవరికి ఎన్ని మార్కులు?ఎవరు ముందు? ఎవరు వెనుక? తెలియదు. నో టెన్షన్. కూల్...!! విద్యార్ధుల మీద ఉండే విపరీతమైన టెన్షన్ తగ్గించి, కార్పోరేట్ విద్య సంస్థలకు ముకుతాడు వేయడం గ్రేడింగ్ విధానం లక్ష్యం.
నాదెండ్ల హై స్కూల్ లో 69 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా అందు 61 మంది విద్యార్ధులు పాస్ అయ్యారు. పాశం రాజ్య లక్ష్మి 9.7 GPA సాధించి మొదటి స్థానం లో నిలువగా, బొట్టు శిరీష, అలుగునీడి లక్ష్మి ప్రసన్న, 9.3 GPA సాధించి రెండవ స్థానం లో నిలిచారు.