Saturday, August 10, 2013

ఒక ఇల్లు- వంద మొక్కలు

     నారాయణ స్వామి మఠం వెనుక బజారులో ఉన్న వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తుంటే దారిలో నల్లమోతు సిద్దయ్య గారి ఇంట్లోని  చెట్లు ఆపాయి.  బయట నుండి ఆ ఇంటిని ఎన్నో సార్లు చూసి ఆహా! అనుకున్నాను. ఆ ఇల్లంతా చెట్లు మొక్కలే కనిపిస్తాయి. మా HM  సార్  తో పాటు లోపలికి వెళ్లాను. నాదెండ్ల లో  ఇంతకన్నా (బయో )రిచ్ హౌస్ లేదనిపించింది. ఇంత శ్రద్ధగా మొక్కలు పెంచుతున్న వారి అభిరుచిని మనసారా అభినందించాము. మొక్కలను సొంత బిడ్డల్లగా పెంచుకుంటున్నారు నల్లమోతు సిద్ధయ్య దంపతులు. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయో గమనిస్తారు ఆవిడ.

 జామ, సపోట, సీతాఫలం, నిమ్మ,వాటర్ యాపిల్,అరటి,దానిమ్మ, ద్రాక్ష లాంటి పండ్ల చెట్లు, సంపంగి,మల్లి, గులాబీ, నందివర్దనం, నూరువరహాలు, బంతి, చామంతి, లిల్లీ, కాగితం పూలు,గన్నేరు, పసుపు పూలు లాంటి పూల మొక్కలు,  ఇంకా కరివేపాకు, ఈత జాతి మొక్క,టేకు,కలబంద,మనీప్లాంట్ లతో పాటు మరిన్ని షో చెట్లతో అలరారు తున్న  ఆ ఇల్లు నిజంగా కలల సౌధం.  పచ్చని  చెట్ల సౌందర్యాన్ని ఆశ్వాదించి  మరోసారి వారి ఇంటిని సందర్శించటానికి అనుమతి తీసుకొని వచ్చాము.
పెరటి తోట

జామ

పసుపు పూలు

గన్నేరు

నందివర్ధనం


నిమ్మ

వాటర్ యాపిల్

సపోట

సీతాఫలం

నిమ్మ

సంపంగి



గులాబి

నల్లమోతు సిద్దయ్య గారు


దానిమ్మ

జామ

నూరు వరహాలు

గులాబి

కరివేపాకు

కలబంద

ద్రాక్ష

అరటి

టేకు

ఈత జాతి మొక్క

మల్లి

బంతి

చామంతి


లిల్లీ

మనీ ప్లాంట్






కాగితంపూలు


1 comment:

  1. chaala baagundi siddaiah garu dhanyulu. konni mokkala peerlu raayaleedu.

    ReplyDelete