ఈ వారం విశేషాలు: నాగార్జున సాగర్ నీరు నాదెండ్ల పంట కాలువలకు చేరింది. 12-08-2011 న వరలక్ష్మి వ్రతం ను జరుపుకున్నారు. 13-08-11 రక్షా బంధనం వేడుక జరిగింది. గ్రామంలోని సోదరి మణులు, తమ సోదరు లకు రక్షా బంధనం కట్టి, హారతి ఇచ్చి, మిఠాయి తినిపించి, కానుకలు అందుకున్నారు.15-08-2011 న గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకావిష్కరణ జరిగింది.
పోస్టింగ్ కోసం సమాచారం క్రోడీకరించే పద్దతి :
ఒక అంశం గురించి వివిధ కోణాలలో పలువురి వద్ద సమాచారం సేకరించి, వాటిలో వాస్తవానికి దగ్గరగా ఉన్న వాటిని, విషయ పవిత్రతకు భంగం కలిగించని వాటిని పొందుపరిచి పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీని కొరకు ప్రముఖ చరిత్ర గ్రంధాల రెఫరెన్సు తీసుకోవటం జరిగింది. ఆర్కియాలజీ వారి అభిప్రయలను కూడా తీసుకోవటం జరిగింది. ఒక అంశం గురించి పోస్టింగ్ ఇవ్వటానికి దానిలో వాడె భాష గురించి సుదీర్ఘమైన చర్చలు, నాలుగైదు చిత్తూ ప్రతులు తాయారు చేసే వాళ్ళం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందించటానికి ప్రయత్నిస్తున్నాము.
పోస్టింగ్ ఇవ్వటానికి సహకారం
ఈ విషయం లో భారమంతా శ్రీనివాసరావు గారే మోసారు. బ్లాగ్ మొదలుపెట్టిన తర్వాత అన్నీ పరిక్షలే. అప్పటివరకు అందుబాటులో ఉన్న సిస్టం, నెట్, కెమేర లభించలేదు. నేను బంధువుల వద్ద నున్న డిజిటల్ కెమేర తెప్పించాను. దానిలోని బ్యాటరీలు స్నేహితుని వద్దనుండి సేకరించాను. శ్రీనివాసరావు తనకు తెలిసిన నెట్ సెంటర్ కు వెళ్ళేవాడు. నెట్ రాత్రి 9.30 వరకు బిజీ గాను, స్లో గాను ఉండేది. ఆ తర్వాత నెట్ సెంటర్ లో కూర్చొని ఫోటోలు అప్లోడ్ చెయ్యటం, మాటర్ టైపు చెయ్యటం చేసేవారు. బ్లాగ్ ఇనాగరేషన్ ముందు రోజు మొత్తం రెడీ చేసుకోవటానికి నెట్ సెంటర్ లో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూర్చున్నాము. ఈ విషయంలో కళామందిర్ సెంటరులో ఉన్న సిటీ ఇంటర్నెట్ వారికి మా కృతఙ్ఞతలు. బ్లాగ్ ని కూడలి, హారం వంటి సైట్స్ లో లిస్టు చెయ్యటానికి, స్కాన్స్ చేసుకోవటానికి, పోస్టింగ్స్ చెయ్యటం లో మాకు సహకరిస్తున్న శ్రీ వాసిమళ్ళ అజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు.(www. chilakaluripet1.blogspot.com). modern stellar school, NRT సెంటర్,స్కూల్ లో ఉన్న సిస్టం నుండి పోస్టింగ్స్ ఇవ్వటానికి అనుమతి నిచ్చిన మహేష్, మస్తాన్ రావు గార్లకు, సహకరించిన lab coordinator శ్రీ అజయ్ కి మా ధన్యవాదములు. తన మోడెం ఇచ్చి మాకు సహకరించిన కేరళ టీచర్ శ్రీ డెబిన్ (stellar school) గారికి మా కృతఙ్ఞతలు. మన గ్రామానికి చెందిన Dr. స్వామి గారి ఇంటి నుండి, శ్రీ కొడిమెల కోటేశ్వరరావు (సినిమా హాల్ సెంటర్) మాస్టర్ గారి ఇంటినుండి పోస్టింగ్స్ ఇచ్చాము. వారికి మా ధన్యవాదములు. మాకు కొన్ని పోస్టింగ్స్ కోసం సమాచారాన్ని తెలుగు లో టైపు చేసి ప్రింట్ తీసి సహాయం చేసిన మా శ్రేయోభిలాషి శ్రీ బి. శ్రీనివాసరావు (తెలుగు టీచర్)గారికి మా ధన్యవాదములు.
ఈ ప్రయత్నంలో మేము చేసే పనిలో పాలు పంచుకోవటానికి గ్రామానికి చెందిన ఔత్సాహికులు చేకూరి అమరేంద్ర, వల్లభనేని అమరేంద్ర ముందుకు వచ్చి కొన్ని పోస్టింగ్స్ ఇచ్చారు. వారికి మా ధన్యవాదములు. తనకు వీలైనప్పుడల్లా ఫోటోలు తీసి మాకు సహకరిస్తున్న దగ్గుబాటి శేఖర్ కు మా ధన్యవాదములు. మాకు సహకరించిన వేములపల్లి శ్రీకాంత్ M.Tech, గోరంట్ల పూర్ణయ్య లకు మా ధన్యవాదములు.
to be continued....
No comments:
Post a Comment