Showing posts with label హిస్టరీ. Show all posts
Showing posts with label హిస్టరీ. Show all posts

Friday, May 18, 2012

నల్లమోతువారి తాంబూలం -మూడవ ( చివరి) భాగం

గోవర్దన స్వామి ఆలయం వద్దకు చేరిన వీరలక్ష్మి నవాబు పంపిన అధికారులతో " ఒక మేడి తెప్పించండి. దానిని మీ సమక్షంలో నాటుతాను. మూడు రోజులలో దానికి ఆకులు వస్తాయి" అని చెప్పింది. అప్పుడు అధికారులు ఊరంతా వెదికించి అరవై, డెబ్బై సంవత్సరాల నుండి వాడుతున్న తుమ్మమేడి ని తెప్పించి ఇచ్చారు. మేడిని తీసుకున్న వీరలక్ష్మి పాది తీయించి, మేడికి పసుపు కుంకుమలు సమర్పించి పూజ చేసి పాదిలో నాటింది. రెండు రోజుల పాటు మార్పు చూపించని మేడి మూడో రోజు తెల్లవారే సరికి ఆకులతో కళకళలాడుతూ కనిపించింది. ( మూడు రోజులు మేడి చుట్టూ కొందరు కావలిగాళ్ళని కాపలా ఉంచారు. తుమ్మ కట్టె ఎండిపోయినది అయితే ఇగురు పెట్టదని అరవై సంవత్సరాల నుండి వాడుతున్న తుమ్మ మేడిని తెప్పించారు.)

విషయం తెలుసుకున్న నవాబు తన తప్పు తెలుసుకొని క్షమించమని కోరి, "మీ కోరిక ఏమిటో చెప్పండి తీరుస్తాను" అనగా, పైట పన్ను రద్దు చేయమని కోరగా... "అది ఎలాగు చేస్తాను, మీకు ఏమి కావాలి?.. మాన్యాలు, బంగారు ఆభరణాలు, ఆవులు.. వీటిలో ఏది కావాలన్నా ఇస్తాను" అనగా, " అయ్యా! మాకు విధమైన కానుకలు వద్దు. శుభకార్యం జరిగేటప్పుడు నల్లమోతు వారి పేరిట ఒక తాంబూలం తీయాలి" అని అడిగారు.

ఎంతో సంతోషించిన నవాబు వారు కోరుకున్న విధంగా తన రాజ్యమంతా శుభకార్యాలలో నల్లమోతు వారి తాంబూలం తీయాలని ఒక ఫర్మానా విధించాడు. నాటి నుండి ఆంధ్ర దేశమున అని కులాల వారు శుభకార్యాలు జరుగునపుడు దేవుని తాంబూలంతో పాటు, నల్లమోతు వారి తాంబూలం తీయుట ఆచారంగా వచ్చుచున్నది. ఇలాంటి అరుదైన విషయం కేవలం నాదెండ్ల గ్రామమునకు మాత్రమే స్వంతము.

నల్లమోతు వారి తాంబూలం - 1 వ భాగం

ఆంధ్ర దేశమున నాదెండ్ల గ్రామమునకు మాత్రమే స్వంతమైన సంస్కృతిక వారసత్వం మన పూర్వీకులు మనకు ఇచ్చిన పెద్ద ఆస్థి. పెద్దలు ఇచ్చిన వేల ఎకరాలు, కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకొని బికారులు అయిన వారు చరిత్రలో ఎందఱో ఉన్నారు. కానీ నాటికీ తరగని పేరును మన గ్రామమునకు ఇచ్చినందుకు వారికి మనమెంతో రుణపడి ఉన్నాము.

నా చిన్నతనంలో నల్లమోతువారి తాంబూలం అనే మాటను విన్నాను. అదేమాటని పెద్దలను అడుగగా "ఏమో తెలియదు, శుభ కార్యములు జరిగేటప్పుడు తంబూలాలు పంచుతారు. ముందుగ దేవుని తాంబూలంతో పాటు మరో తాంబూలం తీసి, మిగిలిన వాటిని పంచుతారు. రెండో తాంబూలం నల్లమోతువారి తాంబూలం. ఇంటి పేరు గలవారు దగ్గరలో ఉంటే వారికి ఇస్తారు" అని చెప్పారు. ఎన్నో సంవత్సరాల పాటు నన్ను వేధించిన ప్రశ్నకు జవాబు గ్రామానికి వచ్చినపుడు దొరికింది. అంతటి ఘనమైన చరిత్రను మనం మరొక్కసారి పూర్తి వివరాలతో తెలుసుకుందాము.

అవి ముస్లిం రాజులైన కుతుబ్ షాహీలు పరిపాలించే రోజులు. వారి పరిపాలనలో దేవాలయాలను ధ్వంసం చేయుట, హిందువులకు జుట్టు పన్ను విధించుట చేసేవారు. దుర్మార్గుడైన కొండవీటి పరగణ పాలకుడు ఖైజర్ ఖాన్ జుట్టు పన్నుతో పాటు అడ వారికి పైట పన్ను కూడా విధించాడు. కాలములో నాదెండ్ల గ్రామములో తిమ్మినీడు, తమ్మినీడు అను ఇద్దరు సోదరులు గలరు. వారు వీరాధివీరులు. వారి మాటకు గ్రామంలో అందరు విలువ ఇచ్చేవారు. వీరికి వీర లక్ష్మి అను సోదరి కలదు. ఆమె ప్రతిరోజూ దేవుని పూజలు శాస్త్రోక్తంగా చేసెడిది. అన్నలు ఇద్దరు ఆమె సలహా ప్రకారం నడిచే వారు.

గ్రామంలో పైట పన్ను గురించి దండోరా వేయగానే తీవ్ర అలజడి రేగినది. గ్రామస్తులందరూ తమ్మినీడు సోదరుల వద్దకు రాగా సోదరి వీర లక్షి సలహాతో నవాబు పై సమ్మె ప్రకటించారు. సమ్మె ప్రకారం నవాబు ఆస్థానంలో దివిటీలు పట్టుకునేవారు, వాయిద్యాలు మోగించేవారు, మిగిలిన పనివారందరు కుడి చేతిని నల్లమోతు వారి సమ్మెకు మద్దతుగా ఇస్తూ ఎడమ చేతితో మాత్రమే పని చేయాలి. సమస్య భారత స్త్రీ గౌరవానికి సంబంధించిన సమస్య కావటంతో కుల,మాట భేదం లేకుండా అందరు సమ్మెలో పాల్గొన్నారు. ( ఇంకా ఉంది...)