Saturday, December 18, 2010

నాదెండ్ల గ్రామం లో ఘనంగా జరిగిన "మొహారం"(పీర్ల పండుగ) వేడుకలు

మొహారం మాసం పదవ తేదిన"యౌమె ఆషూరా"అంటారు ఇస్లామీయ ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత వుంది. ఈరోజు ముస్లింలు రోజా(ఉపవాసం)పాటిస్తారు ఎందుకంటే ఈ"ఆషూరా"రోజునే దైవం ఈ సృష్టి ని సృజించాడు మొట్ట మొదటి సారిగా ఆకాశం నుంచి వర్షం కురిసింది "ఆషూరా" రోజునే. ఈ "ఆషూరా"రోజున ఉపవాసాన్ని పాటించినవారు సుధీర్గ కాలం ఉపవాసాలు పాటించిన దానితో సమానమని అంటారు. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలి గా ఉన్నవారికి అన్నదానం చేయటం, వస్త్రహినులకు వస్త్రాలివ్వటం, ప్రేమగా అనాదుల తల నిమరటం, దాహార్తుల దాహం తీర్చటం, ఆపద లో వున్నా వారిని ఆదుకోవటం, రోగులకు సహాయం చేయటం వంటి పనులు చేసిన వారికి దైవం స్వర్గం లో అమిత మైన గౌరవాన్ని ప్రసాదిస్తాడు.స్వర్గ దస్తర్ ఖాన్ ఫై వారికి విందు ఏర్పాటు చేస్తాడు.స్వర్గం లో ని "సల్ సభీల్"అనే సెలయేరు మధువును త్రాగిస్తాడు. ఈ మాసం 9, 10 తేదీలు లేక ,10, 11 తేదీలు "ఆషూరా" రోజులు పాటించాలి.

No comments:

Post a Comment