నాదెండ్ల గ్రామంలో 2-3-2008 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తానా సభ్యుడు అనుమోలు రమేష్ చౌదరి ఆధ్వర్యం లో పెద కాకాని శంకర్ కంటి ఆసుపత్రి సహకారం తో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 500 మందికి పరీక్షలు నిర్వహించగా, 380 మందికి ఆపరేషన్ కు వైద్యులు అనుమతించారు. వీరికి దశల వారీగా పెద కాకాని ఆసుపత్రి లో ఆపరేషన్ లు నిర్వహించారు. శిబిరం లో శంకర్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ మాధవి లత, అపర్ణ మరియు మెడికల్ సిబ్బంది వైద్య సేవలు అందించారు. శిబిరమునకు వచ్చిన రోగులకు వారి సహాయకులకు మొత్తం 700 మంది కి ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని అనుమోలు నరసింహారావు నిర్వహించారు.
No comments:
Post a Comment