Friday, May 18, 2012

నల్లమోతువారి తాంబూలం -మూడవ ( చివరి) భాగం

గోవర్దన స్వామి ఆలయం వద్దకు చేరిన వీరలక్ష్మి నవాబు పంపిన అధికారులతో " ఒక మేడి తెప్పించండి. దానిని మీ సమక్షంలో నాటుతాను. మూడు రోజులలో దానికి ఆకులు వస్తాయి" అని చెప్పింది. అప్పుడు అధికారులు ఊరంతా వెదికించి అరవై, డెబ్బై సంవత్సరాల నుండి వాడుతున్న తుమ్మమేడి ని తెప్పించి ఇచ్చారు. మేడిని తీసుకున్న వీరలక్ష్మి పాది తీయించి, మేడికి పసుపు కుంకుమలు సమర్పించి పూజ చేసి పాదిలో నాటింది. రెండు రోజుల పాటు మార్పు చూపించని మేడి మూడో రోజు తెల్లవారే సరికి ఆకులతో కళకళలాడుతూ కనిపించింది. ( మూడు రోజులు మేడి చుట్టూ కొందరు కావలిగాళ్ళని కాపలా ఉంచారు. తుమ్మ కట్టె ఎండిపోయినది అయితే ఇగురు పెట్టదని అరవై సంవత్సరాల నుండి వాడుతున్న తుమ్మ మేడిని తెప్పించారు.)

విషయం తెలుసుకున్న నవాబు తన తప్పు తెలుసుకొని క్షమించమని కోరి, "మీ కోరిక ఏమిటో చెప్పండి తీరుస్తాను" అనగా, పైట పన్ను రద్దు చేయమని కోరగా... "అది ఎలాగు చేస్తాను, మీకు ఏమి కావాలి?.. మాన్యాలు, బంగారు ఆభరణాలు, ఆవులు.. వీటిలో ఏది కావాలన్నా ఇస్తాను" అనగా, " అయ్యా! మాకు విధమైన కానుకలు వద్దు. శుభకార్యం జరిగేటప్పుడు నల్లమోతు వారి పేరిట ఒక తాంబూలం తీయాలి" అని అడిగారు.

ఎంతో సంతోషించిన నవాబు వారు కోరుకున్న విధంగా తన రాజ్యమంతా శుభకార్యాలలో నల్లమోతు వారి తాంబూలం తీయాలని ఒక ఫర్మానా విధించాడు. నాటి నుండి ఆంధ్ర దేశమున అని కులాల వారు శుభకార్యాలు జరుగునపుడు దేవుని తాంబూలంతో పాటు, నల్లమోతు వారి తాంబూలం తీయుట ఆచారంగా వచ్చుచున్నది. ఇలాంటి అరుదైన విషయం కేవలం నాదెండ్ల గ్రామమునకు మాత్రమే స్వంతము.

No comments:

Post a Comment