గత 29-10-12 న గుంటూరు జిల్లా లో స్వల్పంగా భూమి కంపించింది . పల్నాడు ప్రాంతం లోను, గుంటూరు డివిజన్ ప్రాంతం లోను ఈ భూకంపం ప్రభావం కనిపించింది. అయితే ఇది ప్రమాదరహితమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పల్నాడు ప్రాంతాలలో కొన్ని చోట్ల ( వినుకొండ, గురజాల మొ .) 3నుండి 5 సెకన్ల పాటు సంభవించిన ఈ భూకంపం వలన పెద్ద పెద్ద శబ్దాలు రావడం, అక్కడక్కడ నేల పగుళ్ళు ఇవ్వటం జరిగినట్లు తెలిసింది. కొన్ని పాత భవనాలు బీటలు వారినట్లు సమాచారం. చిలకలూరిపేట, నాదెండ్ల ప్రాంతాలలో కూడా స్వల్పంగా 1 నుండి 2 సెకనుల లోపే భూమి కంపించడాన్ని ప్రజలు గమనించారు. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగలేదు. నాకు మొదటిసారి భూకంపం అనుభవం లోకి వచ్చింది. ఒక ఉపాధ్యాయునిగా భూకంపం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్ధులకు వివరించాను
No comments:
Post a Comment