- నవరాత్రి ఉత్సవాలు: ప్రతి సంవత్సరం విజయ దశమి పండుగ సందర్భంగా నవరాత్రులను, గర్భ గుడిలోని అమ్మవారికీ, బాల త్రిపుర సుందరి అమ్మవారికీ ఘనంగా నిర్వహిస్తారు. విజయదసామీ నాడు స్వామి వారి పార్వేట ఉత్సవం నిర్వహించబడును.
- కార్తీక పౌర్ణమి : కార్తీక మాసమందు ప్రతి రోజు స్వామి వారికి అభిషేకాలు జరుపుతారు. కార్తీక పౌర్ణమి నాడు అఖండాలు స్వామి వారికి సమర్పిస్తారు.
- ఆరుద్రోత్సవాలు( శివ ముక్కోటి): ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం నుండి 5 రోజులపాటు ద్వార దర్శనము, గ్రమోత్సవము, అధ్యయన ఉత్సవాలు జరుగును.
- ధనుర్మాసంలో స్వామి వారిని ప్రతి రోజు పల్లకిలో ఊరేగిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వైభవంగా జరుగుతాయి. స్వామి వారిని బండి పై అలంకరించి భక్తులు స్వయంగా లాగుతారు.
- మహా శివరాత్రి: కార్తీక పౌర్ణమి నాడు అఖండము చేల్లించుకొనుటకు వీలు పడని భక్తులు మహా శివరాత్రి నాడు చెల్లించుకుంటారు.
- స్వామి వారి రధోత్సవము: వైశాఖ చతుర్దశి నాడు స్వామి వారి కళ్యాణం జరుగును. పౌర్ణమి నాడు రధోత్సవం జరుగును. రధోత్సవం నాడు శివాలయమునకు ఎదురుగ ఉన్న రధశాల లోని రధమును బయటకు తీసి వినాయకుని గుడి కి వెళ్ళే దారి వైపు ఉంచుతారు. స్వామి వారిని రధం పై అలంకరించి రధమును భక్తులందరూ లాగుతారు. రధం లాగుటకు పెద్ద పెద్ద గొలుసులు ఉపయోగిస్తారు. వీటిని మద్రాసు నుండి తెప్పించారని పెద్దలు చెబుతారు. పూర్వ కలం లో రధమును వినాయకుని గుడి వరకు తీసుకు వెళ్ళే వారు. కానీ నేటి కాలంలో అది సాధ్య పడక స్వామి వారి వసంతోత్సవమును వినాయకుని గుడి వద్ద జరుపుతున్నారు.
- ఆలయ ప్రత్యేకత: నిత్య బిందె తీర్ధము, త్రికాలార్చన, సందె మేళము, అఖండ దీపారాధన, సాయంకాల భజన, సంవత్సరం పొడవునా నిర్వహించ బడతాయి.
Saturday, April 30, 2011
శివాలయం నందు జరుపబడే ముఖ్య ఉత్సవాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment