శ్రీమతి ఇందిరా గాంధీ భారత ప్రధానిగా ఉన్న కాలంలో అన్నాప్రగడ అధ్యక్షులుగా అఖిల భారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘాన్ని స్థాపించి, దానికి అధ్యక్షత వహించారు. ఈ సంఘ సమావేశం 1964 అక్టోబర్ 8 నుండి 10 వరకు డెహ్రాడున్ లో జరిపారు. ఈ మహా సభల అనంతరం, ఇందిరా గాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన సమర యోధులకు నెలవారీ పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు, ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేకించి పూణే నగరంలో అన్నాప్రగడ కామేశ్వర రావు గారికి ఇల్లు కూడా కట్టించి పెట్టారు.
శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్య మంత్రి గా ఉన్న కాలంలో అన్నాప్రగడ కామేశ్వరరావు గారిని పిలిపించి గుంటూరు నగరం లో అఖిల భారత విప్లవ కారుల సభ జరిపించమని కోరారు. అందుకు కావలసిన నిధులు తామే సమకూరుస్తామని హామీ ఇచ్చారు. స్వర్గీయ భగత్ సింగ్ తల్లి గారైన విద్యావతి గారి అధ్యక్షతన జరగవలసిన ఆ సభ బ్రహ్మానంద రెడ్డి గారు నిధులు సమకూరుస్తామని ఇచ్చిన వాగ్దాన భంగం కారణంగా జరగలేదు.
1985 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అన్నాప్రగడ కామేశ్వరరావు ను ఘనంగా సత్కరించినది. కొద్ది రోజుల తరువాత కాలికి ఎదురు రాయి పొడుచుకొని బలమైన గాయం అయినది. షుగర్ పేషెంట్ కావటంతో ఆ గాయం మానలేదు. గాంగ్రిన్ సోకింది. 1987 జనవరి 30 వ తేదిన ఆయన స్వర్గస్తులైనారు. పూనేలో ఆయన అంత్య క్రియలు ముగిసాయి. ఆయన అంత్య క్రియలకు కుటుంబ సుభ్యుల దగ్గర సొమ్ము లేక, ఇంటిలోని పాత కలపను అమ్మి వచ్చిన సొమ్ముతో ఆ తంతు నిర్వహించారు.
2002 వ సంవత్సరంలో దేశవ్యాప్తం గా జరిగిన అన్నాప్రగడ కామేశ్వర రావు గారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా నరసరావు పేట లో గూడా సభ ఘనంగా జరిగినది.
ఈ విధం గా తన జీవిత సర్వస్వాన్ని భారత మాట దాస్య శృంఖలాలు విడిపించడానికి కృషి చేసిన మహనీయుడు మన గ్రామంలో జన్మించినందుకు ఆనంద పడుతూ, వారి జీవిత చరిత్రను మీ అందరికి పరిచయం చేసే అదృష్టం కలిగినందుకు గర్విస్తూ... జై హింద్!
Sunday, October 31, 2010
Saturday, October 30, 2010
Wednesday, October 27, 2010
అట్లతద్దె - 25-10-10
అట్లతద్దోయ్ ఆరట్లోయ్
ముద్ద పప్పూ మూడట్లోయ్
పడకల కింద పిడికెడు బియ్యం
పిల్లలారా! జెల్లలారా! లేచిరండోయ్!!
ముద్ద పప్పూ మూడట్లోయ్
పడకల కింద పిడికెడు బియ్యం
పిల్లలారా! జెల్లలారా! లేచిరండోయ్!!
హిందూ సాంప్రదాయ పండుగలు, వ్రతాలు వివరించే గ్రంధాలు ధర్మ సింధువు , నిర్ణయ సింధువు. ఈ గ్రంధాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో బహుళ పక్ష తదియను అట్ల తద్దె గా జరుపుకోవాలి. అట్లతద్దె కు శాస్త్రీయ నామం చంద్రోదయ ఉమా వ్రతం. ఈ వ్రతాన్ని కన్యలు, కొత్తగా పెళ్ళైన స్త్రీలు జరుపుకొంటారు. కన్యలు తమకు మంచి భర్త రావాలని, పెళ్ళయిన వారు తమ ఐదవ తనం క్షేమంగా ఉండాలని చేస్తారు.
ఈ వ్రతం ఆచరించేవారు తెల్లవారు జామునే లేచి అభ్యంగన స్నానం చేసి పెరుగన్నం తింటారు. తెల్లవారు జామున చిన్న పిల్లలను కూడా లేపి తలస్నానం చేయించి పెరుగన్నం పెడతారు. ఈ రోజు తెల్లవారు జాములో పెరుగన్నం తినకపోతే ముసలి మొగుడు, ముసలి పెళ్ళాం వస్తారని హాస్య మాడతారు. తర్వాత వేళ్ళకు గోరింటాకు పెట్టుకొంటారు. గవ్వల ఆటలు ఆడతారు. ఊయల ఊగుతారు. పగలంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రోదయం కాగానే చంద్రునికి, గౌరీ దేవికి పూజ చేస్తారు.పూజ అనంతరం ఏడుగురికి వాయినాలు అందజేస్తారు ( ఐదుగురు తద్దె తీర్చుకున్న ముత్తైదువులు, ఒకరు తీర్చుకోవాల్సిన ముత్తైదువు, ఒక పోతురాజు . పోతురాజు వీరిని ఊయల ఊపాలి).వాయనం అనగా పదకొండు అట్లు ఉంటాయి. అట్లు మందంగా పోయాలి, పలుచగా ఉండరాదు.
వాయనాలు అందించే విధానం:వాయనం ఇచ్చే వారు వాకిలి లోపల ఉంది ఇస్తినమ్మా వాయనం అని చెప్పి వాకిలి
బయట ఉన్న ముత్తయిడు చేతిలో పెడుతుంది. వారు పుచ్చుకొంటినమ్మ వాయనం అని చెప్పి తీసుకుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు మూడు సార్లు చెప్పి వాయనాలు తీసుకుంటారు. వచ్చిన పేరంటాల్లకు వాయనం, తాంబూలం ఇచ్చి భోజనం పెట్టడంతో వ్రతం పూర్తి అవుతుంది.
ధర్మ సింధు, నిర్ణయ సింధు మొదలైన గ్రంధాల ప్రకారం ఈ వ్రతాన్ని వరుసగా ఏడు సంవత్సరాలు ఆచరించాలి. కాలం, తిథి ప్రకారం వచ్చే పండుగలు వ్రతాలూ ఆయా రోజులలోనే చేయాలి. ఈ వ్రతాలను ఆచరించుటలో ఆరోగ్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామున తలస్నానం, పెరుగన్నం తినటం, పగలు ఉపవాసం, సాయంత్రం అట్లు తినడం మొదలయిన క్రియల వలన గర్భ దోషాలు తొలగిపోతాయని కొందరు చెబుతారు.
కాబట్టి ఉండ్రాళ్ళ తద్దె, అట్ల తద్దె మొదలైన వ్రతాలను పెళ్ళైన వెంటనే మొక్కుబడిగా ఆచరించక, శాస్త్రోక్తంగా ఆయా కాలాలలో ఆచరిస్తే మంచిదని పెద్దల అభిప్రాయం.
పై విషయాలను తెలిపిన వారు: శ్రీ కోదండ రామ స్వామి దేవాలయం (వెంకటేశ్వర స్వామి ఆలయం) ధర్మ కర్త, ఆగమ పండితులు శ్రీ పండా వెంకటప్పయ్య గారు.
Sunday, October 24, 2010
కృతఙ్ఞతలు
దసరా ఉత్సవ విశేషాలను అందించుటకు సహాయం చేసిన వారు....
- శ్రీ కొడిమేల కోటేశ్వరరావుగారు, శంబునిపాలెం. కొన్నివిశేషాలను వీరి గృహమునుండి అప్ లోడ్ చేయడంజరిగింది.
- శ్రీ డెబిన్ గారు (కేరళ టీచర్).కొన్నివిశేషాలను వీరి గృహమునుండి అప్ లోడ్ చేయడంజరిగింది. మరియు వీరి USB మోడెంను మాకు ఇచ్చి పోస్టింగ్స్ చేయుటకు సహకరించారు
- పదవ తరగతి విద్యార్ధులైన వేములపల్లి అజయ్, అత్తులూరి శ్రీకాంత్. ఫోటోలు తీయుటలో సహకరించారు.
నాదెండ్ల ఆన్ లైన్ టీం
మన్నె కుమార స్వామి, ఎస్. శ్రీనివాస రావు ,
సి.హెచ్ అమరేంద్ర.
మన్నె కుమార స్వామి, ఎస్. శ్రీనివాస రావు ,
సి.హెచ్ అమరేంద్ర.
పురాతన కాలంలో గ్రామంలో జరిగే దసరా ఉత్సవాలు
గ్రామంలో దాదాపు 50 సం. క్రితం వరకు దసరా పండగ నాడు బేతాళ గట్టు మీద మేకను బలి ఇచ్చి, పొంగలి పొంగించి, సుద్దులు చెప్పేవారు. ప్రస్తుతం అది జరుగుట లేదు. ఆనాటి విశేషాలు, దాని అంతరార్ధం తెలుసుకుందాం.
పూర్వపు రోజులలో బేతాళుడు అనే రాక్షసుడు గ్రామంలో ప్రజలను హింసిస్తూ ఇబ్బందులు పెట్టె వాడు. వాడి నుండి విముక్తి పొందాలని, వాడితో రాజీకి వెళ్లి, నీకు ఏమి కావాలో చెప్పమన్నారు. బేతాళుడు తనకు తాటి అంత పోతు, మేటి అంత ముద్ద కావాలని చెప్పాడు. సరే నీకు కావలసినవి చెల్లిస్తామన్నారు. బేతాళుడు తను అడిగినవి ప్రజలు చెల్లించ లేరనుకున్నాడు . ఎందుకంటే తన దృష్టిలో తాటి అంత పోతు అనగా తాటి చెట్టు అంత పోతు అని, మేటి అంత ముద్ద అనగా మేడ అంత అన్నపు ముద్ద అని.
అప్పటి ప్రజలు యుక్తిగా ఆలోచించి బేతాళుడు దగ్గరకు అతను అడిగినవి తీసుకెళ్ళారు. తాటి అంత మేక అంటే తాడు చివర కట్టిన మేక, మేటి అంత ముద్ద అనగా మేడి చివర పెట్టిన ముద్దను బేతాళునికి సమర్పించారు. బేతాళుడు చేసేది లేక వారు ఇచ్చినది తీసుకోని ఉరుకొన్నాడు. అప్పటినుండి ప్రతి దసరా పండుగ నాడు బేతాళ గట్టు మీద బేతాళునికి ఆ రెండు సమర్పించి వస్తారు.
పండుగ నాడు నిర్వహించే కార్యక్రమం: ఈ తంతు నిర్వహించటం కొన్ని కుటుంబాల వారు వారసత్వంగా చేసేవారు. ముందుగ గ్రామంలో ఆయుధాలు కలిగిన కుటుంబాల వారు తమ ఆయుధాలను శుద్ధి చేసుకోని బేతాళ గట్టు మీదకు తీసుకోని వెళ్ళేవారు. అందరు అక్కడకు చేరిన తర్వాత కొమ్ములోడు బేతాళుని కథ అనగా- కర్రి ఆవులు రాజు యుద్ధం -కథ చెబుతాడు. పొంగలి పొంగిస్తారు. వేటను బలి ఇస్తారు. వేట యాదవులకు, చాకలికి చెందుతుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరి ఆయుధాలు వారు తీసుకొని వెళతారు.
ఈ మొత్తం తంతును గ్రామంలో చిన్న, పెద్ద అందరు కలిసి తిలకిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహించటం దాదాపు 50 సంవత్సరాల క్రితం నిలిపి వేసారు. ఇది ఆనాడు చూసిన వారికి మిగిలి ఉన్న ఒక మధుర జ్ఞాపకం.
ఈ విషయాలు తెలియ జేసినది శ్రీ ఆలా శేషయ్య.
Friday, October 22, 2010
అన్నాప్రగడ కామేశ్వరరావు - 5 వ భాగం
అన్నాప్రగడ 1937 మే నెలలో ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్త పట్నం లో వేసవి రాజకీయ పాఠశాలను నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాలను నిషేధించి వీరిని అరెస్ట్ చేసి జైలుకి పంపినది. జైలు నుండి విడుదలైన తర్వాత రేపల్లె తాలూకాలోని మంతెన వారి పాలెంలో మరో రాజకీయ పాఠశాలను విద్యావనం అనే పేరుతో నిర్వహించారు. వారి పని తనానికి మెచ్చి గ్రామస్తులు 50 ఎకరాల పొలాన్ని పాఠశాలకు రాసి ఇచ్చారు. సుభాష్ చంద్రబోసు ఏలూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా అయన ఎదుట విద్యావనం విద్యార్ధులు ప్రదర్శన నిర్వహించగా ముగ్దుడైన బోస్ ఇలాంటి విద్యా వనాలూ దేశమంతటా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ సిద్దాంతం నచ్చక వారితో తీవ్రంగా విభేదించారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని గుంటూరు వచ్చారు. గుంటూరు రాగా పోలీసులు అదుపులోనికి తీసుకోని నాదెండ్ల లో గృహ నిర్బంధం లో ఉంచారు. అక్కడ నుండి తప్పించుకొని గుంటూరు చేరి "విప్లవ జ్వాల" కరపత్రాలు ప్రజలకు పంచారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు అదుపులోనికి తీసుకోని కడలూరు జైలుకి, తర్వాత తంజావూరు జైలుకి పంపారు. జైలులో ఉండగా తండ్రి రోశయ్య మరణించినా ప్రభుత్వం పే రోలు మంజూరు చేయలేదు.
1946 లో జరిగిన శాసన సభల ఎన్నికలలో గుంటూరు - తెనాలి నియోజక వర్గ శాసన సభ్యునిగా పోటి చేసి అఖండ విజయం సాధించారు. అధికార పక్షపు శాసన సభ్యుడైనప్పటికి మంత్రుల అవినీతి చర్యలపై అసెంబ్లీ లో పోరాడి కాంగ్రెస్ పార్టి అధిష్టాన వర్గ ఆగ్రహానికి గురై పరోక్షంగా పార్టి నుండి వెలివేయబడ్డారు. మంత్రుల అవినీతి చర్యలు బట్ట బయలు చేసేందుకు " అంకుశం" అనే పత్రికను స్థాపించి, జర్నలిజం ద్వార సమాజానికి పహారా కాశారు. అన్నాప్రగడ గారి కృషి వల్లనే గుంటూరు లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించుట జరిగినది.ఆయన కుమారుడు క్రాంతి కుమార్ గోవా విముక్తి పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
అన్నాప్రగడ ఆర్ధిక ఇబ్బందుల వలన, ఇక్కడ ఆదరించే వారు లేక కుటుంబ పోషణ కొరకు పూనాలోని తన మిత్రుని కంపెని " డాన్ మోమైన్స్ " లో ఉద్యోగంలో చేరాడు.

పార్వేట ఉత్సవం
విజయదశమి నాడు జరిగే పార్వేట ఉత్సవ విశేషాలు, దాని అంతరార్ధం తెలుసుకొందాం. విజయదశమి నాటి సాయంత్రం ఘడియలన్నీ దోషము లేనివని, ఆ సమయంలో చేపట్టిన పని విజయవంతమవుతుందని నమ్మకం. అందుకే పురాతన కాలంలో రాజులు విజయదశమి నాడు శత్రురాజ్యాలపై యుద్ధానికి బయలు దేరుతారు.
మహాభారతంలో పాండవుల అరణ్య, అజ్ఞాత వాసాలు విజయదశమి ముందు రోజున పూర్తి అవుతాయి. అజ్ఞాత వాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలను విరాట నగరంలోని స్మశానంలో ఉన్న శమీ (జమ్మి) వృక్షం పై మూట గట్టి భద్రపరుస్తారు. విజయదశమి నాడు ఆయుధాలను జమ్మి వృక్షం పై నుండి కిందికి దింపించి, ఆయుధ పూజ చేసి, ఉత్తర గోగ్రహణం చేపట్టిన కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధిస్తారు.
పై విషయాలను గుర్తు చేసుకుంటూ గ్రామంలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం, గోవర్ధన స్వామి ఆలయంలో పార్వేట ఉత్సవం నిర్వహించుట పురాతన కాలం నుండి ఆచారంగా వస్తున్నది. స్వామి వారిని గ్రామ వీధుల గుండా ఉరేగింపుగా తీసుకోని వెళ్తారు. గోవర్ధన స్వామి వారి పార్వేట ఉత్సవం నారాయణ స్వామి మఠం వద్ద, మూల స్థానేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం బ్రహ్మం గారి గుడి వద్ద నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది వర్షం పడుతున్నందున స్వామి వారి ఉత్సవ విగ్రహాలు వర్షంలో తడవరాదు కనుక ఆయా ఆలయాలలోని మండపాలలోనే పార్వేట ఉత్సవం నిర్వహించారు.
పార్వేట జరిపే విధానం: జమ్మి చెట్టు అందుబాటులో ఉంటే స్వామి వారిని అచటకు తీసుకు వెళ్తారు. లేదా జమ్మి కొమ్మలను తెచ్చి స్వామి వారి ఎదుట నాటించి, ఆ కొమ్మలలోకి సకల దేవతలను ఆవాహనం చేసి, వారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఒక గొర్రె పిల్లను స్వామి వారి చుట్టూ తిప్పి బయటకు వదులుతారు. హిందూ మతం లో కొందరు బలి ఆచారం పాటిస్తారు. జనమేజయుడు వైదిక మతంలో బలి నిషేధించారు, కనుక బలి ఆచారం తంతు పూర్తి చేసామని చెప్పుటకు గొర్రె పిల్లను స్వామి వారి చుట్టూ తిప్పి బయటకు తెచ్చి వదులుతారు. అనంతరం స్వామి వారి పేరుతో అష్ట దిక్కులలో బాణాలు వదులుతారు. ఇలా చేయుట వలన అన్ని దిక్కులలోని యక్షిణి, రాక్షస మూకలు పారిపోతాయని శాస్త్రం చెబుతుంది. జమ్మి ఆకులను ప్రసాదంగా స్వామి వారి విజయ శాసనంలో ఉంచి భక్తులకు అందచేస్తారు. దానిని బంగారంగా భావించి పెద్దలకు అందజేసి వారి ఆశీర్వచనం తీసుకోవాలి.
ఆలయమునకు పురాతన కాలంలో మాన్యములు ఇచ్చిన వారి పేరుతో మంత్ర పుష్పం నిర్వహించి, గ్రామ రక్షణ, గ్రామ శ్రేయోభివృద్ధి కై ఆలయంలో పూజలు జరపడంతో పార్వేట ఉత్సవం ముగిసింది.
పార్వేట విశేషాలు శ్రీ సీతారామ స్వామి దేవాలయం (వెంకటేశ్వర స్వామి గుడి) ధర్మకర్త, ఆగమ పండితులు శ్రీ పండా వెంకటప్పయ్య గారు తెలియజేసారు.

Subscribe to:
Posts (Atom)