ధరణికోట (అమరావతి) జమిందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయన సోదరికి వివాహము జరిపించి అత్తవారింటికి పంపించుచుండగా మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో 'చెంచులు' అనే కొండ జాతికి చెందిన కొందరు ఆమెను చెరపట్టి చంపివేసినారు. భటుల ద్వారా విషయాన్ని తెలుసుకొన్న రాజావారు ఆవేశంతో చెంచు జాతిని నిర్మూలించాలనే తలంపుతో ధరణికోటయందు అన్నదానం జరుపుతామని ప్రకటించగా అన్నం కొరకు ఆశ పడి సమీప అటవీ ప్రాంతంలో నివసించే వందలమంది చెంచులు అక్కడకు రాగా, వారందరినీ చంపించినాడు.
వారి హత్య వలన కర్మ పాపం చుట్టుకొని రాజ వారికి ఆహరం సహించరానిదై అన్నం పురుగులలాగా కనిపించసాగినది. ఆ పాపం పోగొట్టుకొనుటకు గాను అన్నదానం జరిపించుట, శివాలయాలు నిర్మించుట, దేవాలయాలకు మాన్యాలు ఇచ్చుట, నదీస్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించుట, బ్రాహ్మణ వటువులకు యగ్నోపవీతాలు ఏర్పాటుచేయుట, బ్రాహ్మణ కన్యలకు వివాహాలు జరుపుట మొదలైన పుణ్య కార్యాలు జరిపించినాడు. ఎన్ని పుణ్య కార్యాలు జరిపినా కర్మరహితం కాలేదు. ఈ విధంగా కొన్ని సంవత్సరములు జరిగిపొయినాయి.
ఆ కాలంలో జమిందారు గారి ఆస్థానానికి వచ్చిన ఒక సాధుపుంగవుడు, ఆయనతో ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా కర్మరహితం చేసుకోమని మార్గం చూపించాడు. అంతటి గొప్ప మహనీయుడు శ్రీరామ భక్తుడు , ఆంజనేయస్వామి ఉపాసకుడు శ్రీత్రిపురాంతకం అనే గ్రామంలో శివాలయానికి తూర్పున ఆశ్రమం నిర్మించుకొన్న శ్రీ నాసర్ మొహమ్మద్ అన్న విషయం తెలుసుకొని రాజావారు వారిని సగౌరవంగా పిలిపించుకొన్నారు. వారి ద్వారా మంత్రోపదేశం పొంది కర్మవిముక్తులు కావాలని అనుకొన్నారు.
ఒక మహమ్మదీయ గురువు వద్ద రాజావారు మంత్రోపదేశం పొందటం నచ్చని ఆస్థాన బ్రాహ్మణ గురువులు రాణి వారిని ఆశ్రయించి, రాజావారు గురువుగారిని కలవనియకుండా చేయాలనీ ఆమెకు చెప్పారు. రాజావారు మంత్రోపదేశం కొరకు గురువుగారిని దర్సిన్చుకోనబోయే సమయానికి రానివారు రాజావారి వద్దకు వచ్చి, తను బహిష్టునైయున్నానని చెప్పగా హతాశుడైన ఆయన నా జన్మకు ఈ కర్మ తప్పదని విలపిస్తూ ప్రాణాలు వదిలారు.
శ్రీ నాసర్ మొహమ్మద్ గారు ధరనికోటలో కోటలో ఉండగా ఆయనకు సేవలు చేయుటకు రాజగ్నతో అమర్య అనే సిపాయి నియమించబడ్డాడు. రాజావారి మరణంతో శ్రీ నాసర్ మొహమ్మద్ గారు తిరిగి వెళుచుండగా ఆయన సేవకునిగా నియమించబడిన అమరయ్యగారు కూడా వారి వెంట వెళ్లారు. అనంతర కాలంలో మంత్రోపదేశం పొందిన అమరయ్య గారు పన్నెండు సంవత్సరములు గురు సేవ చేస్తూ అక్కడే నివసించారు. తదుపరి గురుభక్తి యందు పరిపూర్ణుడైన తన శిష్యుడైన అమరయ్యను చూసి శ్రీ నాసర్ మొహమ్మద్ గారు "అమరయ్యా! నివు నా వద్దకు వచ్చి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నావు. నివు ప్రజలలో భక్తీ ప్రచారం చేసి జాగరణ రహితమైన విధానాన్ని నిన్ను నమ్మిన భక్తులకు ఉపదేశించు. సమస్త మానవాళికి భక్తీ, జ్ఞానము, వైరాగ్యము అనే విధాలు బోధించు. భవిష్యత్తులో గుంటూరు మండలం నాదెండ్ల గ్రామంలోని ముచికుంద పర్వత సమీపాన ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అందునుండి అనేక జనావళికి మోక్ష మార్గం చూపి తదుపరి జీవైక్య సిద్ది పొందమని ఆశీర్వదించారు.
అనంతర కాలంలో అమరయ్య గారు శ్రీశైలం నందు ఉండగా వారిని దర్శించుకొని వారి బోధనలు విన్న నాదెండ్ల గ్రామా పెద్దలు, అమరయ్య గారిని తమ గ్రామమునకు ఆహ్వానించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. వీరు అనేక మందికి పరః బ్రర్హా తత్వ ఉపదేసమును బోధించుచు సన్మార్గ ప్రవుత్తులుగా చేసారు. తదుపరి కొన్ని సంవత్సరముల తరువాత సివజీవైక్య సిద్ది పొందుటకు గురుపద రేణువులను తన కుమారునికి గురుపీతదిపత్యం ఏర్పాటు చేసి తాను భక్తులు, శిష్యులచే సజీవ సమాధి ఏర్పాటు చేసుకొని పూజాది ద్రవ్యములతో జీవసమాధి సిద్ధిని పొందారు.
గురుపద రేణువుల గురించి ఒక మాట:
అమరయ్య గారికి పుట్టుకతో చూపులేని ఒక మగబిడ్డ జన్మించారు. అంతటా అమరయ్య గారు ఆ పసిబాలుని తీసుకోని భార్యతో సహా గురువు ఆశ్రమమునకు వెళ్లి దీవెనలు పొందిరి. గురువు గారి పదముల వద్ద ఉంచగా వారి పద స్పర్శతో నేత్రములు పుష్పములవలె విచ్చుకున్నాయి. గురు పాద స్పర్స చే చూపు వచ్చినది కనుక ఆ బిడ్డకు గురుపాద రేణువు అని పేరు పెట్టుకున్నారు.
ఆ తరువాత కాలంలో గురుపాదరేనువులు ఆశ్రమాన్ని అభివృద్ధి చేయుచు అనేక మంది భక్తులకు బ్రహ్మోపదేసం చేస్తూ యాభై సంవత్సరాలు జీవించారు . వారికి లేకపోవుటవలనe సత్తెనపల్లి తాలూకా కందులవారి పాలెం గ్రామానికి చెందినా తన శిష్యుడైన బూతుకూరి గురవారెడ్డి గారికి గురుపీథాన్ని అప్పగించి వారలు సిద్ది పొందారు.
బూతుకూరి గురవారెడ్డి గారు ' ఎరుక నిరసన అనే తత్వ గ్రంధాన్ని రచించి తన గురువుగారి అపర మహిమను భక్త కోటికి ఉపదేశ మార్గంగా అవిష్కరించిరి. వారును యాభై సంవత్సరాలు జీవించి చీయుచు సంపూర్ణముగా నిర్మించి వారును సిద్ది పొందిరి. గురవా రెడ్డి గారికి ముగ్గురు కుమారులు కలరు . వారు నాసర్ బ్రహ్మం, అమరయ్య, పాదరేణువు . గురవా రెడ్డి గారు నాసర్ బ్రహ్మం గారికి మఠాధిపత్యం అప్పగించిరి. నాసర్ బ్రహ్మం గారి కాలంలో మఠాన్ని మిద్దె గాను, చుట్టూ ప్రహరీ గోడను నిర్మించిరి.
వారికి సంతానం లేకపోవటంతో తన తమ్ముని కుమారుడైన నారాయణ రెడ్డి గారిని దత్తు తీసుకోని వారికి పిఠాధిపత్యం అప్పగించి వారు నిర్యాణం పొందిరి. ప్రస్తుతం పీఠాధిపతిగా నారాయణ రెడ్డి గారు ఉన్నారు. పాత మిద్దె సిదిలావస్థ కు చేరుకోవటం తో గ్రామ పెద్దలు, భక్తులు జిల్లా పరిషత్ వారి సహకారం తో మఠాన్ని నూతనంగా నిర్మించినారు.
ఈ మఠముa నందు బ్రహ్మోత్సవాలు ప్రతి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం జరుగును. ఆనాడు అమర గురు ఆరాధన, గంధము, జెండాలు , పీఠం గ్రామంలో ఊరేగింపు జరుగును. ప్రతి సోమవారము, మరియు శుక్రవారము ఆధ్యాత్మిక భజనలు జరుగును.
No comments:
Post a Comment