Sunday, July 27, 2014

నాదెండ్ల లో బడి పిలుస్తుంది కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు 26-7-14



జ్యోతి ప్రజ్వలన 


GDCC  బ్యాంకు చైర్మన్ శ్రీ ముమ్మనేని వెంకటసుబ్బయ్య గారు 







డ్రాప్ అవుట్ విద్యార్ధులతో  మాట్లాడుతూ .. 

ఆడపిల్లనమ్మా .. అంటూ పాడుతున్న చిన్నారి 

చక్కగా పాడిన బాలికకు ప్రోత్సాహం 

యునిఫారం , పుస్తకాలు  అందజేత 

కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండే గారితో మంత్రి 



ప్రసంగిస్తున్న మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు 


కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండె గారు 



ZP చైర్ పర్సన్ శ్రీ జానీ మూన్ గారు 



నాదెండ్ల ZPTC  సభ్యురాలు 







ZP HM శ్రీ I . ఆంజనేయులు గారు 

ఈనాడు 

సాక్షి 

ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు , మీ సేవ 

నందికుంట విఘ్నేశ్వరుని దర్శించుకున్న మంత్రి వర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు , గుంటూరు ZP చైర్ పర్సన్ , కలెక్టర్ తదితరులు 26-7-14





















 

 
 ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు-- మీ సేవ

Wednesday, July 16, 2014

శ్రీ కృష్ణ ధ్యాన మందిరం - నాదెండ్ల

     
ప్రారంభం: 08-09-2013
పిరమిడ్ కొలతలు : 20X 20X 18 
జ్యోతి ప్రజ్వలన :  శ్రీ లక్ష్మణ రావు గారు, MLC 

ప్రారంభకులు : శ్రీ K .V. రావు గారు , మాస్టర్ , వైజాగ్ 

నాదెండ్ల గ్రామం లోని హరే రామ గుడికి దగ్గరలో పెద్ద పిరమిడ్ ధ్యాన మందిరమును నిర్వహించబడుతున్నది. ఇంత పెద్ద పిరమిడ్ ను ఇంటి మీద ఎవరు కట్టించారు? కట్టించడానికి గల కారణమేదో నిర్వాహకులను  జరిగినది .

     పిరమిడ్ ను నిర్మించి నిర్వహిస్తున్నది నాదెండ్ల గ్రామస్తులైన సలిశం  ఆంజనేయులు, లక్ష్మి పద్మ దంపతులు. ఆంజనేయులు గారు దక్షిణ ఆఫ్రికా లో ఒక సిమెంట్ కంపెనీ లో ప్రాసెస్ మేనేజర్ గా పని చేస్తున్నారు   . వారికి ఇద్దరు సంతానం . పిల్లల చదువుల నిమిత్తమై వారు విజయవాడలో ఉండే వారు. వారి పాప పావని మెడిసిన్ చదువుతున్నది. బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దురదృష్ట వశాత్తు మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం లో  మరణించాడు . కొడుకు చనిపోవడంతో తీవ్రమైన దుః ఖం లో మునిగి పోయారు ఆ దంపతులు . పుత్ర వియోగం  నుండి   తేరుకోలేక పోయిన ఆంజనేయులు గారిని ధ్యానం చేయమని సలహా ఇచ్చారు తెలిసిన వారు .

     మార్పు కొరకు అన్నట్లు బెంగళూరు లోని పిరమిడ్ వాలీ లో 41 రోజుల ధ్యాన శిక్షణ కు వీరు వెళ్ళటం జరిగినది . ఆంజనేయులు గారు అక్కడ ధ్యానం లో పూర్తిగా లీనమై అనుభూతి పొందారు. ధ్యాన శిక్షణ పూర్తీ అయ్యే నాటికి  పిరమిడ్ ధ్యానం లో చెప్పే 'ఆనాపాన  సతి ' అనగా "శ్వాస మీద ధ్యాస నిల్పుట "ను సాధించారు.  మాములు మనిషి కాగలిగారు .



     తను పొందిన అనుభూతి అందరికి అందించాలనే భావన కలిగి ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకున్నారు . మొదట విజయవాడ లోనే ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, స్వగ్రామమైన నాదెండ్ల లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిలాషించారు . ఇప్పుడు పిరమిడ్  నిర్మించిన స్థల స్వంత దారులను కలిసి వారికి  తమ ఆలోచన వివరించారు . వారికి  స్థలం  అమ్మే ఉద్దేశం లేనప్పటికీ వీరి సంకల్పానికి వారు స్పందించారు . పిరమిడ్ వరకు నిర్మిస్తే తరువాత నిర్వహణ కష్టం గా  ఉంటుందని భావించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు, ఆ పైన మొదటి అంతస్తు లో పిరమిడ్ నిర్మించాలని నిర్ణయించారు . పదవీ విరమణ తరువాత ఇక్కడ ఉండి  పూర్తి స్థాయిలో ధ్యానశిక్షణ  తరగతులు నిర్వహించాలని అనుకుంటున్నారు .

 












    
 ఈ మధ్యనే పిరమిడ్ నిర్మాణం పూర్తి అయింది . ఒక రోజు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి . ధ్యాన సాధకులు వెళ్ళి పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటున్నారు  . ఇక త్వరలో 41 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు . ఈ కార్యక్రమాలను ఆంజనేయులు గారి శ్రీమతి లక్ష్మీ పద్మ గారు పర్యవేక్షిస్తున్నారు .

        


     


 తాము  ఏదైతే మంచి అనుభూతిని పొంది, బాధల నుండి విముక్తి అయ్యమో ఆ మంచి అనుభూతిని అందరికీ  అందించాలనే సంకల్పం తోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దీనికి గ్రామంలోని ధ్యాన సాధకులు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు . 




       తాము పొందిన మంచిని అందరికి అందించాలనే సంకల్పం పెట్టుకొని దాని కొరకు అవిరళ కృషి చేస్తున్న ఆంజనేయులు దంపతుల ప్రయత్నం నూరు శాతం విజయవంతం కావాలని కోరుకొంటూ వారి నిస్వార్ధ  ప్రయత్నానికి నాదెండ్ల ఆన్ లైన్ అభినందనలు తెలియ చేస్తుంది .
                              

    సర్వే జనాః సుఖినో భవంతు !

    

Tuesday, July 15, 2014

'నాదెండ్ల ఆన్ లైన్' నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు 16-7-14

నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ వీక్షకులకు నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు !

     నాదెండ్ల గ్రామ  వార్తా విశేషాలను, గ్రామ చరిత్ర , ఆలయాల చరిత్ర , నాదెండ్ల  గ్రామానికి మాత్రమే స్వంతమైన "నల్లమోతు వారి తాంబూలం " వంటి కొన్ని అపురూప చారిత్రక ఘట్టాలను  ప్రవాసీయులైన నాదెండ్ల గ్రామస్థులతో పాటు, అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో బ్లాగ్ ను  ప్రారంభించటం జరిగినది .  ఏ ఉద్దేశ్యంతో అయితే ప్రారంభించామో  అది సాధించినట్లే అని అనుకుంటున్నాము . ఈ బ్లాగ్ ద్వారానే నాదెండ్ల వాసులందరికీ దగ్గరవటం , కొందరయితే మమ్ములను తమ  సభ్యులుగా భావించటం మా అదృష్టం . ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో , మేము వచ్చి ఈ గ్రామంలో వృత్తి రీత్యా స్థిరపడి  మీలో కలిసిపోవటం, ఈ బ్లాగ్ ప్రారంభించాలనే ఆలోచన రావటం, పెద్దలందరూ ఎంతో  ప్రోత్సాహం ఇవ్వటం , చిన్న వాళ్ళ మైనా  మేము నిర్వహించిన ప్రతి కార్య క్రమానికి విచ్చేసి మమ్ములను ఆశీర్వ దించటం, ఇదంతా వారి పెద్ద మనస్సుకు నిదర్శనం . వారందరికీ  పేరు పేరునా  కృతఙ్ఞతలు . 


      గత సంవత్సరం నుండి బ్లాగ్ నిర్వహణ కొంత నెమ్మదించిన మాట వాస్తవం. ఉద్యోగ రీత్యా ఆరు నెలల పాటు నేను శిక్షణ లో ఉండటం, వ్యక్తిగతమైన సమస్యలు కొంత కారణం . అయినప్పటికీ facebook లో ఉంచబడిన ఫోటోలు ఉపయోగించుకొని పోస్టింగ్ లు ఇవ్వటం జరిగినది . ఈ విషయం లో మీ సేవ కేంద్రం నిర్వాహకులు శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 

     ప్రస్తుతం అయితే ఇంకా 10 నెలల పాటు నేను దేవాలయ సందర్శనకు అర్హుడను కాను . కారణం ఏమంటే 2 నెలల క్రితం మా నాన్న గారు స్వర్గస్తులైనారు . మా ఊరి సంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరం గడిచే వరకు దైవిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి . సంప్రదాయాన్ని గౌరవించాలి కదా! అందుకే దేవాలయాలకు సంబంధించిన విషయాలు అప్డేట్ చేయడం లో కొంత ఆలస్యం జరుగుతుంది . 

     మరొక ముఖ్య విషయం ఏమంటే బ్లాగ్ నిర్వహణ మొదలు పెట్టిన తరువాత నాదెండ్ల గ్రామ చరిత్రను గ్రంధస్తం  చేయమని చాలా  మంది గ్రామస్తులు అడగటం జరిగినది . గ్రామ విశేషాలు, గ్రామ శాసనాలు 95% సేకరించాము . కానీ , గ్రామ చరిత్రను ఏ విధంగా మొదలు పెట్టాలో అర్ధం కావడం లేదు . సరైన సమాచారం గానీ , ఆధారం గానీ  దొరక లేదు . హైదరాబాద్ లోని స్టేట్ ఆర్కైవ్స్ లో రెండు రోజుల పాటు  పుస్తకాలు తిరగవేసినప్పటికి, మన చుట్టూ ఉన్న గ్రామ  చరిత్రలు ఉన్నాయి గానీ, నాదెండ్ల గ్రామ చరిత్ర దొరకలేదు . ప్రస్తుతం మా ముందు ఉన్న పెద్ద సవాలు గ్రామా చరిత్ర గ్రంధస్తం చేయటమే . భగవంతుని కృప వల్ల  ఇది కూడా సాధిస్తామని అనుకుంటున్నాము . 

     బ్లాగ్ నిర్వహణ చూసి ముచ్చట పడి  మా ద్వారా  గ్రామంలో పాఠశాలల  కు  లక్ష రూపాయలు విరాళం గా  ఇచ్చిన నల్లమోతు జయరాం , నల్లమోతు నాసరయ్య, డా॥  నెల్లూరి సత్యనారాయణ, ఝాన్సీ టీచర్ గారి అబ్బాయి మురళి  , వీరితో పాటు మరొక 15 వేలు ఇచ్చిన గంగవరపు శ్రీనివాస రావు గార్లకు కృతఙ్ఞతలు . ఆ సొమ్మును అప్పుడే పాఠశాలల ప్రధానోపా ధ్యా యులకు ఇచ్చి వారితో పాఠశాలల అవసరాలు తీర్చే విధంగా చేయడం జరిగినది . 
 
     బ్లాగ్ ప్రారంభించిన కొత్తలో మాకు అవసరమైన కెమెరా అందించి, అప్పుడప్పుడు మాకు సలహాలు ఇచ్చిన వేములపల్లి శివబాబు  గారికి కృతఙ్ఞతలు . అదే విధంగా గతంలో బ్లాగ్ నిర్వహణ లో సహాయ పడిన మిత్రులకు , శ్రేయోభిలాషులకు కృతఙ్ఞతలు . 

     మరో చిన్న విషయం ఏమంటే బ్లాగ్ లో వచ్చే పోస్టింగ్ లకు ఏ విధమైన ముద్ర ఉండరాదన్నది మా ఉద్దేశ్యం . పార్టీ లు గానీ , కుల , మత, ప్రాంతీయ పక్ష పాతాలు లేవని భావిస్తున్నాము .  సమైఖ్యాంధ్ర ఉద్యమంలో 66 రోజులు ఉత్సాహం తో పాల్గొన్నది కేవలం మన అందరి సాముహిక ప్రయోజనాలు కాపాడాలనే సంకల్పం తోటే .  పదే  పదే  చెప్పి అబద్దాన్ని నిజం చేయాలనే వారి ప్రయత్నాన్ని ఆపాలనే ఉద్దేశ్యంతో అప్పుడప్పుడు కొన్ని పోస్టింగ్లు ఇవ్వడం జరిగినది . భవిష్యత్తు లో కూడా జరుగుతుంది .  గ్రామంలో మా దృష్టికి వచ్చిన వివాద రహిత విషయాలను మీ అందరికి తెలపడం జరుగుతుంది . ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు 

     సమీప భవిష్యత్తులో గ్రామంలోని ప్రభుత్వ అధికారులను , గ్రామం నుండి ఉన్నత స్థాయిలో ఉన్నవారిని మీ అందరికి పరిచయం చేయాలనే ఆలోచన ఉంది . మీరు ఇన్ని సంవత్సరముల నుండి మమ్ములను ఆదరించినందుకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము . 
                                                     ధన్యవాదములతో!                                                           

                                                                                                                                 మీ 
                                                                                                                    మన్నె  కుమారస్వామి ,
                                                                                                                   సంగిశెట్టి శ్రీనివాస రావు. 




నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక శీర్షిక :
"శ్రీ కృష్ణ ధ్యాన మందిరం, నాదెండ్ల "