Tuesday, July 15, 2014

'నాదెండ్ల ఆన్ లైన్' నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు 16-7-14

నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ వీక్షకులకు నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు !

     నాదెండ్ల గ్రామ  వార్తా విశేషాలను, గ్రామ చరిత్ర , ఆలయాల చరిత్ర , నాదెండ్ల  గ్రామానికి మాత్రమే స్వంతమైన "నల్లమోతు వారి తాంబూలం " వంటి కొన్ని అపురూప చారిత్రక ఘట్టాలను  ప్రవాసీయులైన నాదెండ్ల గ్రామస్థులతో పాటు, అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో బ్లాగ్ ను  ప్రారంభించటం జరిగినది .  ఏ ఉద్దేశ్యంతో అయితే ప్రారంభించామో  అది సాధించినట్లే అని అనుకుంటున్నాము . ఈ బ్లాగ్ ద్వారానే నాదెండ్ల వాసులందరికీ దగ్గరవటం , కొందరయితే మమ్ములను తమ  సభ్యులుగా భావించటం మా అదృష్టం . ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో , మేము వచ్చి ఈ గ్రామంలో వృత్తి రీత్యా స్థిరపడి  మీలో కలిసిపోవటం, ఈ బ్లాగ్ ప్రారంభించాలనే ఆలోచన రావటం, పెద్దలందరూ ఎంతో  ప్రోత్సాహం ఇవ్వటం , చిన్న వాళ్ళ మైనా  మేము నిర్వహించిన ప్రతి కార్య క్రమానికి విచ్చేసి మమ్ములను ఆశీర్వ దించటం, ఇదంతా వారి పెద్ద మనస్సుకు నిదర్శనం . వారందరికీ  పేరు పేరునా  కృతఙ్ఞతలు . 


      గత సంవత్సరం నుండి బ్లాగ్ నిర్వహణ కొంత నెమ్మదించిన మాట వాస్తవం. ఉద్యోగ రీత్యా ఆరు నెలల పాటు నేను శిక్షణ లో ఉండటం, వ్యక్తిగతమైన సమస్యలు కొంత కారణం . అయినప్పటికీ facebook లో ఉంచబడిన ఫోటోలు ఉపయోగించుకొని పోస్టింగ్ లు ఇవ్వటం జరిగినది . ఈ విషయం లో మీ సేవ కేంద్రం నిర్వాహకులు శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 

     ప్రస్తుతం అయితే ఇంకా 10 నెలల పాటు నేను దేవాలయ సందర్శనకు అర్హుడను కాను . కారణం ఏమంటే 2 నెలల క్రితం మా నాన్న గారు స్వర్గస్తులైనారు . మా ఊరి సంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరం గడిచే వరకు దైవిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి . సంప్రదాయాన్ని గౌరవించాలి కదా! అందుకే దేవాలయాలకు సంబంధించిన విషయాలు అప్డేట్ చేయడం లో కొంత ఆలస్యం జరుగుతుంది . 

     మరొక ముఖ్య విషయం ఏమంటే బ్లాగ్ నిర్వహణ మొదలు పెట్టిన తరువాత నాదెండ్ల గ్రామ చరిత్రను గ్రంధస్తం  చేయమని చాలా  మంది గ్రామస్తులు అడగటం జరిగినది . గ్రామ విశేషాలు, గ్రామ శాసనాలు 95% సేకరించాము . కానీ , గ్రామ చరిత్రను ఏ విధంగా మొదలు పెట్టాలో అర్ధం కావడం లేదు . సరైన సమాచారం గానీ , ఆధారం గానీ  దొరక లేదు . హైదరాబాద్ లోని స్టేట్ ఆర్కైవ్స్ లో రెండు రోజుల పాటు  పుస్తకాలు తిరగవేసినప్పటికి, మన చుట్టూ ఉన్న గ్రామ  చరిత్రలు ఉన్నాయి గానీ, నాదెండ్ల గ్రామ చరిత్ర దొరకలేదు . ప్రస్తుతం మా ముందు ఉన్న పెద్ద సవాలు గ్రామా చరిత్ర గ్రంధస్తం చేయటమే . భగవంతుని కృప వల్ల  ఇది కూడా సాధిస్తామని అనుకుంటున్నాము . 

     బ్లాగ్ నిర్వహణ చూసి ముచ్చట పడి  మా ద్వారా  గ్రామంలో పాఠశాలల  కు  లక్ష రూపాయలు విరాళం గా  ఇచ్చిన నల్లమోతు జయరాం , నల్లమోతు నాసరయ్య, డా॥  నెల్లూరి సత్యనారాయణ, ఝాన్సీ టీచర్ గారి అబ్బాయి మురళి  , వీరితో పాటు మరొక 15 వేలు ఇచ్చిన గంగవరపు శ్రీనివాస రావు గార్లకు కృతఙ్ఞతలు . ఆ సొమ్మును అప్పుడే పాఠశాలల ప్రధానోపా ధ్యా యులకు ఇచ్చి వారితో పాఠశాలల అవసరాలు తీర్చే విధంగా చేయడం జరిగినది . 
 
     బ్లాగ్ ప్రారంభించిన కొత్తలో మాకు అవసరమైన కెమెరా అందించి, అప్పుడప్పుడు మాకు సలహాలు ఇచ్చిన వేములపల్లి శివబాబు  గారికి కృతఙ్ఞతలు . అదే విధంగా గతంలో బ్లాగ్ నిర్వహణ లో సహాయ పడిన మిత్రులకు , శ్రేయోభిలాషులకు కృతఙ్ఞతలు . 

     మరో చిన్న విషయం ఏమంటే బ్లాగ్ లో వచ్చే పోస్టింగ్ లకు ఏ విధమైన ముద్ర ఉండరాదన్నది మా ఉద్దేశ్యం . పార్టీ లు గానీ , కుల , మత, ప్రాంతీయ పక్ష పాతాలు లేవని భావిస్తున్నాము .  సమైఖ్యాంధ్ర ఉద్యమంలో 66 రోజులు ఉత్సాహం తో పాల్గొన్నది కేవలం మన అందరి సాముహిక ప్రయోజనాలు కాపాడాలనే సంకల్పం తోటే .  పదే  పదే  చెప్పి అబద్దాన్ని నిజం చేయాలనే వారి ప్రయత్నాన్ని ఆపాలనే ఉద్దేశ్యంతో అప్పుడప్పుడు కొన్ని పోస్టింగ్లు ఇవ్వడం జరిగినది . భవిష్యత్తు లో కూడా జరుగుతుంది .  గ్రామంలో మా దృష్టికి వచ్చిన వివాద రహిత విషయాలను మీ అందరికి తెలపడం జరుగుతుంది . ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు 

     సమీప భవిష్యత్తులో గ్రామంలోని ప్రభుత్వ అధికారులను , గ్రామం నుండి ఉన్నత స్థాయిలో ఉన్నవారిని మీ అందరికి పరిచయం చేయాలనే ఆలోచన ఉంది . మీరు ఇన్ని సంవత్సరముల నుండి మమ్ములను ఆదరించినందుకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము . 
                                                     ధన్యవాదములతో!                                                           

                                                                                                                                 మీ 
                                                                                                                    మన్నె  కుమారస్వామి ,
                                                                                                                   సంగిశెట్టి శ్రీనివాస రావు. 




నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక శీర్షిక :
"శ్రీ కృష్ణ ధ్యాన మందిరం, నాదెండ్ల "

No comments:

Post a Comment