Saturday, December 3, 2011

సెల్ విత్ స్మెల్

మన దగ్గర వైబ్రేషన్ (స్పర్శ) తో పలకరించే సెల్ ఫోన్స్ ఉన్నాయి, రింగ్ టోన్ (వినికిడి) తో పలకరించే సెల్ ఫోన్స్ఉన్నాయి. ఇంకా సైలెంట్ మోడ్ లో కాల్ వస్తున్నప్పుడు కేవలం లైట్ లేదా వీడియో ( దృష్టి) చూపించే సెల్ ఫోన్స్ఉన్నాయి. కాల్ వచ్చినప్పుడు సువాసన వచ్చే సెల్ ఫోన్స్ వస్తే బాగుంటుంది కదా!.

ఇల్లాలు ఫోన్ చేస్తే మల్లె పూల పరిమళం ! ప్రియురాలు ఫోన్ చేస్తే గులాబీల గుబాళింపు !! బాసు ఫోన్ చేస్తే కుళ్ళిన కోడి గుడ్డువాసన, బార్ నుండి ఫోన్ వస్తే ఆల్కహాలు వాసన . సొంతింటి నుండి ఫోన్ వస్తే సాంబారు ఘుమాయింపు , అత్తగారింటి నుండి ఫోన్ వస్తే మసాల దాబా'యింపు' . భర్త ఫోన్ చేస్తే అగరొత్తుల ఆఘ్రాణింపు (పతి దేవుడు కదా)! బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే సెంట్ పలకరింపు ........!! ఇలా పెట్టుకోవచ్చన్నమాట.

జాగ్రత్త సుమండీ వైరు కాలిన వాసన వస్తే మీ సెల్ ఫోన్ వేడెక్కి కాలిపోతున్నట్లు .
మరి మన జ్ఞానేంద్రియాలలో మిగిలినది 'రుచి' దానిని Caller Id గా ఎలా వాడొచ్చో సరదాగా మీ ఊహ కాస్త చెప్దురు.

No comments:

Post a Comment