Tuesday, December 14, 2010

శ్రీ మద్ అచలరుషి పూర్ణనంద రాజ యోగి సద్గురు పీఠము

పీము నాదెండ్ల గ్రామం లో దేవభక్తునివారివీధి నందు, నల్లమోతు. వెంకట నాగేశ్వరరావు,(మాజీసర్పంచ్)గారి దొడ్డిలోవుంది.స్తానికభక్తులు,1962లో సికింద్రాబాద్నందువున్న, పాబోయి.గుండరాజయోగిఆశ్రమంనుండిఇక్కడకుతీసుకువచ్చిప్రతిష్టచేసుకున్నారు.అప్పటిగురువుపుర్ణానంద,భిమానంద,అప్పయ్య ఆచార్యులు ఇక్కడకు వచ్చి శిష్యులకు భోదచేసి ,గురూపదేసం ఇచ్చి తరింప జేస్తున్నారు . ఈ పీఠము నందు ప్రతి పౌర్ణమి కి గురుపూజ జరుగును. భజనలు సత్సంగం చేస్తారు .తీర్ధ ప్రసాదాలు తీసుకుంటారు .గ్రామం లో సుమారు 100 కుటుంబాల వారు ఈ పీఠమును అనుసరిస్తారు.ఈ పీఠమునందు కార్తిక పౌర్ణమి,గురు పౌర్ణమి విశేషంగా పూజలు జరుగును.కార్తిక పౌర్ణమి నాడు కోరిన భక్తులకు గురు ఉపదేశం ఇస్తారు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.గురు పౌర్ణమి నాడు గురు పరంపర లోని ప్రస్తుత గురువు ను ఆహ్వానించి గురు పూజ జరుపుతారు .భజన కార్యక్రమము ,ఆరాధనలు ఘనంగా జరుగును. ప్రస్తుత గురువు తోట కృష్ణారావు గారు తెలిపిన పూర్వ గురువులు:1.శ్రీ మహా విష్ణవు,2.సూర్య భగవానుడు,3.యజ్ఞావల్కి,4.జనకుడు,5.శుకుడు,6.సాందీపుడు,7.శ్రీ కృష్ణుడు,అర్జునుడు, వుద్భావుడు,గోపిక లందరికి చెప్పాడు .కలియుగం లో ఆయన అంశ 1.శ్రీధరస్వామి ,పండరీపురం .ఆయన శిషుడు .2.రామడుగు శివరామ దీక్షితులు 3.అప్పబ్రహ్మ ,4.పరశురామ సీతారామ శాస్త్రి,5.శ్రీ కృష్ణ దేశి కేంద్రులు ,6.పీలకాన లక్ష్మనాచార్యులు ,7.పగడాల వెంకటేశ్వర అవధూత ,8.మందలప్ప హనుమయ్య ,.9.దయానంద రాజయోగి ,10.పూర్ణనందకొండమడుగు వెంకటరెడ్డి ,11. పూర్ణనంద భీమనంద అయ్యప్పఆర్యులు,12 .కృష్ణానందకృష్ణారావు (ప్రస్తుత గురువు )చీరాల, కురుచేడు,అగ్రహారం ,గుంటూరు, విజయవాడ,నాగార్జునసాగర్,నరసరాపేట,ఇంటూరు,బాపట్ల,కాకాని, వెనిగండ్ల.మొదలైన ప్రాంతాలలో ఈ గురుపీఠము నెలకొల్ప బడివున్నది.

No comments:

Post a Comment