Friday, January 4, 2013

నాదెండ్ల NRI లు పెద్దబడి, హై స్కూల్ లకు రు. లక్ష విరాళం అందజేత


నాదెండ్ల గ్రామ NRI లు చేతులు కలిపి గ్రామ విద్యాభివృద్ధికి తోడ్పాటు నందించారు. గ్రామంలోని పెద్దబడి(శివాలయం వీధి), హై స్కూల్ లకు రు . లక్ష విరాళంగా అందించారు. ఈ రోజు పెద్దబడి లో జరిగిన కార్యక్రమంలో MDO  శ్రీమతి దాసరి అనురాధ గారు , నాదెండ్ల గ్రామ వెటర్నరీ డాక్టర్  కుమారి మన్నె శిరీష  గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు .   NRI  లు శ్రీ  నల్లమోతు జయరాం , శ్రీ నల్లమోతు నాసరయ్య, శ్రీ నెల్లూరి సత్యనారాయణ, శ్రీ మురళి (ఝాన్సీ రాణి టీచర్ గారి అబ్బాయి)  గార్లు అందజేసిన లక్ష రూపాయలను  ముఖ్య అతిధులు అనురాధ , శిరీష  గార్లు పెద్దబడి ఉపాధ్యాయ బృందానికి, హై స్కూల్ ప్రధానోపాధ్యయులు I . ఆంజనేయులు గారికి రు .50,000/- చొప్పున అందిచారు. 


 నాదెండ్ల గ్రామ విద్యాభివృద్ధికి దాతలు మరింతగా ముందుకు రావాలని  శ్రీ నల్లమోతు జయరాం గారు ఆకాంక్షించారు. పెద్దబడి ఉపాధ్యాయులు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు NRI లు అందిస్తున్న సహకారాన్ని శ్లాఘించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వారు అందించిన మొత్తం తో త్వరలో పనులు పూర్తి చేయగలమని హామీ ఇచ్చారు. NRI  చేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను మన్నె  కుమారస్వామి గారు ఆహుతులకు వివరించారు.  


     సదరు మొత్తాన్ని పెద్దబడి వారు  విద్యుత్తు పనుల కోసం, మంచి నీళ్ళ  ట్యాంక్, మోటార్, పైపింగ్ పనుల కోసం వినియోగించనున్నారు. హై స్కూల్ వారు బల్లలు, పోడియం, స్పోర్ట్స్ డ్రెస్ లు, కార్డు లెస్ మైక్ , స్టాండ్ బ్లాకు బోర్డు లు మొదలైనవి సమకూర్చుకోనున్నారు .
  
    ఈ కార్యక్రమంలో పెద్ద బడి ఉపాధ్యాయులు k.శ్రీనివాసరావు, I . వెంకటేశ్వరరావు, N. ఉమా  మహేశ్వరీ, ఉమ తదితరులు , హై స్కూల్ ఉపాధ్యాయులు శ్రీ B . శ్రీనివాస రావు గారు, CD  స్కూల్ HM  శ్రీ బ్రహ్మాజీ గారు, TC స్కూల్ HM శ్రీ రామయ్య గారు, మధుసూదనరావు గారు, ఇంకా నాదెండ్ల ఆన్ లైన్ సభ్యులు కుమార స్వామి , S .శ్రీనివాసరావు, విలేఖరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment