Thursday, December 15, 2011

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదలచిన వారికి సూచనలు, సలహాలు ఇచ్చుటకు ఆహ్వానం

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు శుభాభివందనాలు. మన గ్రామంలో యువతరం ఎక్కువగా ఇంజనీరింగ్ చదువుతున్నవారే. ఇంజనీరింగ్ లో బ్రాంచ్ తీసుకున్న ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి కారణం 1. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు 2. కాంపస్ ఇంటర్వ్యూ లు . ఆకర్షనీయమైన శాలరీ 4. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు 5. సమాజంలో గౌరవం మొదలైనవి. కనుక ఇంజనీరింగ్ చదువుతున్న వారికి, పూర్తయ్యి హైదరాబాద్ వంటి చోట్ల సాఫ్ట్ వేర్ కోర్సెస్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి, కాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వటానికి ఎదురు చూస్తున్న వారికి, జాబ్ లో కొత్తగా జాయిన్ అయిన వారికి సీనియర్స్ యొక్క సూచనలు, సలహాలు ఎంతైనా అవసరం అని భావిస్తున్నాము. ఏయే కోర్సెస్ లో మంచి అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి అర్హతలు కావాలి? ఎలాంటి బుక్స్ చదవాలి ?ఏయే institutes లో శిక్షణ బాగుంటుంది ? Resume ఎలా తాయారు చేసుకోవాలి? ప్రాజెక్ట్ మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ అవసరమవుతాయి? HR తో ఎలా మేనేజ్ చెయ్యాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? వీటికి ఉపయోగపడే websites ఏమిటి? మొదలైన విషయాలలో సీనియర్లు గా మీ అనుభవాలు, సలహాలు, సూచనలు వారికి ఎంతగానో లాభిస్తాయి. మీరు ఇవ్వదలచుకున్న సలహాలు మెయిల్ రూపంలో గానీ (mannekumaraswamy@gmail.com), ఈ పోస్టింగ్ కి కామెంట్ రూపంలో గానీ ఇచ్చి వారికి సహాయ పడగలరని ఆశిస్తున్నాము.
ఇట్లు
మన్నెకుమరస్వామి, నాదెండ్ల ఆన్ లైన్.

1 comment: