Thursday, July 15, 2010

శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానము, శంభునిపాలెం



















శంభునిపాలెం నందు పురాతన కాలంలోనే స్థానికులు పూజలు, భజనలు చేసుకొనుటకు తమ ఆవాస ప్రాంతంనందు ఒక శ్రీరామ మందిరమును ఏర్పాటు చేసుకొన్నారు. ఈ మందిరము నందు మట్టితో చేసిన సీతా,లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ స్వామి వారి విగ్రహములను ప్రతిష్టించి పూజలు, భజనలు నిర్వహించేవారు.






మందిరమునకు , ఆలయమునకు చిన్న బేధము కలదు. మందిరము నందు భజనలు చేయుట , సత్సంగము చేయుట మాత్రమే చేయుదురు. మందిరములో చెక్క లేదా మట్టితో చేసిన విగ్రహములు ఏర్పాటు చేసుకొని, ఆయా పుణ్య దినములలో దేవుని ఆరాధింతురు. ఆలయమునందు ఆగమ శాస్త్రం ప్రకారం శిలా విగ్రహములు ప్రతిష్టించి శాస్త్రోక్తముగా పూజలు జరుపుదురు.







శంభునిపాలెం నందు స్థానికులు శ్రీ రామ మందిర స్థానంలో కొత్తగా శ్రీ కోదండ రామ స్వామి వారి దేవస్థానము నిర్మించాలని సంకల్పించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు.



ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నాదెండ్ల గ్రామ శ్రీ సీతారామస్వామి దేవస్థాన వంశ పారంపరి ధర్మకర్త శ్రీ పండా వెంకటప్పయ్య గారి పర్యవేక్షణలో ఆలయమును నిర్మించి ది.18-2-2007 నుండి 22-2-2007 వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ కార్యక్రమాలను నిర్వహించి ది.22-2-2007 ఉదయం 12.07 గం. అనగా స్వస్తి శ్రీ చాంద్ర మానేన శ్రీ వ్యయ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి గురువారం, అశ్వని నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరంశామునందు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన గావించినారు.

ఆ రోజు మొదలు ప్రతి శనివారము మరియు వివిధ పర్వదినములయండు స్థానికులచే భజనలు, పూజలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి వార్శికోత్సవమునాడు స్వామి వారికి శాస్త్రోక్తంగా వివిధ కార్యక్రమములు నిర్వహించి అన్నదానం జరుపుతున్నారు.


ఈ వివరములు అందించిన వారు కమిటి తరుపున నెల్లూరి శేఖర్ , మరియు తేలప్రోలు వెంకటరావు గార్లు .







ఉత్సవ విగ్రహములు

No comments:

Post a Comment