Friday, May 18, 2012

నల్లమోతువారి తాంబూలం -2 వ భాగం

పైట పన్నుకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె ప్రకారంగా దివిటీలు పట్టే వ్యక్తి ఎడమ చేతితో దివిటి పట్టి నవాబు గారికి ఎదురు నిల్చున్నాడు. మంగళ వాయిద్యం వాయించే వ్యక్తి ఎడమ చేతితో వాయిస్తున్నాడు. సభలో ఉన్న వివిధ ఉద్యోగులు ఎడమ చేతితో సలాం చేసారు. విధంగా ఆస్థానంలోని వ్యక్తులందరూ కుడిచేతిని ఉపయోగించక పోవటం అమర్యాదగా భావించిన నవాబు " ఏమిరా! ఆస్థానంలో అందరికి ఒకేసారి కుడి చేయికి పక్షవాతం వచ్చిందా? ఎడమ చేతితో పని చేస్తూనన్ను అవమానపరుస్తున్నారు, మీ అందరికి కఠిన శిక్ష విధించగలను" అని గద్దించాడు. అందరు " అయ్యా! మా కుడి చేయి నాదెండ్ల గ్రామం లోని నల్లమోతు వారి సమ్మెలో ఉంది. అందుకే ఎడమ చేతితో పని చేస్తున్నాము" అని వినయంగా సమాధానం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న నవాబు నాదెండ్ల గ్రామానికి చెందిన తమ్మినీడు సోదరులను పిలిపించాడు. సమ్మె ప్రకటించి రాజాజ్ఞ ధిక్కారమునకు పాల్పడుతున్నారు అని గద్దించి అడుగగా, " అయ్యా! మీ రాజాస్థానం లో ఉన్న ఆడ వారికి కూడా పైట కొలతలు తీసి అప్పుడు మా వద్దకు రండి " అని జవాబిచ్చారు. ఆగ్రహంతో ఉగిపోయిన నవాబు " ఓరీ! రాజాస్థానంలో ఉన్న మహిళలు సచ్చీలురు, వారికి మీలాంటి అధములతో పోటీనా?" అని గద్దించాడు. అప్పుడు తమ్మినీడు సోదరులు " ప్రభూ మీరు మా గ్రామానికి వస్తే మా స్త్రీల సచ్చీలత , ప్రాతివత్యమును నిరుపిస్తాముఅన్నారు ". నవాబు వారి వెంట తన అధికారులను గ్రామమునకు పంపించాడు. తమ్మినీడు సోదరులు ఇంటికి వచ్చి తమ సోదరి వీర లక్ష్మికి విషయం తెలిపినారు. అప్పుడు వీరలక్ష్మి అధికారులను గోవర్ధన స్వామి గుడి వద్దకు రమ్మని కబురు పంపినది. పరీక్షకు సిద్ధమని తెలిపినది. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ గుడి వద్దకు చేరుకున్నారు.( to be continued...)

No comments:

Post a Comment