వీక్షకులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు
4,5 రోజుల నుండి తెలంగాణా నాయకుల నుండి ఈ కామెంట్ ఎక్కువగా వినపడుతుంది. ఎవరి ఉద్యమాన్ని ఎవరు కాపీ కొడుతున్నారు? బాధ కలిగితే ఏడుపు సహజం.ఒక్కొక్కరి గొంతు ఒక్కొక్కలా గా ఉంటుంది. తెలంగాణా నాయకుల గొంతు పెద్దగా ఉంటుంది కాబట్టి వారిది కొంచెం పెద్దగా వినిపిస్తుంది.
ఒకసారి చరిత్ర లోకి వెళితే తెలంగాణాలో(నైజాంలో) తెలుగు వారు తీవ్రంగా అణిచివేతకు గురైన సమయంలో మొదటి గ్రంధాలయం పెట్టిన కొమర్రాజు లక్ష్మణరావు గారు ఆంధ్రడే. గ్రంధాలయాల స్ధాపన, పుస్తక ప్రచురణ ఒక ఉద్యమ స్ధాయిలో నడపటానికి ధన సహాయం,నైతిక మధ్దతు తెలిపింది ఆంధ్రా ప్రాంతం వారే. తెలంగాణా సాయుధ పొరాటానికి కావలసిన శిక్షణ, ఆయుధ సహాయం, తలదాచుకోవటానికి అవకాశం కల్పించిందీ ఆంధ్రులే! ఆ రోజుల్లో విజయవాడను స్టాలిన్ గార్డ్ అని కమ్యూనిస్ట్ లు పొగుడుకునేవారు. దీనికి ముందు తెలంగాణాలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించిన చండ్ర రాజేశ్వర రావు, పుఛ్చలపల్లి సుందరయ్య మొ. వారు ఆంధ్రులే. తెలంగాణా ప్రాంతం ఆయుధపోరాటం మొదలు పెట్టే దశలో ఉన్నప్పుడు ఆ ఉద్యమానికి ఊపు, ఉత్సహం ఇచ్చిన ఆంధ్ర ప్రాంతానికి ఈనాడు తెలంగాణా ఉద్యమాన్ని కాపీ కొట్టవలసిన అవసరం ఉందా?
తెరాసా నాయకులు శ్రీ KCR గారు నక్సలైట్ అజెండా మా పార్టీ ఆజెండా అంటున్నారు. నక్సలిజం ఎక్కట పుట్టిందో టి.నాయకులు మరచినట్లున్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పుట్టింది. ఆ సమయంలో చార్ మజుందార్, కాను సన్యాల్ మొ. వారు గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంలో నక్సలైట్ ఉద్యమ పధాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం, గుత్తికొండ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయా? ఇది ఉద్యమం కాదు, అభూత కల్పన కాదు. నక్సలిజం ఒక ఉద్యమ స్థాయిలో నడిచిన ఆంధ్ర ప్రాంతం తెలంగాణా ఉద్యమాన్ని కాపీకొట్ట వలసిన అవసరం ఉందా?
విజ్ఞులైన తెలంగాణా మేథావులకు విన్నపం ఏమంటే, నొప్పి పుట్టిన వాడు ఎవడైనా ఏడుస్తాడు. మీరు సకలజనుల సమ్మె చేసినప్పుడు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు సహకరించారు. వారు చేస్తున్నప్పుడు మీరు సహకరించండి లేదా చూస్తూ ఊరుకోండి. అంతేకానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల వారికి ఉద్యమ స్ఫూర్తిని ఎక్కువ చేయడం తప్ప మరొకటి కాదు.
ఉద్యమం ఇంత ఊపుగా జరగటానికి శ్రీ KCR గారికి, V. హనుమంతరావు గారికి, ఈటెల రాజేందర్ గారు మొ. అందరికీ వందవందనాలు. మీరు ఇదేవిధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటే మాకు ఉత్సాహం వస్తుంది. మీ అందరికీ వేయి వందనాలు.
బాగా చెప్పారండి. ఈ జాబితాలో కోదండరామ్ గారు ఖూడా చేరారు చూసారా? ఇక్కడి ఉద్యమం రాజ్యంగ విరుద్ధమంట! మొన్న ఒక పక్షపాత విశ్లేషకుడు కూడా టీవీలో ఇలాంటి ముక్కే చెప్పాడు. పైగా ఉద్యమాలంటే మాకు ఎంతో గౌరవం అని చెప్పుకుంటారీ ప్రొఫెసర్లు, వక్రవాణులు.
ReplyDeleteసాటి భారతీయులని పట్టుకొని "ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, సెటిలర్స్, పీకలు తెగ్గొడతాము, పండక్కు వెళ్ళిన వారు తిరిగి రారు తదితర మాటలూ, బండ బూతులు వాడినప్పుడు" భారత రాజ్యాంగం గుర్తులేదో లేక పాపం ఈ మధ్యనే రాజ్యాంగం చదవటం మొదలెట్టారో మరి. కోట్లమంది ప్రజలు వ్యతిరేకించినా ఎదొ ప్రాంత ప్రజలు విడిగా ఉందామంటే ఒప్పుకునేంత బలహీన రాజ్యాంగం కాదు మనది; దేశ ప్రజల అభిమతం తప్పనిసరిగా కావాలి. బగుశా ఇప్పుడిప్పుడే రాజ్యాంగం చదువుతున్నారు కదా, ప్రొఫిసరు గారికి ఈ విషయం తెలిసి వస్తుందనుకుంటా. రాష్ట్రం ఏర్పడటం అంటే దేశం ఎర్పడటం అన్న లెవెల్లో అందరినీ తరిమేసి తామొక్కరే ఉండటం అనుకున్న ఈ ప్రఫిసర్ల గుంపు అతి బిల్డప్పు ఇవ్వటం వలనే ఇప్పుడు ఆ రాష్త్ర ఎర్పడటానికి అడ్డంకి అని వీరు తెలుసుకుంటే మంచిది.
ReplyDelete>>>>> విజ్ఞులైన తెలంగాణా మేథావులకు విన్నపం ఏమంటే, నొప్పి పుట్టిన వాడు ఎవడైనా ఏడుస్తాడు. మీరు సకలజనుల సమ్మె చేసినప్పుడు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు సహకరించారు. వారు చేస్తున్నప్పుడు మీరు సహకరించండి లేదా చూస్తూ ఊరుకోండి.<<<<<
ReplyDeleteఈ సూచన ఎంత హాస్యాస్పదమైనదో
పునరాలోచిస్తే మీకే బోధ పడుతుంది.
2001 లొ రాజ శేఖర రెద్ది
పీ సీ సీ ప్రెసిడెంట్ గా వున్నప్పుడు టీడీఫీని దెబ్బ తీసేందుకు
తెలనగాణా ఏర్పాటు డిమాండ్ ని రాజేశాదు.
2004లొ టీ ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుని ఆ డిమాండ్ని పరాకాష్టకు చెర్చారు
ఆ తర్వాత అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలం అంటూ
సె డబ్ల్యు సీ, యు పీ ఏ పార్టీలన్నీ తెలంగాణా ను 29 వ రాష్ట్రం గా తీర్మానిచాయి.
ఇప్పుడు అందరూ రెండో సారి యు టర్న్ తీసుకున్నా,
తలకిందులు తపస్సు చెసినా లాభం ఎమిటి?
ఇంకా ఎందుకీ అనవసరపు ఆందోళనలు హంగామా ?
రాజ్యాంగ విరుధ్ధం కాదా మరి తమాషానా
తెలంగాణా రాష్ట్రం దాదాపు ఏర్పడినట్లే!గతజల సేతుబంధనాలు ఆపి కొత్త రాజధానిని అభివృద్ధి చేసుకోండి!హైదరాబాద్ రాజధానిగా ఇరవై తొమ్మిదో రాష్ట్రాన్ని తెలంగాణా బిడ్డలు అభివృద్ధి చేసుకుంటారు!తెలంగాణా వారిది కానిదేదీ వారు తీసుకోరు వారిదేదీ మీకు ఇవ్వరు!ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు ఏ మార్గదర్శక సూత్రాల ప్రాతిపదికన ఏర్పడినాయో అవే అనుసరిస్తారు!తెలంగాణా ఆంధ్రసీమ భాయి భాయి!తెలుగుభాష రెండు రాష్ట్రాలలో వర్ధిల్లాలి!రాష్ట్రాలుగా విడిపోయి మనసు కల మనుషుల్లా కలిసుందాం!
ReplyDeleteతెలంగాణా వస్తే, తెలంగాణాలో నక్సలిజం, టెర్రరిజం వంటివి పెరిగిపోతాయి. హైదరాబాదులో ఉన్న కరెంటు మిగిలిన తెలంగాణా జిల్లాల్లో ఉండదు. పెద్ద పెద్ద కంపెనీలు వలసవెళ్ళిపోతాయి. ఇప్పటికే రావాల్సిన కంపెనీలు దారి మళ్ళి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఇక ఆంధ్రాకు గోదావరి నీళ్ళు అందవు, మరో రాయలసీమ గా మారుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అని తెలంగాణా నాయకులు గ్రహించాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ దేవుడు కూడా రక్షించలేడు, గుండెలు బాదుకున్నా లాభం ఉండదు. హైదరాబాదును సుమారు 50 ఏళ్ళ పైబడి ఎంతో శ్రమించి సీమాంధ్రులు, ఇతర రాష్ట్రాలవారు అభివృద్ధి చేశారు. తెలంగాణా ఉద్యమం హుస్సేన్ సాగర్ లా పొంగితే, సీమాంధ్ర ఉద్యమం సముద్రంలా పొంగింది. రాష్ట్రం విడిపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ఇంకెవరికీ ప్రయోజనం ఉండదు. సీమాంధ్ర ప్రాంతాలకు మాత్రం తీరని నష్టం
ReplyDelete