శ్రీ కముఖల అమర గురు మందిరం:
నాదెండ్ల గ్రామంలోని శ్రీ కముఖల అమరగురు మందిరం ( అమరయ్య స్వామి మఠం) నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో గురు బిడ్డలు ( శిష్యులు) అందరు పాల్గొని అమర గురు వారి సజీవ సమాధికి పూజలు జరిపారు. సజీవ సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేసినారు. ఈ కార్యక్రమం పీఠాధిపతి బూతుకురి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యం లో జరిగినది. భజన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశిస్సులు పొందినారు.
శ్రీమద అచల రుషి పూర్ణానంద రాజయోగి సద్గురువు పీఠం:
నాదెండ్ల గ్రామంలో ఉన్న శ్రీమద అచల రుషి పూర్ణానంద రాజయోగి పీఠం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులందరూ పీఠం వద్ద శ్రీ పూర్ణానంద గురువుగారి పాదుకలకు పూజలు జరిపారు. గురు పరంపరలో ప్రస్తుత గురువు శ్రీ కృష్ణానంద దీక్షితయ్య తోట కృష్ణారావు గారు శిష్యుల పూజలు అందుకొని అనుగ్రహ భాషణం చేసినారు. గురు పౌర్ణమి విశిష్టత, గురు శిష్య సంబంధం , జనన మరణ చక్రం నుండి తప్పించుకొనుటకు మార్గం సద్గురువేనని బోధ చేసారు. శ్రీమతి మండవ మాణిక్యమ్మ గారి అధ్వర్యంలో భజన బృందము భజన నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు బసవమ్మ, రంగ నాయకమ్మ , నారాయణమ్మ మరియు శిష్య బృందము అధిక సంఖ్యలో పాల్గొని సద్గురు ఆశిస్సులు పొందారు. ( ఈ పీఠం దేవ భక్తుని వారి వీధిలో నున్న నల్లమోతు వెంకట నాగేశ్వర రావు , మాజీ సర్పంచ్, గారి కొష్టం లో ఉన్నది.)
Note : This post is published from Doctor Nallamothu Swamy's House.
Monday, July 26, 2010
Sunday, July 25, 2010
తొలి ఏకాదశి 21-07-2010
మన గ్రామంలో పిల్లలు, పెద్దలు అందరు ఇష్టపడే పండుగ తొలి ఏకాదశి. బహుశ పది సంవత్సరాల క్రితం ఈ రోజు గ్రామంలోని ఆడ వాళ్ళందరూ తెల్లవారుజామున చలం కొండలలో ఉన్న రామబుగ్గలో స్నానం చేసి, సీతమ్మ తోపులో ఉన్న మర్రి చెట్టు క్రింద ఉన్న పుట్టకి పూజ చేసి, తర్వాత ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, ఆ పూట కార్యక్రమం పూర్తి చేసేవారు. మీరందరూ వృత్తి, ఉద్యోగాల రీత్యా గ్రామాంతరం వెళ్ళటం, ఉన్న కుర్రాళ్ళు, పిల్లలు చదువులతో బిజీ కావటంతో ఈ మధ్య రామ బుగ్గ కు వెళ్లి స్నానం చేసే వారు కరువయ్యారుచలం కొండలు కూడా రాళ్ల కుప్పలుగా మారుతున్నాయి.
ఈ రోజు రాళ్ల తవ్వకం కాటంరాజు గుడి దగ్గరకు వెళ్ళింది. బహుశ మీరు మళ్లీ మన ఊరువచ్చేసరికి చలం కొండల్లో ఉన్న రెండు కొండల్లో దక్షిణం కొండం మిగలక పోవచ్చు. ఈ కొండల్లోని దొన(సొరంగం లాంటిది. దాని కింద మడుగులో నీరు) , సీతమ్మ అడుగులు , గొడుగు, దాని క్రింద శిధిల విగ్రహాలు ఉన్నాయి. ఇది వరకు సంతానం లేని దంపతులు వెళ్లి గొడుగు క్రింద కూర్చుంటే వారికీ పిల్లలు పుట్టే వారట
కొంతమంది పరిచయస్తుల తో రామబుగ్గలో స్నానాలు అని అనగానే సంతోషంగా కదిలి వచ్చారు. గత నాలుగైదు రోజుల నుండి వర్షాలు ఎక్కువగా కురియుట చే నడిచే దారి కూడా సరిగా లేదు. అయిన ఉత్సాహం తో బురద, కంప ముళ్ళు లెక్క చేయక కొండ ఎక్కి రామ బుగ్గలో పసుపు, కుంకుమ వేసి పూజ చేసి, స్నానాలు పూర్తి చేసారు. తరువాత కొండ దిగువున ఉన్న వినాయకుని పూజ చేసి కొందరు కొబ్బరి కాయలు సమర్పించారు. సీతమ్మ చెరువు గట్టునే పెద్ద మర్రి చెట్టు చూసారు కదా! పన్నెండు కొమ్మలతో ఉంది. పన్నెండు కొమ్మల మిద పన్నెండు పడుగల నాగమయ్య ఉండి కాపాడతాడని భక్తుల నమ్మకం. ఆ చెట్టు కిందనే పుట్ట ఉంది. ఆ పుట్టకు కూడా పూజలు చేసి తరువాత ఆంజనేయ స్వామిని దర్శించి, తమ తొలి ఏకాదశి పవిత్ర స్నాన కార్యక్రమం పూర్తి చేసారు.
దొన
తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే గ్రామం ఆలయాలకు, మఠాలకు భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా శివాలయం, వినాయకుని గుడి, అమరయ్య స్వామి మఠం . కొందరు కోటప్ప కొండకు వెళ్లి కోటయ్య స్వామి ని దర్శించుకున్నారు. హర హరో..! చేదుకో కోటయ్య..!
సాయంత్రం పూట మన గ్రామం లోని దేవాలయాలన్నిటిలో భక్తులు ఘనంగా భజనలు చేసారు. తొలి ఏకాదశి తరువాత రోజు పిల్లలందరికీ పండుగ రోజు. ఈ రోజునే హై స్కూల్ పిల్లలందరికీ సెలవు ఇవ్వటం తో, అందరు కొండపైకి యెక్కి అక్కడ బాగా ఆటలు ఆడారు. ఏది ఏమైనా చిన్న తనాన మీరు ఎంజాయ్ చేసినంతగా ఈ రోజు లేదనే చెప్పాలి.
నిన్న ఉపవాసం చేసిన వారు జాగారం చేసి ఉపవాసం పూర్తి చేసుకొని నేడు స్వామి వారికి నైవేద్యం ఘనంగా సమర్పించుకొన్నారు. ఎక్కువమంది మన సాంప్రదాయ వంటకాలు అయిన గారెలు, పూర్ణాలు మొదలైనవి చేసారు.
Thursday, July 22, 2010
పొలం కబుర్లు
గత నెల రోజుల నుండి వర్షాలు విస్తారంగా కురియుట చే గ్రామంలో వ్యవసాయ పనులు ఉపందుకున్నాయి. ఉహించని విధంగా వర్షాలు ఎక్కువగా ఉండుటచే రైతులు పొలాలు పైరు విత్తుటకు సిద్దం చేయలేదు. అందరు వేసవి కాలంలో పొలమంతా నాగళ్ళు తోలించారు. నేల లోతుగా తెగుటచే వర్షపు నీరు ఎక్కువ తాగి చేలు ఆరలేదు. గొర్రు తోలించటానికి ప్రయత్నం చేసినా నెమ్ము ఎక్కువగా ఉండుటచే కుదర లేదు. అందుకే ఎక్కువమంది విత్తలేక పోయారు.
కొందరు రైతులు వర్షాలకు ముందుగానే పొలం పాటు చేసుకోవటంతో (పొలాన్ని విత్తటానికి రెడీ చేయుట) విత్తనాలు విత్తగలిగారు. నెమ్ము బాగానే ఉండటంతో బాగా మొలకెత్తాయి అనుకుంటుండగా ఒక తెల్ల వారు జామున కురిసిన భారి వర్షానికి పొలమంతా మేట వేసుకోనిపోయి( వర్షానికి మట్టి కొట్టుకొని వచ్చి మందమైన పొరలా ఏర్పడుట) విత్తనాలు మొలకెత్తవని ఆందోళన చెందారు. మరల ఒక చిన్న జల్లు పడుట వలన మేట వేసిన చేలో విత్తనాలు కొంతవరకు మొలవ గలిగాయి. ఎక్కువ మేట వేసిన చేలో విత్తనాలు సరిగా మొలవ లేదు. విత్తులు నాటిన వారిలో మొలక శాతం మిశ్రమంగా ఉంది. రైతులందరూ రెండు, మూడు రోజులపాటు ఎండా కాస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే వారంలో వ్యవసాయ పనులు ఊపు అందుకుంటాయి.

Monday, July 19, 2010
సవరణలు
బ్లాగ్ ఆవిష్కరణ వాయిదా పడకూడదనే ఉద్దేశం తో పోస్టింగ్స్ త్వరగా చేయటం జరిగింది. త్వరలో వ్యాకరణ దోషాలను సరి చేసి , మరిన్ని ఫోటోలను పోస్ట్ చేయటం జరుగుతుంది. మీ ఆదరాభిమానాలను కోరుకుంటూ... కుమార స్వామి.
Friday, July 16, 2010
బ్లాగ్ ఆవిష్కరణ 16-07-2010
చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ స్కూల్ నందు బ్లాగ్ ఆవిష్కరణ జరిగినది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ నల్లమోతు వెంకట నటరాజేశ్వర రావు గారు బ్లాగును 2.52 గం. లకు ఆవిష్కరించారు.ఈ బ్లాగును స్థానిక M.P.P.School, CD, అంబేద్కర్ నగర్ ఉపాధ్యాయులు మన్నె కుమార స్వామి , ఎస్ . శ్రీనివాసరావు లు రూపొందించారు. గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాల వారికి పరిచయం చేయటం, గ్రామంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి దూరంగా వుండే వారికి నిత్యం అందుబాటులో ఉంచేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని నటరాజేశ్వర రావు గారు మరియు ఆహ్వానితులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇస్కాన్ జిల్లా సమన్వయకర్త బందినేని రామకృష్ణ మాట్లాడుతూ సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో మోడరన్ సంస్థల అధినేత శ్రీ చేబ్రోలు మహేష్, నాదెండ్ల యం.ఈ.వో శ్రీ యం.వి. సుబ్బారావు గారు, శ్రీ శేషగిరి నాదెండ్ల గ్రామస్తులు శ్రీ నెల్లూరి వెంకయ్య, శ్రీ అనుమోలు నరసింహారావు, శ్రీ నెల్లూరి శేఖర్, శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు, శ్రీ వేములపల్లి శ్రీరంగం మరియు మహిళలు పాల్గొని విజయవంతం చేసారు.
గోవర్ధన స్వామి ఆలయం
ఆలయం పురాతన కాలంలో తాత కొండ పైన నిర్మించబడి ఉన్నదని, ముష్కరుల దండ యాత్రలో ఇది ద్వంసమైనదని పెద్దల మాట. తరువాత కాలంలో ఆలయార్చకునికి స్వామి వారు కలలో కనపడి తన ఉనికిని చెప్పి ప్రస్తుతము గుడి ఉన్న చోట ప్రతిష్టించమని ఆదేశించగా నేటి విధంగా నిర్మించారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్న కేశవ స్వామి
గోవర్ధన స్వామి వారు
చెన్న కేశవ స్వామి గర్భ గుడి
ఆళ్వారులు
Thursday, July 15, 2010
శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానము, శంభునిపాలెం
శంభునిపాలెం నందు పురాతన కాలంలోనే స్థానికులు పూజలు, భజనలు చేసుకొనుటకు తమ ఆవాస ప్రాంతంనందు ఒక శ్రీరామ మందిరమును ఏర్పాటు చేసుకొన్నారు. ఈ మందిరము నందు మట్టితో చేసిన సీతా,లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ స్వామి వారి విగ్రహములను ప్రతిష్టించి పూజలు, భజనలు నిర్వహించేవారు.
మందిరమునకు , ఆలయమునకు చిన్న బేధము కలదు. మందిరము నందు భజనలు చేయుట , సత్సంగము చేయుట మాత్రమే చేయుదురు. మందిరములో చెక్క లేదా మట్టితో చేసిన విగ్రహములు ఏర్పాటు చేసుకొని, ఆయా పుణ్య దినములలో దేవుని ఆరాధింతురు. ఆలయమునందు ఆగమ శాస్త్రం ప్రకారం శిలా విగ్రహములు ప్రతిష్టించి శాస్త్రోక్తముగా పూజలు జరుపుదురు.
శంభునిపాలెం నందు స్థానికులు శ్రీ రామ మందిర స్థానంలో కొత్తగా శ్రీ కోదండ రామ స్వామి వారి దేవస్థానము నిర్మించాలని సంకల్పించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు.
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నాదెండ్ల గ్రామ శ్రీ సీతారామస్వామి దేవస్థాన వంశ పారంపరి ధర్మకర్త శ్రీ పండా వెంకటప్పయ్య గారి పర్యవేక్షణలో ఆలయమును నిర్మించి ది.18-2-2007 నుండి 22-2-2007 వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ కార్యక్రమాలను నిర్వహించి ది.22-2-2007 ఉదయం 12.07 గం. అనగా స్వస్తి శ్రీ చాంద్ర మానేన శ్రీ వ్యయ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి గురువారం, అశ్వని నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరంశామునందు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన గావించినారు.
ఆ రోజు మొదలు ప్రతి శనివారము మరియు వివిధ పర్వదినములయండు స్థానికులచే భజనలు, పూజలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి వార్శికోత్సవమునాడు స్వామి వారికి శాస్త్రోక్తంగా వివిధ కార్యక్రమములు నిర్వహించి అన్నదానం జరుపుతున్నారు.
ఈ వివరములు అందించిన వారు కమిటి తరుపున నెల్లూరి శేఖర్ , మరియు తేలప్రోలు వెంకటరావు గార్లు .
ఉత్సవ విగ్రహములు
Wednesday, July 14, 2010
శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం
నాదెండ్ల గ్రామంలో ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ గంగ పార్వతి సమేత మూల స్థానేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. దీనిని మార్కండేయ మహర్షి స్థల పురాణం. కాకతీయ చక్రవర్తి , గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శివ దేవుడు ఈ ఆలయంలోనే గోళఖి మఠాన్ని స్థాపించి నిర్వహించారని, ఆయన దర్శనార్ధం గణపతి దేవుడు ఈ ఆలయాన్ని దర్శించాడని పురావస్తు శాఖ వారు తెలిపారు.
స్థానికంగా ఈ ఆలయంలో జరిగే కార్తీక పౌర్ణమి పండుగ ఎంతో ప్రసిద్ధి. గ్రామానికి చెందిన నల్లమోతు సీతమ్మ భర్త పొలంలో చనిపోయి యుండగా ఆయనను శివాలయములోకి తీసుకోని వచ్చి, ఆయన బ్రతికితే అఖండము పెట్టించి జ్వాల తోరణము (చిచ్చుల తోరణము) ఏర్పాటు చేయిస్తానని సీతమ్మ గారు స్వామి వారికి మొక్కినది. తెల్లవారే సరికి ఆయనలో కదలిక వచ్చినది. ఆయన బ్రతికినందుకు గుర్తుగా ఆనాటినుండి, కార్తీక పౌర్ణమి నాడు, అఖండ దీపం వెలిగించి, చిచ్చుల తోరణం ఏర్పాటు చేస్తారు. దీని కొరకు సీతమ్మ తోపు పేరుతొ, పదకొండు ఎకరాల మాన్యము ఏర్పాటు చేయించినది.
నేడు ఎంతోమంది గ్రామస్తులు స్వామివారిని నమ్ముకొని ప్రతి సోమవారము మరియు ఆయా విశిష్ట దినములలో స్వామివారికి అభిషేకములు, పూజలు జరిపించుచున్నారు. ఈ ఆలయములో అఖండ దీపారాధన ఉన్నది. ఈ ఆలయము ముస్లిము రాజుల దురాగతానికి గురి అయినట్లు ఆలయములో శాసనముల వలన తెలియు చున్నది.
ఈ ఆలయములో ప్రతి రోజు బిందె తీర్థము, మేళ తాళాలతో అర్చకులు తీసుకోని వస్తారు.
ఈ ఆలయమునకు ధర్మకర్త శ్రీ నల్లమోతు వెంకట నట రాజేశ్వర రావు గారు.
ప్రధాన అర్చకులు సాంబశివరావు గారు .
అభిషేకం చేయిస్తున్న భక్తులు.
గర్భాలయం లో పార్వతి అమ్మవారు.
వీరభద్ర స్వామి
భద్రకాళి అమ్మవారు.
స్వామి వారి కళ్యాణ వేదిక
బాల త్రిపుర సుందరి అమ్మవారు.
నాగవయ్య పడగ
ఆరుద్ర మండపం(శివ ముక్కోటి నాడు ప్రత్యేక పూజలు జరిపే మండపము)
ప్రముఖ శైవ క్షేత్రాలలో మాత్రమే వుంటుంది.
ఆలయ వెనుక భాగంలో ఉన్న జమ్మి , మారేడు చెట్లు
ధ్వజస్తంభం
రధశాల
కళ్యాణ మండపము
Monday, July 12, 2010
శ్రీ కముఖల అమరగురు మందిరం (అమరయ్య స్వామి మఠం)
ధరణికోట (అమరావతి) జమిందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయన సోదరికి వివాహము జరిపించి అత్తవారింటికి పంపించుచుండగా మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో 'చెంచులు' అనే కొండ జాతికి చెందిన కొందరు ఆమెను చెరపట్టి చంపివేసినారు. భటుల ద్వారా విషయాన్ని తెలుసుకొన్న రాజావారు ఆవేశంతో చెంచు జాతిని నిర్మూలించాలనే తలంపుతో ధరణికోటయందు అన్నదానం జరుపుతామని ప్రకటించగా అన్నం కొరకు ఆశ పడి సమీప అటవీ ప్రాంతంలో నివసించే వందలమంది చెంచులు అక్కడకు రాగా, వారందరినీ చంపించినాడు.
వారి హత్య వలన కర్మ పాపం చుట్టుకొని రాజ వారికి ఆహరం సహించరానిదై అన్నం పురుగులలాగా కనిపించసాగినది. ఆ పాపం పోగొట్టుకొనుటకు గాను అన్నదానం జరిపించుట, శివాలయాలు నిర్మించుట, దేవాలయాలకు మాన్యాలు ఇచ్చుట, నదీస్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించుట, బ్రాహ్మణ వటువులకు యగ్నోపవీతాలు ఏర్పాటుచేయుట, బ్రాహ్మణ కన్యలకు వివాహాలు జరుపుట మొదలైన పుణ్య కార్యాలు జరిపించినాడు. ఎన్ని పుణ్య కార్యాలు జరిపినా కర్మరహితం కాలేదు. ఈ విధంగా కొన్ని సంవత్సరములు జరిగిపొయినాయి.
ఆ కాలంలో జమిందారు గారి ఆస్థానానికి వచ్చిన ఒక సాధుపుంగవుడు, ఆయనతో ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా కర్మరహితం చేసుకోమని మార్గం చూపించాడు. అంతటి గొప్ప మహనీయుడు శ్రీరామ భక్తుడు , ఆంజనేయస్వామి ఉపాసకుడు శ్రీత్రిపురాంతకం అనే గ్రామంలో శివాలయానికి తూర్పున ఆశ్రమం నిర్మించుకొన్న శ్రీ నాసర్ మొహమ్మద్ అన్న విషయం తెలుసుకొని రాజావారు వారిని సగౌరవంగా పిలిపించుకొన్నారు. వారి ద్వారా మంత్రోపదేశం పొంది కర్మవిముక్తులు కావాలని అనుకొన్నారు.
ఒక మహమ్మదీయ గురువు వద్ద రాజావారు మంత్రోపదేశం పొందటం నచ్చని ఆస్థాన బ్రాహ్మణ గురువులు రాణి వారిని ఆశ్రయించి, రాజావారు గురువుగారిని కలవనియకుండా చేయాలనీ ఆమెకు చెప్పారు. రాజావారు మంత్రోపదేశం కొరకు గురువుగారిని దర్సిన్చుకోనబోయే సమయానికి రానివారు రాజావారి వద్దకు వచ్చి, తను బహిష్టునైయున్నానని చెప్పగా హతాశుడైన ఆయన నా జన్మకు ఈ కర్మ తప్పదని విలపిస్తూ ప్రాణాలు వదిలారు.
శ్రీ నాసర్ మొహమ్మద్ గారు ధరనికోటలో కోటలో ఉండగా ఆయనకు సేవలు చేయుటకు రాజగ్నతో అమర్య అనే సిపాయి నియమించబడ్డాడు. రాజావారి మరణంతో శ్రీ నాసర్ మొహమ్మద్ గారు తిరిగి వెళుచుండగా ఆయన సేవకునిగా నియమించబడిన అమరయ్యగారు కూడా వారి వెంట వెళ్లారు. అనంతర కాలంలో మంత్రోపదేశం పొందిన అమరయ్య గారు పన్నెండు సంవత్సరములు గురు సేవ చేస్తూ అక్కడే నివసించారు. తదుపరి గురుభక్తి యందు పరిపూర్ణుడైన తన శిష్యుడైన అమరయ్యను చూసి శ్రీ నాసర్ మొహమ్మద్ గారు "అమరయ్యా! నివు నా వద్దకు వచ్చి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నావు. నివు ప్రజలలో భక్తీ ప్రచారం చేసి జాగరణ రహితమైన విధానాన్ని నిన్ను నమ్మిన భక్తులకు ఉపదేశించు. సమస్త మానవాళికి భక్తీ, జ్ఞానము, వైరాగ్యము అనే విధాలు బోధించు. భవిష్యత్తులో గుంటూరు మండలం నాదెండ్ల గ్రామంలోని ముచికుంద పర్వత సమీపాన ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అందునుండి అనేక జనావళికి మోక్ష మార్గం చూపి తదుపరి జీవైక్య సిద్ది పొందమని ఆశీర్వదించారు.
అనంతర కాలంలో అమరయ్య గారు శ్రీశైలం నందు ఉండగా వారిని దర్శించుకొని వారి బోధనలు విన్న నాదెండ్ల గ్రామా పెద్దలు, అమరయ్య గారిని తమ గ్రామమునకు ఆహ్వానించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. వీరు అనేక మందికి పరః బ్రర్హా తత్వ ఉపదేసమును బోధించుచు సన్మార్గ ప్రవుత్తులుగా చేసారు. తదుపరి కొన్ని సంవత్సరముల తరువాత సివజీవైక్య సిద్ది పొందుటకు గురుపద రేణువులను తన కుమారునికి గురుపీతదిపత్యం ఏర్పాటు చేసి తాను భక్తులు, శిష్యులచే సజీవ సమాధి ఏర్పాటు చేసుకొని పూజాది ద్రవ్యములతో జీవసమాధి సిద్ధిని పొందారు.
గురుపద రేణువుల గురించి ఒక మాట:
అమరయ్య గారికి పుట్టుకతో చూపులేని ఒక మగబిడ్డ జన్మించారు. అంతటా అమరయ్య గారు ఆ పసిబాలుని తీసుకోని భార్యతో సహా గురువు ఆశ్రమమునకు వెళ్లి దీవెనలు పొందిరి. గురువు గారి పదముల వద్ద ఉంచగా వారి పద స్పర్శతో నేత్రములు పుష్పములవలె విచ్చుకున్నాయి. గురు పాద స్పర్స చే చూపు వచ్చినది కనుక ఆ బిడ్డకు గురుపాద రేణువు అని పేరు పెట్టుకున్నారు.
ఆ తరువాత కాలంలో గురుపాదరేనువులు ఆశ్రమాన్ని అభివృద్ధి చేయుచు అనేక మంది భక్తులకు బ్రహ్మోపదేసం చేస్తూ యాభై సంవత్సరాలు జీవించారు . వారికి లేకపోవుటవలనe సత్తెనపల్లి తాలూకా కందులవారి పాలెం గ్రామానికి చెందినా తన శిష్యుడైన బూతుకూరి గురవారెడ్డి గారికి గురుపీథాన్ని అప్పగించి వారలు సిద్ది పొందారు.
బూతుకూరి గురవారెడ్డి గారు ' ఎరుక నిరసన అనే తత్వ గ్రంధాన్ని రచించి తన గురువుగారి అపర మహిమను భక్త కోటికి ఉపదేశ మార్గంగా అవిష్కరించిరి. వారును యాభై సంవత్సరాలు జీవించి చీయుచు సంపూర్ణముగా నిర్మించి వారును సిద్ది పొందిరి. గురవా రెడ్డి గారికి ముగ్గురు కుమారులు కలరు . వారు నాసర్ బ్రహ్మం, అమరయ్య, పాదరేణువు . గురవా రెడ్డి గారు నాసర్ బ్రహ్మం గారికి మఠాధిపత్యం అప్పగించిరి. నాసర్ బ్రహ్మం గారి కాలంలో మఠాన్ని మిద్దె గాను, చుట్టూ ప్రహరీ గోడను నిర్మించిరి.
వారికి సంతానం లేకపోవటంతో తన తమ్ముని కుమారుడైన నారాయణ రెడ్డి గారిని దత్తు తీసుకోని వారికి పిఠాధిపత్యం అప్పగించి వారు నిర్యాణం పొందిరి. ప్రస్తుతం పీఠాధిపతిగా నారాయణ రెడ్డి గారు ఉన్నారు. పాత మిద్దె సిదిలావస్థ కు చేరుకోవటం తో గ్రామ పెద్దలు, భక్తులు జిల్లా పరిషత్ వారి సహకారం తో మఠాన్ని నూతనంగా నిర్మించినారు.
ఈ మఠముa నందు బ్రహ్మోత్సవాలు ప్రతి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం జరుగును. ఆనాడు అమర గురు ఆరాధన, గంధము, జెండాలు , పీఠం గ్రామంలో ఊరేగింపు జరుగును. ప్రతి సోమవారము, మరియు శుక్రవారము ఆధ్యాత్మిక భజనలు జరుగును.
Tuesday, July 6, 2010
మేకల స్వామి
ఎన్నో ఆలయాలు, శిలలు, పూజలు, భజనలు నిత్యం గ్రామంలో దైవ సంకీర్తనం, హిందూ సంస్కృతి సంప్రదాయాలు కనులకు కట్టినట్లు వుండే ప్రాంతం నాదెండ్ల. ఎందరో సిద్దులు, యోగులు, అవదూతలు తిరుగాడిన చోటు ఈ గ్రామం. ఈ గ్రామం లోనే పుట్టి పెరిగి, ఈ గ్రామాన్ని పావనం చేసిన మహనీయుడు శ్రీ మేకల స్వామి వారు. వారి చరిత్రను ఒక సారి తెలుసుకుందాం.
నాదెండ్ల గ్రామానికి చెందిన శ్రీ మేకల కోటయ్య, వెంకట లక్ష్మమ్మ గారి కుమారుడు మేకల స్వామి. ఈయన చిన్న తనం నుండి గ్రామం లోని ఓ బ్రాహ్మణ కుటుంబం దగ్గర జీతానికి ఉండి అరక దున్నటం, పశువులు కాయటం వంటివి చేసేవారు. ఒక రోజు ఆ కుటుంబం వారు గురోపదేశం తీసుకొనుటకు ఏర్పాట్లు చేసుకొంటుండగా వారినుండి వివరాలు తీసుకున్నారు. గురోపదేశం అందరికీ ఇవ్వరని అది అత్యంత రహస్యమైన విషయమని వారి నుండి తెలుసుకున్నాడు. ఎలాగైనా గురోపదేశం ఎలా ఇస్తారో తెలుసుకోవాలని, వారు గురోపదేశం తీసుకొనే సమయాన చాటుగా గమనించి గురు మంత్రాన్ని మనసులో గుర్తుంచుకొన్నారు.
ఆనాటి నుండి ఆయన ప్రతి రోజు నిష్టగా గురు మంత్రాన్ని ధ్యానించుట వలన ఒక విధమైన శక్తి పొందారు. పొలం వెళ్లి అరక కట్టి వదిలితే ఎద్దులు అవే దున్నేవి. పశువులు మేత మేయకుండానే నేమరువేసేవి. గ్రామం లోని చలం కొండల్లో ఎందఱో మునులు తపస్సు చేసుకుంటున్నారని అందరు అనుకుంటారు. మేకల స్వామి చలం కొండల్లోకి వెళ్లి మూడు రోజులపాటు తపస్సు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల తరువాత శ్రీ స్వామి వారు దారిని వెళ్తుండగా ఒక కమ్మరి కొలిమి దగ్గర ఒకరు ఆపి మూడు రోజులపాటు కొండల్లో తిరిగి ఏమి సాధించావు అని ఎగతాళిగా మాట్లాడగా కొలిమిలో ఎర్రగా కాలిన ఒక ఇనుప బద్డెను చేతితో బయటకు తీసి రెండు ముక్కలుగా విరిచి అక్కడ పడవేసి ప్రశాంతంగా వెళ్లి పోయారు. ఈ చర్యతో స్వామి వారి శక్తి చూసిన గ్రామస్తులు వారి ఎడల ఎంతోభక్తీ తో వున్నారు. జ్ఞాన అన్వేషణలో తృప్తి పొందని శ్రీ స్వామి వారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం అనే గ్రామంలో శ్రీ నాసర్ మొహమ్మద్ అనే గురువు దగ్గర ఉపదేశం పొంది, గురుసేవ చేసుకొని గురువుగారి అనుమతితో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కొంత కాలం గ్రామంలో గడిపిన మీదట గ్రామంలో మఠం ఏర్పాటు చేసుకుంటానని గ్రామా పెద్దలతో తెలుపగా, వారు తమ అసక్తతను వెల్లడించారు. స్వామివారి శక్తి దేశానికీ తెలియాలంటే గ్రామం విడిచి వెళ్ళాలని దైవ నిర్ణయం కాబోలు. తర్వాత కాలంలో స్వామి వారు గ్రామం విడిచి వెళ్తూ, గ్రామంలో ఒక అంతరం ఏర్పాటు చేసారు. కరువు కాటకాలు సంభవించి వర్షం పాడనప్పుడు ఏడు రోజులు లేదా, తొమ్మిది రోజులు ఆంత్రం చుట్టూ ఎనిమిది అడుగుల వైశాల్యంలో కట్ట వేసి నీటిని నింపిన, భూమి లోపల ప్రతిష్టించిన ఆంత్రం తడిచినప్పుడు వర్షం పడుతుందని చెప్పి, ఆంత్రం గుర్తుగా భూమిపై ఒక రాయిని నిలిపి గ్రామం వదిలి దేశాటనకు వెళ్ళినారు. మేకల స్వామి దేశాటన చేస్తూ, కర్నూలు జిల్లా, కోవెల కుంట తాలూకా, గుంటిపాపల గ్రామం వద్దకు చేరు కున్నాడు. ఆ గ్రామా సమీపం లోని ఒక దరి వద్ద కూర్చొని వుండగా, అనేక మంది ప్రజలు రోదిస్తూ గ్రామంలోకి వెళ్తున్నారు. అటువైపు వెళ్తున్న ఒక ముసలమ్మను పిలిచి, ఎక్కడికి వెళ్తున్నారు అనగా, ఈ సమీపం లోని మూడు గ్రామాలకు పెద్దగ వ్యవహరించే కపుకు ఒక్కడే కొడుకని, అయన పాము కరిచి చనిపోయాడని, ఏంటో మంచి వాడని చెప్పింది. నేను వెళ్లేసరికి అంత్యక్రియలు పుర్తవుతఎమోనని ఆయాసపడుతూ చెప్పింది. ఆ మాట విన్న స్వామి, అమ్మ! ఆ అబ్బాయి చనిపోలేదు, నేను నీకు కర్రపుల్ల ఇస్తాను. అది తీసుకోని వెళ్లి దానిని సాది నీటిలో కలిపి ఆ బాబు నీటిలో పోయండి అని తన వద్దనున్న చిన్న చెక్క పుల్లను ఇచారు. ఆ ముసలమ్మ ఆదరాబాదరాగా పడుతూ లేస్తూ గ్రామంలోకి వచ్చింది. ఆమె వచ్చే సమయానికి పాడె ఎత్తి తీసుకుపోవటానికి బయలుదేరగా, ఆమె అడ్డు వచ్చి తనకు ఎవరో మహనీయుడు వచ్చే దారిలో కొండల్లో కనిపించి ఒక చెక్క ఇచాడని, దానిని కరిగించి బాబు నోటిలో పోయమన్నాడని, బాబు బ్రతుకుతాడని చెప్పాడని వారితో చెప్పగా పాడెను దించి, కట్లు విప్పదిసి, ముసలమ్మా చెప్పినట్లు చేయగా, పాము కరిచిన భాగం నుండి విషం బయటకు కరి, కొద్ది సమయానికి బాబు లేచి కూర్చున్నాడు. అక్కడ ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఆనందంతో ఆ ముసలమ్మను వెంటబెట్టుకొని మేళ తాళాలతో స్వామి వారి వద్దకు వచ్చి ఆయనను ఘనంగా గ్రామంలోకి తీసుకోని వెళ్లి ఆశ్రయం ఏర్పాటు చేసినారు. ( ఈ విషయం అవ్వగారి శేషగిరి గారు మూడు సంవత్సరాల క్రితం నాతో చెప్పినారు.) కొంత కాలం గడిచిన పిమ్మట శ్రీ స్వామి వారు ఆశ్రమం నిర్మించాలని ఆలోచన తలపెట్టగా భక్తులు 20 ఎడ్ల బండ్లను కట్టుకొని రాయి కొరకు సమీప ప్రాంతంలోని కొండల వద్దకు వెళ్ళినారు. వారి వెంట స్వామి వారు కూడా ఉన్నారు. వారు అందరు బండ్ల నిండా రాయి ఎత్తుకొని తిరిగి వచ్చేటప్పుడు వచ్చే దారిలో పెద్ద వాగూ అడ్డు వచ్చింది.(పై ప్రాంతం లో వర్షం కురియుట వలన తాత్కాలికంగా ఏర్పడిన ప్రవాహం). ఉధృతంగా ప్రవహిస్తున్న్ వాగును భక్తులు బండ్లను అపివేయగా వెనుక బండి వద్దనున్న స్వామివారు ముందుకు వచ్చి విషయం తెలుసుకోగా వాగు ఇంత ఇదిగా పారుతుంటే ఎలా వెళ్ళడం అని ప్రశ్నించారు.అప్పుడు స్వామివారు "మీరు అధైర్య పడకండి, నేను ముందు వాగులోకి వెళతాను , నా వెనుకనే మీరు రండి, కాని అందరు ఒడ్డు చేరే వరకు ఎవరు వెనుదిరిగి చూడరాదని " చెప్పి వాగులోకి దిగగా వాగూ రెండుగా చిలి వారందరికి దారి ఇచ్చింది. అందరు క్షేమంగా ఒడ్డు చేరుకున్నారు. శ్రీ వారు ఆశ్రమం నిర్మించుకున్న తర్వాత అనేక మంది భక్తులు వచ్చి, ఆయనను సేవించుకుంటూ ఉండేవారు .ఆ కాలం లో సమీప గ్రామంలో కాలంలో ఒక మోతుబరి rసంతానం లేక అల్లడుచున్ స్వామి న్నాడు స్వామి వారి గురించి విని దర్శించుకొని స్వామి వారి సేవ వారికీ. సంతానం ప్రప్తించినది ఈ విధముగా. ఈ విధముగా కోవేలకుంట తాలూకా పరిసర ప్రాంతములో స్వామి వారు ఏంటో ప్రసిద్ది వాగులోకి. ఉండేవారు వారు జీవ సమాధి సమీప ఆలోచనతో గుంతిపాపల గ్రామంలోని తన ఆశ్రమంలో సమాధి నిర్మిమ్చుకోగా, ఆయన తల్లి వెంకట లక్ష్మమ్మ గారు తనకు కొద సమాధి నిర్మించమని కోరింది. ఆమెకు కూదా సమాధి నిర్మించి , అక్కడే సమాధి చేసారు. ఈయన సమాధి పొందే సమయానికి, ఆయన గురువుగారు శ్రీ నాసిర్ మొహమ్మద్ గారు పిలిపించి తనతో పాటు శ్రిత్రిపురంతకంలో జీవ సమాధి పొందమని ఆజ్ఞాపించారు. గురువు గారి ఆజ్ఞ మేరకు 1895-1904 మద్య కాలంలో ఒక కార్తీక కార్తీక మాసం బహుళ పంచమి నాడు స్వామి వారు జీవ సమాధి పొందారు. నిస్తతో భగవంతుని ధ్యానం చేసే ఎలాంటి యోగుల గురించి తెలుసుకోవటానికి , "ఒక యోగి ఆత్మ కథ " పుస్తకం లో మరిన్ని వివరాలు కలవు. శ్రీ మేకల స్వామి వారు సమాధి చెందేతప్పటి వయస్సు సుమారు 90 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. అయన పేరు మీద గుంటిపాపల గ్రామంలో ఐదు ఎకరాల భూమి, 75 సెంట్ల స్థలాన్ని ఆ గ్రామస్తులు 1894, 1903, 1904 సంవత్సరాలలో రిజిస్ట్రేషన్ చేసిన వొరిజినల్ డాక్యుమెంట్లు (8 అణాలు , 8 అణాలు , 1 రూపాయి ) నేను చూసాను . దీనిని బట్టి ఆయన 1810-20 సంవత్సరాల మద్య కాలంలో జన్మించి ఉంటాడని అంచనాకు వచ్చాను. శ్రీ స్వామి వారి గురించి నాకు సమాచారం ఇచ్చినది అయన ముని మనవడు జెట్టి ఆంజనేయులు గారు. అంటే కాదు సుమారు 4 సంవత్సరాల క్రితం కీ.సే. నల్లమోతు శేషగిరి రావు గారు ( కుమ్మరి సైదులు) కుమ్మరి సైదులు నాటో ఆత్యాద్మిక విషయాలు ముచ్చటిస్తూ మేకల స్వామి వారి గురించి చెప్పారు. ఆయన గుంటిపాపల ఆశ్రమాన్ని, స్వామి వారి సమాధిని దర్శించి వారి గురించి పరిచయమున్న కొద్దిమందితో మాట్లాడానని తెలిపారు. నేను మీకు తెలిపిన ప్రతి ఆక్షరము సత్యమని నమ్ముతూ , ఎందఱో మహనీయులు నడిచిన గడ్డమీద జన్మించినందుకు మీకు, ఉంటున్నందుకు నాకు, తెలుసుకుంటున్న అందరికి అభి నందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
కుమ్మరి సైదులు : కర్నూలు జిల్లా , యాగంటి కొండలు.
మనము ఇంతకూ మునుపు తెలుసుకున్న మేకల స్వామి వారికీ సంతానం లేకపోవుటచే తమ్ముడి కొడుకైన కోటయ్యను పెంచుకున్నారు. ఆయనకు ముగ్గురు ఆడ పిల్లలు. వారిలో ఒకరి కుమారుడు కుమ్మరి సైదులు .ఆయన తన బాల్యాన్ని నాదెండ్ల గ్రామంలోనే గడిపినాడు. ఆయనతో కలసి తిరిగిన వారు గ్రామంలో ఇప్పటికీ చాల మంది ఉన్నారు. మేకల స్వామి వలె గురూపదేసం పొంది, గురువు వద్ద సాధన చేసి గురువు అనుమతి లేకుండా శక్తులు ప్రదర్శించి, గురువు గారి ఆగ్రహానికి గురై దుర్మరణం పాలైన వ్యక్తి కుమ్మరి సైదులు గారు. వారి గురించి తెలుసుకుందాం.
కుమ్మరి సైదులు గారు మేకల స్వామి వారి ఆశ్రమంలో గడుపుతూ స్వామి వారి రుద్రాక్షమాలను ధరించేవారు. ఆయన కర్నూలు జిల్లా లోని యాగంటి కొండలలో ఒక గురువు గారి వద్ద దీక్ష తీసుకున్నారు. కొంత కలం పటు గురువు వద్ద సేవ చేసినారు. పూర్వ జన్మ సుకృతం వల్ల, గురుకృప వలన వీరికి కొన్ని శక్తులు త్వరగానే అబ్బినవి. ఒక నాడు గురువు గారి అనుమతి లేకనే నాదెండ్ల గ్రామానికి వచ్చినాడు. గ్రామంలో తన ఇంటిలో కొంత కాలము బస చేసినాడు. ఈ సమయంలో గ్రామంలోని తన మిత్రుల వద్ద శక్తులు ప్రదర్శించారు . గ్రామంలోని ఒక వ్యక్తి కి సంతానం లేక పోవుటచే సైదులు గారిని ఆశ్రయించగా , తను ధరించిన రుద్రాక్షమాలలో ఒక రుద్రాక్షను తీసి మంత్రించి ఇవ్వగా ఆయనకు సంతానం ప్రాప్తించినది.
మరల తన గురువు గారి పిలుపు మేరకు యాగంటి కొండలకు వెళ్ళినాడు. తన అనుమతి లేకనే శక్తులు ప్రదర్సిన్చినదని తెలుసుకున్న గురువు గారు తీవ్ర ఆగ్రహం చెంది, తన శిష్యులచే ఆయనను దండించి, భ్రష్టుడవు కమ్మని శపించారు. గురు శాపం, తిరస్కారం పొందిన అయన వికల మనస్కుడై గాయాలతో ఏదో విధంగా గుంటిపాపల లో ఉన్న మేకల స్వామి వారి ఆశ్రమాన్ని చేరుకొని తన వారికి కబురు చేసాడు. నాదెండ్ల నుండి వారి బంధువులు వెళ్ళగా జరిగిన విషయం తెలిపి మరణించినారు. ఆయనను మఠం బయట సమాధి చేసినారు.
కుమ్మరి సైదులు గారి సిద్దులను ప్రత్యక్షంగా చుసిన వ్యక్తి కీ.శే. నల్లమోతు శేషగిరి గారు ( అవ్వాగారి శేషగిరి). అయన నాకు చెప్పిన విషయాన్నీ యధాతథంగా మీకు తెలియచేస్తున్నాను. తన మిత్రుడు సైదులు వచ్చారని తెలుసుకొని సాయంత్రం పూట వాళ్ళింటికి వెళ్ళగా బయలుకు పోదామని చెంబు తీసుకోని శేషగిరి గారి చేయి పట్టుకున్నారు. కళ్ళు ముసి కళ్ళు తెరిచే సరికి చలం కొండల్లో ఉన్నారు.కొద్ది సేపు పిచ్చాపాటి మాట్లాడుకొని అదేవిధం గా ఇంటికి వచ్చినారు. కొన్ని రోజుల తర్వాత రాత్రిపూట శేషగిరి గారిని పిలిపించినారు. సైదులు గారు శేషగిరి గారి చేయి పట్టుకోగా క్షణకాలం లో తూబాడు వెళ్ళే డొంక వద్ద ఉన్నారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తనకు గురువుగారి పిలుపు అందినదనీ, వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైనాడు.ఆ తర్వాత సైదులు గారు మరణించినారని శేషగిరి గారు చెప్పినారు.
శేషగిరి గారు ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్న వ్యక్తి. ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్న చాలామంది గురువులను, సాదు పుంగవులను కలుసుకొని, వారి ఆశీర్వాదం పొందియున్నారు. అందుకే ఆయన మాటలను ప్రామాణికంగా భావిస్తున్నాను.

Subscribe to:
Posts (Atom)