Wednesday, April 20, 2011

హాస్టల్ ను సందర్శించిన శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు


హాస్టల్ కు విచ్చేయుచున్న శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.

సభనుద్దేశించి ప్రసంగిస్తున్న M.E.O. శ్రీ M.V. సుబ్బారావు గారు

విద్యార్ధులకు బహుమతులు అందజేస్తూ...


A.P.S.W. హాస్టల్ నందు జరిగిన ప్రతిభావంతులైన విద్యార్ధులకు మెడల్స్, షీల్డ్స్ అందజేసే కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు హాజరైనారు. కీర్తి రూరల్ డెవలప్ మెంట్ అండ్ సోషల్ సర్వీసు సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ మద్దుల వెంకట కోటయ్య ( చిలకలురిపేట) గారు ప్రతిభావంతులైన విద్యార్ధులకు మెడల్స్, షీల్డ్స్ అందజేయటం తో పాటు ప్రతి హాస్టల్ విద్యార్ధికి చెప్పుల జతలను అందించారు.
MLA గారు మాట్లాడుతూ హాస్టల్ అవసరాలైన డార్మెటరి నిర్మించుటకు కావలసిన నిధులు మంజూరుకు ఆలోచన చేయగలనని అయన హామీ
ఇచ్చారు. విద్యార్ధులు హాస్టల్ లో కల్పిస్తున్న వసతులను చక్కగా వినియోగించుకొని, మంచి విద్యా బుద్ధులు నేర్చి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

డిస్ట్రిక్ట్ హాస్టల్
వెల్ఫేర్ఆఫీసర్ శ్రీమతి శోభా రాణి గారు మాట్లాడుతూ, హాస్టల్ ను మోడల్ హాస్టల్ గా తీర్చి దిద్దుతున్న వార్డెన్ శ్రీ రాజా బాబు గారిని అభినందించారు. కార్యక్రమంలో sarpanch srimati davala narasamma garu, నాదెండ్ల మండల M.E.O. శ్రీ M.V. సుబ్బారావు గారు, పంచాయత్ సెక్రటరీ శ్రీ పాల్ గారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment