Friday, October 22, 2010

అన్నాప్రగడ కామేశ్వరరావు - 5 వ భాగం

అన్నాప్రగడ 1937 మే నెలలో ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్త పట్నం లో వేసవి రాజకీయ పాఠశాలను నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాలను నిషేధించి వీరిని అరెస్ట్ చేసి జైలుకి పంపినది. జైలు నుండి విడుదలైన తర్వాత రేపల్లె తాలూకాలోని మంతెన వారి పాలెంలో మరో రాజకీయ పాఠశాలను విద్యావనం అనే పేరుతో నిర్వహించారు. వారి పని తనానికి మెచ్చి గ్రామస్తులు 50 ఎకరాల పొలాన్ని పాఠశాలకు రాసి ఇచ్చారు. సుభాష్ చంద్రబోసు ఏలూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా అయన ఎదుట విద్యావనం విద్యార్ధులు ప్రదర్శన నిర్వహించగా ముగ్దుడైన బోస్ ఇలాంటి విద్యా వనాలూ దేశమంతటా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ సిద్దాంతం నచ్చక వారితో తీవ్రంగా విభేదించారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని గుంటూరు వచ్చారు. గుంటూరు రాగా పోలీసులు అదుపులోనికి తీసుకోని నాదెండ్ల లో గృహ నిర్బంధం లో ఉంచారు. అక్కడ నుండి తప్పించుకొని గుంటూరు చేరి "విప్లవ జ్వాల" కరపత్రాలు ప్రజలకు పంచారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు అదుపులోనికి తీసుకోని కడలూరు జైలుకి, తర్వాత తంజావూరు జైలుకి పంపారు. జైలులో ఉండగా తండ్రి రోశయ్య మరణించినా ప్రభుత్వం పే రోలు మంజూరు చేయలేదు.

1946 లో జరిగిన శాసన సభల ఎన్నికలలో గుంటూరు - తెనాలి నియోజక వర్గ శాసన సభ్యునిగా పోటి చేసి అఖండ విజయం సాధించారు. అధికార పక్షపు శాసన సభ్యుడైనప్పటికి మంత్రుల అవినీతి చర్యలపై అసెంబ్లీ లో పోరాడి కాంగ్రెస్ పార్టి అధిష్టాన వర్గ ఆగ్రహానికి గురై పరోక్షంగా పార్టి నుండి వెలివేయబడ్డారు. మంత్రుల అవినీతి చర్యలు బట్ట బయలు చేసేందుకు " అంకుశం" అనే పత్రికను స్థాపించి, జర్నలిజం ద్వార సమాజానికి పహారా కాశారు. అన్నాప్రగడ గారి కృషి వల్లనే గుంటూరు లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించుట జరిగినది.ఆయన కుమారుడు క్రాంతి కుమార్ గోవా విముక్తి పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.

అన్నాప్రగడ ఆర్ధిక ఇబ్బందుల వలన, ఇక్కడ ఆదరించే వారు లేక కుటుంబ పోషణ కొరకు పూనాలోని తన మిత్రుని కంపెని " డాన్ మోమైన్స్ " లో ఉద్యోగంలో చేరాడు.

1 comment:

  1. annapragada chivari bhagam twaralo mee munduku.Now you can comment as anonymous visitor also. no need to sign in. --S.srinivasa Rao

    ReplyDelete