Monday, November 12, 2012

నాదెండ్ల ను పట్టి పీడిస్తున్న వైరల్ ఫీవర్లు - వైద్య శిబిరాల ఏర్పాటు

నాదెండ్ల గ్రామంలో ఈ వర్షాకాలం సీజన్ లో వైరల్ ఫీవర్లతో ప్రజలు అల్లాడుతున్నారు. జ్వరం అంటే భయంతో డాక్టర్ దగ్గరకు పరుగెత్తే పరిస్థితి. ప్లేట్ లెట్  కౌంట్ కోసం పరిక్షలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇంటికి కనీసం ఒకరితో మొదలుకొని మొత్తం ఇంటిల్లిపాది జ్వరాలతో అవస్థలు పడిన వారున్నారు. ముఖ్యం గా  అంబేద్కర్ నగర్, చైతన్య నగర్,  రాజీవ్ కాలనీలలో  పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారు శిబిరాలు ఏర్పాటు చేసి 
వైద్యం చేస్తున్నారు. 


 రాజీవ్ కాలనీ (చిన్న మాలపల్లి) లోచికిత్స పొందుతున్న వ్యాధి పీడితులు .



 


నాదెండ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది  
   ఈ వైరల్ ఫీవర్  బారిన పడుతున్న వారు జ్వరం తో పటు, చికెన్ గన్యా  లక్షణాలైన కీళ్ళ నొప్పులతో బాధపడుతు న్నారు. తిరిగి కోలుకోవటానికి చాల సమయం పడుతున్నది. పారిశుధ్య లోపం, దోమలు, కలుషిత నీరు ఈ జ్వరాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

No comments:

Post a Comment